బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. తప్పంతా భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూదేనట!

Central-home-minister-Amit-Shah-Targets-Opposition-On-Jammu-and-Kashmir
జమ్ము కశ్మీర్ ఇప్పటికీ సమస్యగానే మిగిలిపోవడం - అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు సాగడం - చివరకు కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని పాక్ ఆక్రమించడం... వీటన్నింటికీ కారణమేమిటో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానే కాకుండా కేంద్ర హోం మంత్రిగా కొనసాగుతున్న అమిత్ షా చెప్పేశారు. వీటన్నింటికీ మాజీ ప్రధాని - భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూనేనని ఆయన తేల్చి పారశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు - నాడు హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ న సంప్రదించకుండానే ఏకపక్షంగా వ్యవహరించిన తీరు కారణంగానే కశ్మీర్ సమస్య నేటికీ సమస్యగానే మిగిలిపోయిందని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నెహ్రూ చేసిన తప్పుల కారణంగానే నేటికీ కశ్మీర్ రావణ కాష్టంగా మండిపోయిందని కూడా షా వ్యాఖ్యానించారు.

బీజేపీ సైద్ధాంతిక కర్త ఆరెస్సెస్ భేటీకి హాజరైన సందర్భంగా అమిత్ షా ఆదివారం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధానినే తప్పుబట్టడం అంటే మాటలు కాదు కదా. అందుకేనేమో అమిత్ షా కూడా కాస్తంత క్లారిటీగానే అంశాల వారిగానే నెహ్రూ తప్పులను ఎత్తి చూపించారు. షా చెప్పిన నెహ్రూ తప్పులు ఏమిటన్న విషయానికి వస్తే... కశ్మీర్ అంశంపై నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించడమే పెద్ద తప్పని అమిత్ షా ఆరోపించారు. అంతేకాకుండా కశ్మీర్ విషయం పట్ల నెహ్రూ ఎంచుకున్న చార్టర్ కూడా పొరపాటేనని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో నెహ్రూ చార్టర్ 35ను ఎంచుకున్నారని ఇది ముమ్మాటికీ తప్పేనని చెప్పేసిన షా... చార్టర్ 35కు బదులుగా చార్టర్ 51ని ఎంచుకుని ఉంటే బాగుండేదని కూడా చెప్పారు.

ఎస్‌బీఐ-కొత్త నిబంధనలు | SBI-New Rules

*★ అక్టోబర్ ఒకటి నుంచి  బ్యాంక్ చార్జీలు, లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.*

*🍂ఒకటి నుంచి రాబోయే మార్పులు వివరాలు ఇవే...*
👇🏻👇🏻👇🏻
*★ స్టేట్ బ్యాంక్ కస్టమర్లు నెలకు మూడు సార్లు మాత్రమే బ్యాంకులో ఉచితంగా డబ్బు డిపాజిట్ చేసే అవకాశం.* 

*★ ఈ పరిమితి దాటిన తర్వాత కస్టమర్లు రూ.50 చెల్లించాల్సి రావొచ్చు. దీనికి జీఎస్‌టీ అదనం.*

*★ ఐదో డిపాజిట్ తర్వాత నుంచి బ్యాంక్ తన కస్టమర్ల నుంచి రూ.56 వసూలు చేస్తుంది.*

*★ చెక్ బౌన్స్ అయితే అదనంగా రూ.150 చెల్లించాల్సి రావొచ్చు.*

*★ ఏటీఎం లావాదేవీల సంఖ్య మెట్రో నగరాల్లో పదికి పెరగనున్నాయి.*

*★ నాన్ మోట్రో ప్రాంతాల్లో ఎలాంటి చార్జీలు లేకుండా ఎస్‌బీఐ ఏటీఎంలో పన్నెండు వరకు లావాదేవాలను నిర్వహించుకోవచ్చు.*

*★ అదే ఇతర బ్యాంకుల ఏటీఎంలైతే ఐదు లావాదేవీలు మాత్రమే ఉచితం.* 

*★ బ్యాంకుల్లో శాలరీ అకౌంట్ కలిగిన వారు ఎస్‌బీఐ లేదా ఇతర బ్యాంకుల ఏటీఎంలో ఉచితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.*

*★ ఆర్‌టీజీఎస్, నెఫ్ట్ సేవలు ఉచితం. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా చేస్తేనే ఈ ఫెసిలిటీ ఉంటుంది.*

*★ ఆటో, హోమ్ లోన్స్ సహా రిటైల్ లోన్స్ అన్నీ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రేట్లతో అనుసంధానం కానున్నాయి.*

ఆధార్ కార్డుకు స్వస్తి చేప్పేందుకు కేంద్రం సన్నద్ధం ....!

