బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ప్రతి బుధవారం "Sakshyam TV"లో ఒక వ్యక్తిత్వవికాస ప్రోగ్రామ్!

గౌరవనీయులైన బ్లాగు వీక్షకులకు శుభవార్త. Sakshyam టి‌వి లో ప్రతి బుధవారం ఉదయం 7గంటలకు వ్యక్తిత్వవికాస ప్రసంగం ఒకటి ప్రసారమవుతుంది. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యల నుండి మనం ఎలా బయటపడాలి? మనలో ఉన్న స్కిల్స్ ను ఎలా డవలప్ చేసుకోవాలి? మన చుట్టూ అనేకమంది వ్యక్తులు ఉంటారు. వాళ్ళలో మనకి ఉపయోగాన్ని కలిగించేవారు, నష్టపర్చేవారు కూడా ఉంటారు. మనం ఎవరితో ఎలా ఉండాలి? ఎంతవరకూ ఉండాలి? ఇత్యాది అద్భుతమైన విషయాలు మీకు ప్రతి బుధవారం అందించబడతాయి. వివరాలకొరకు "సాక్ష్యం టివి" చూడండి.

"బ్లాగిల్లు శ్రీనివాస్" గారికి జన్మదిన శుభాకాంక్షలు.

తెలుగు బ్లాగర్లకు, వీక్షకులకు "బ్లాగిల్లు శ్రీనివాస్" గారు తెలియనివారంటూ ఉండరు. ఎంతో కాలం ఈయన "తెలుగు బ్లాగుల ప్రపంచానికి "బ్లాగిల్లు అగ్రిగేడర్" ద్వారా ఎనలేని సేవలు అందిస్తూ వచ్చారు. నాకు తెలుగు బ్లాగుల ద్వారా పరిచయమైన శ్రీనివాస్ గారు చాలా ఆప్తమిత్రునిగా మారిపోయారు. ముక్కుసూటిగాను, సరదాగాను సంభాషించే శ్రీనివాస్ గారంటే నాకు ఎనలేని అభిమానం. నాకు ఏవిధమైన సందేహమున్నా వెంటనే స్పందిస్తూనే ఉంటారు. ఈయనలో ఉన్న ఉన్నతమైన ఆలోచనలు,భావాలు ఏమిటో 2నిమిషాలు ఈయనతో మాట్లాడితే ఇట్టే అర్ధమవుతాయంటే అతిశయోక్తి కాదు. అటువంటి శ్రీనివాస్ గారికి ఈ రోజు జన్మదినం. నా తరపున,నాకుటుంబం తరపున,మా "సాక్ష్యం గ్రూప్" తరపున "బ్లాగిల్లు శ్రీనివాస్" గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము.

బ్లాగ్ వేదికలో మంచి,మంచి బ్లాగులకు మాత్రమే చోటు.

బ్లాగ్ వేదికలో మంచి బ్లాగులకు (ఉపయోగకరమైన బ్లాగులకు) మాత్రమే చోటు కల్పిస్తున్నాము. ముఖ్యంగా ఆధ్యాత్మిక,సామాజిక ,సాహిత్యపరమైన బ్లాగులకు మాత్రమే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నాము. మీరు కూడా అటువంటి బ్లాగులను నిర్వహిస్తుంటే దయచేసి బ్లాగ్ వేదిక అగ్రిగేటర్లో నమోదు చేసుకోవచ్చు. వివరాలకు క్లిక్ చేయండి.

పవన్ కళ్యాణ్ గారి ఓవరేక్షన్!

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనే కాదు ఆఖరికి రాజకీయాలలో కూడా ఓవరేక్షన్ ఎక్కువయ్యింది. తునిలో కాపు గర్జన అల్లర్లు విని ఈయన గారు షూటింగ్ మరీ మానుకుని హైదారాబాద్ వచ్చేసి ఏవో చార్లీ చాప్లిన్ మాదిరిగా ఒక ఫోజు పెట్టి ఏవేవో నోటికొచ్చిన నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్లిపోయాడు. ఈయనగారు తనకు తను స్వాతంత్ర సమర యోధుడనుకుంటున్నాడో ఏమో! ఈయనగారు,వీళ్ళ అన్న చిరంజీవిగారు పార్టీ పెట్టి మూసేయడం తప్ప చేసిందేమి లేదు. చిరంజీవి మంచి నటుడు అలాగే రజనీకాంతలా, కమల్ హాసన్లా సినిమాలకే పరిమితమై ఉండియుంటే ఎంతో పేరు నిలబడి యుండేది! రాజకీయాల జోలికొచ్చి కాస్త ప్రజలలో చులకన అవ్వాల్సి వచ్చింది. ఏది,ఏమైనా చిరంజీవిగారు మంచి నటుడిగా చెరగని గుర్తింపు ఉంటుంది. ఇక పవన్ కళ్యాణ్ ఓవరేక్షన్ మాత్రం ఆంధ్ర ప్రజలు భరించలేకపోతున్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...