బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

yes-bank-cricis-apsrtc-deposits-stalled-bank
YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

దేశంలో ఒకవైపు కరోనా వైరస్ దెబ్బకి అందరూ భయంతో వణికిపోతుంటే ..మరోవైపు ఎస్ బ్యాంక్ దెబ్బ కూడా అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గత కొన్ని రోజులుగా సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంక్ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. దీనితో పలువురు ఎస్ బ్యాంక్ ఖాతాదారులు లబోధింబోమంటున్నారు. తాజాగా ఎస్ బ్యాంక్ బాధితుల్లో apsrtc కూడా చేరింది. గతంలో అధిక వడ్డీకి ఆశపడి apsrtc ఎస్ బ్యాంక్ లో లావాదేవీలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు.



తాజాగా రోజువారి చెల్లింపుల్లో భాగంగా బ్యాంకుకు వెళ్లిన ఆర్టీసీ అధికారులకు బ్యాంకు షాకిచ్చింది. రూ.50 వేలకు మించి తీసుకోటానికి వీలులేదని బ్యాంకు సిబ్బంది చెప్పటంతో అధికారులకు దిమ్మతిరిగింది. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. డీజిల్ కొనుగోలుకు డబ్బులు ఎలా సర్దుబాటు చేయాలన్న ఆందోళన వారిలో మొదలైంది. విజయవాడలోని యస్ బ్యాంకు హెడ్ ఆఫీసులో అకౌంట్ ప్రారంభించి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తోంది. ఎప్పుడూ ఓడీలు వాడుకునే సంస్థకు జనవరి 2020 నుంచి సిబ్బంది జీతాలు ప్రభుత్వం చెల్లిస్తుండటంతో అకౌంట్లో నిధులు నిల్వచేసుకునే అవకాశం లభించింది. జనవరి నెలకు సంబంధించిన జీతం ప్రభుత్వం ఆర్టీసీకి ఫిబ్రవరిలో చెల్లించింది. ఈ డబ్బుల్లో నుంచి రూ.120కోట్లు యస్ బ్యాంకులోని ఆర్టీసీ ఖాతాలో జమ అయింది.

దీంతోపాటు రోజువారీ వచ్చిన కలెక్షన్ల డబ్బులు రూ.80కోట్లు ఏ రోజుకు ఆరోజు బ్యాంకు లో డిపాజిట్ చేశారు. సిబ్బంది జీతాల నుంచి రికవరీ చేసిన మరో 40కోట్ల రూపాయల డబ్బులు కూడా ఇదే బ్యాంకులోని పీఎఫ్ ఖాతాకు బదిలీ చేశారు. దీంతో మార్చి మొదటి వారం ముగిసే నాటికి మొత్తం రూ.240కోట్లు యస్ బ్యాంకులో నిల్వఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్ బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఖాతాదారులు ఏటీఎంలకు క్యూ కట్టడంతో పరిస్థితి పూర్తిగా చేయిదాటి పోయింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం డిపాజిటర్లకు భరోసా ఇస్తూ నెల రోజుల పాటు లావాదేవీలు అతి తక్కువ గా జరపాలని ఆంక్షలు పెట్టింది. దీని ఫలితం గా అకౌంట్స్ లో కోట్లు పెట్టుకొని కూడా రూ.50వేలకు మించి తీసుకోలేని పరిస్థితి వచ్చింది. దీనితో సాధారణంగా జాతీయ బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లను వడ్డీకీ ఆశపడి ఇలాంటి బ్యాంకుల్లోకి మార్చారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కేంద్రం చెప్పిన నెల సమయం తరువాత అయినా కూడా ఆ మొత్తం డబ్బు వస్తుందో రాదో అని ఆర్టీసీ వర్గాలు ఆందోళనలో ఉన్నారు.

5 comments:

  1. ఓహో, PF ఖాతా కూడా అదే బ్యాంకులో పెట్టుకున్నారా? సెహబాసు, సెహబాసు 👏.

    ప్రభుత్వ శాఖలు / సంస్ధలు తమ డిపోజిట్లను జాతీయ బ్యాంకులలోనే పెట్టాలని ఒకప్పుడు గవర్నమెంటు వారి ఆంక్ష ఉండేది (ఎప్పుడంటారా? ఓ రెండు వేల సంవత్సరాల క్రితం అనుకుందామా 😡 ? ఎందుకంటే అన్ని వ్యవస్ధలూ భ్రష్టు పట్టి పోయి అంత కాలం అయిపోయిందే అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు). తరువాత ఈ అధిక వడ్డీ మోజులో చిక్కుకున్నారు. దాంతో తమ (అంటే ప్రజల) సొమ్ముకు తాము ధర్మకర్తలం (trustees) అనే సంగతిని పక్కకు నెట్టేసి, వడ్డీ కంటే అసలు యొక్క భద్రత ప్రధానమనే మాట మరిచిపోయారు. కొటేషన్లు ఆహ్వానించి మరీ, తాము ఎక్కువ వడ్డీ ఇస్తామనే బ్యాంకులో ... తాడూ బొంగరం లేని బ్యాంక్ అయినా సరే ... డిపాజిట్లు పెట్టడం మొదలయింది. కొంత పైనుండి రికమెండేషన్లు / ఒత్తిడి కూడా ఉండచ్చు. ఫలితం ... ఒక్కోసారి ఇలా లబోదిబోమని మొత్తుకోవడం. అది TTD కానీండి (వీళ్ళు కాస్త ముందే కళ్ళు తెరిచారని ఈ మధ్య వార్త), RTC కానీండి, మరో ప్రభుత్వ రంగ సంస్ధ(లు) కానీండి.

    కార్పొరేట్ సంసృతి, వ్యాపార సంసృతి లను నెత్తిన పెట్టుకుంటున్న ........ మేరా భారత్ మహాన్ 🙏.

    ReplyDelete
    Replies
    1. అన్ని గుడ్లూ ఒకే బుట్టలో పెడితే తుఫాను తరవాత ఆమ్లెట్ కి కూడా నోచుకోలేమని బఫెట్ మహాశయుడు చెప్పాడు. అంచేత అడపా దడపా ప్రయివేట్ బ్యాంకును వాడుకోవడం మంచిదే కానీ, బాంక్ బడ్డలవుతోందని పోయిన ఏడాది నుంచీ వార్తలు వస్తున్నపుడే కళ్లు తెరవాల్సింది. ఎలాగూ ఆర్థిక మంత్రి భరోసా ఇస్తున్నారు కాబట్టి RBI దగ్గరే అందాకా అప్పు తీసుకుని సెంట్రల్ గవర్నమేంటోరి దగ్గర వసూలు చేసుకోమంటే సరి!

      Delete
    2. అడుసు తొక్కనేల, కాలు కడగనేల 🤘.
      భారతదేశంలో జాతీయ బ్యాంకులు చాలానే ఉన్నాయి కాబట్టి “ఒకే బుట్ట” అనే ప్రశ్నే రాదు.

      Delete
    3. జాతీయ బ్యాంకులెన్ని ఉన్నా జాతి ఒక్కటే.పబ్లిక్ బ్యాంకులని నడిపించే ప్రభుత్వం ఒకటే.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...