Aadhaar-card-is-now-mandatory-for-nominees-of-your-EPF-Blog-vedika
భారత్ లో ఇప్పుడు ప్రభుత్వ పథకాలకు ఉపయోగిస్తున్న  ఆధార్ కార్డుకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడనున్నదా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లకు - సిమ్ కార్డులకు - ఓటర్ ఐడీకి - సంక్షేమ పథకాలకు - ప్రభుత్వ - ప్రైవేటు ఉద్యోగుల వేతనాలకు లింక్ చేయాలని గతంలో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే దీనిపై అనేక సార్లు సుప్రీంకోర్డు ఆధార్ కార్డుల అస్థిత్వాన్ని ప్రశ్నించింది. అయితే ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుకు స్వస్తి చేప్పేందుకు సన్నద్ధం అవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనతో తేలిపోతుంది.

ఆయన సోమవారం మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం 2021లో చేపట్టనున్న జనాభా లెక్కల (సెన్సస్) కోసం మొబైల్ యాప్ వాడబోతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పేపర్ సెన్సెస్ నుంచి డిజిటల్ సెన్సెస్ కు ఇదొక పరివర్తన అని చెప్పారు. 2021 మార్చ్ 1 నుంచి జనాభా లెక్కింపు ప్రక్రయను చేపట్టనున్నట్టు గత మార్చిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హిమాలయ ప్రాంతాలైన జమ్మూకశ్మీర్ - హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు ప్రక్రియ అక్టోబర్ 2020 నుంచే ప్రారంభం కానున్నది. అయితే ఒకే దేశం ఒకే భాష అంశంపై వ్యాఖ్యానించి విమర్శల పాలైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పుడు ఒకే దేశం ఒకే కార్డు ఉండాలని ఉద్ఘాటించారు.

మన సియం జగన్మోహాన్ రెడ్డిగారి నిర్ణయాలు రాష్ట్రానికి ప్రయోజనకరమా? ప్రమాదకరమా? | Are our CM Jagan Mohan Reddy decisions beneficial to the state? Dangerous?

గత సియం చంద్రబాబుగారు అధికారంలో  ఉన్నప్పుడు ఎవరూ ఆయనను ప్రశాంతంగా పరిపాలనను సాగనివ్వలేదు. ప్రత్యేక హోదా అంటూ చలసాని శ్రీనివాస్, గరుడ శివాజీ, ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి వైయస్సార్ సిపి నాయకులు మీడియా పరంగా ప్రతిరోజూ తెగ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈ చలసాని శ్రీనివాస్, గరుడ శివాజీలు ఏమైపోయారు? అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెస్తామని బీరాలు తీసిన వైయస్సార్ సిపి నాయకులు ఎందుకు గమ్మున ఉండిపోయారు? మొత్తానికి వీళ్ళందరూ ప్రత్యేక హోదా ఊసే లేకుండా ఆంధ్రా ప్రజలను వెధవలను చేశారు. నవరత్నాలు ప్రకటించి మా ఓట్లన్నీ లాక్కుని అందలం ఎక్కిన జగన్మోహన్ రెడ్డి ఒక్క రత్నాన్ని ఇప్పటివరకూ ఎందుకు తీసుకురాలేదు?

గ్ర్రామ వాలంటీర్లు జగన్ ఏజంట్ల ? లేక ప్రజల సర్వీస్ ప్రొవైడర్ల? అర్ధం కావడం లేదు?
మద్యం లేకుండానే చేస్తానన్న ప్రభుత్వం చదువుకున్న విద్యార్థుల చేతే మద్యం అమ్మించడమేమిటి?
గబ్బు నోరేసుకుని పచ్చి అబద్ధాలు, తిట్ల పురాణాలు వల్లె వేసే జబర్దస్త్ రోజా గారు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు?
ఒక్కోరోజు తిండి గింజలు లేకపోతే 5రూపాయలు వెతుక్కుని అంనాకేంటీన్ లో ఆకలి తీర్చుకుందామంటే అది కూడా లేకుండా పీకేశారు. పేదవారి ఆకలి బాధను తీర్చేవారెవరు?
ఒకవేళ పథకాలలో కొత్త విధానాలు, మార్పులు చేయాలనుకుంటే అప్పటివరకూ పాత పధకాలను అమలు చేస్తూ ప్లానింగ్ అయ్యాక అప్ డేట్ చేస్తే సరిపోతుంది కదా? ఊరికి ముందే మూసేయడమెందుకు?
ఈసారి చలసాని శ్రీనివాస్ ప్రత్యేక హోదా కబుర్లు చెపితే ఆంధ్రా ప్రజలు మెడగెట్టి గెంటడం ఖాయం.
ఆంధ్రాలో పోలీస్ జులుం పెరిగిపోయింది. చిన్న,చిన్న కేసులకే వేలకు వేలు పెనాల్టీలు.. ఇదేమి రాజన్న రాజ్యం? నవరత్నాల కోసం నిధుల సేకరణ ఈ విధంగా జరుగుతుందన్న ప్రజల అనుమానం నిజమేనేమోనని అనిపిస్తోంది.
Related Posts Plugin for WordPress, Blogger...