బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు బ్లాగులకు విజిటర్ల సంఖ్య చాలా తగ్గిపోయింది.

కూడలి మూసివేత కారణమో లేక తెలుగు బ్లాగుల టపాలలో పస లేకో మొత్తానికి బ్లాగ్ విజిటర్ల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. తెలుగు బ్లాగుల జోలికి పోవాలంటే ఏదోలా అనిపిస్తోంది. మాలిక,బ్లాగిల్లు అగ్రిగేటర్లు చూసినా పెద్దగా చదవదగ్గ మేటరేమీ కనిపించడం లేదు. అగ్రిగేటర్లలో గాంధిక బాషల బ్లాగులు ఎక్కువైపోయాయి. కథలు,సాహిత్యం,ఆధ్యాత్మికంతో కూడిన బ్లాగులు చాలా వరకూ తగ్గిపోయాయి. ఇలా అయితే కొన్నాళ్ళకు తెలుగు బ్లాగుల ప్రపంచం కనుమరుగవడం ఖాయంగా తోస్తుంది.

కూడలి పని చేస్తుంది.

కూడలి మూతపడిన తరువాత ఒక్కసారిగా తెలుగు బ్లాగుల ప్రపంచం ఉలిక్కి పడిన విషయం మీకందరికీ విదితమే!. కాని కూడలి మీద అభిమానమున్నవారు ఈ క్రింది లింక్ ద్వారా కూడలిని వీక్షించవచ్చు. కూడలిని మూసివేయక పొవుట చూస్తుంటే కూడలిని మళ్ళీ నడిపే అవకాశం ఉందేమో అనిపిస్తోంది. ఏది,ఏమైనా కూడలి వస్తే తెలుగు బ్లాగర్లకు ఆ ఆనందమే వేరు.
 కూడలి కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

థార్మిక చర్చావేదిక

"సాక్ష్యం మేగజైన్" లో  "యేసు శిలువపై చనిపోలేదన్న" సంచలనాత్మకమైన అంశంపై ధార్మిక చర్చావేదిక కొనసాగుతుంది. దయచేసి మీరందరూ కూడా పాల్గొనవల్సినదిగా మనవి. వివరాలకు : Sakshyam Magazine చూడండి.

కామెంటర్లకు విజ్ఞప్తి!

గౌరవనీయులైన కామెంటర్లకందరికీ బ్లాగ్ వేదిక విన్నపం. దయచేసి టపాలకు సంబంధం లేని కామెంట్లు గాని లేక విమర్శనాత్మకమైన కామెంట్లు గాని పెట్టి బ్లాగర్లను విసిగించి వారిని బ్లాగు ప్రపంచం నుండి విరమించుకునేలా చేయవద్దు. మీకు నచ్చిన టపాలు చదివినప్పుడు అందులోని తప్పొప్పులను చూసించవచ్చు. దాని వలన ఏమిధమైన ఇబ్బంది ఉండదు. ప్రయోజనం కూడా ఉంటుంది. వ్యక్తిగత విమర్శల వలన ప్రయోజనమేముంది. బ్లాగు ప్రపంచంలో చులకన అవ్వడం తప్ప! దయచేసి కామెంటర్లు అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ... మీ చౌదరి.

బ్లాగ్ వేదికలో మీ బ్లాగులను నమోదు చేసుకోవచ్చు.

బ్లాగ్ వేదిక త్వరలో పెయిడ్ వెర్షన్ గా మారిపోతుంది. అప్పటివరకూ మీ బ్లాగులను నమోదు చేసుకోవచ్చు. మరొక విషయమేమిటంటే ఆల్రెడీ బ్లాగ్ వేదికలో ఉన్న బ్లాగులకు ప్రత్యేక రాయితీ కూడా ఉంటుంది. పెయిడ్ వెర్షన్ గా మారిన తరువాత నమోదు అయ్యే బ్లాగులకు మాత్రం రాయితీ వర్తించదు.
మీ బ్లాగుల నమోదు కొరకు : ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంత జరిగినా తమ పంధాను మార్చుకోని కామెంటర్లు.

సంకలిని,హారం,బ్లాగిల్లు.. ఇప్పుడు కూడలి ఇలా ఎన్నో టాప్ మోస్ట్ అగ్రిగేటర్లు కాలగర్భంలో కలిసిపోతున్నా కొంతమందికి ఏమాత్రం సానుభూతి కూడా లేదు. ఇంకా పైపెచ్చు తొక్కలో అగ్రిగేటర్లని అతి దారుణమైన విమర్శలు గుప్పించడాలు. ఇలా తగలబడితే ఇక తెలుగు బ్లాగర్లు నిలబడేదేక్కడ చెప్పండి? అగ్రిగేటర్ల వలన ప్రయోజనం పొందుతున్నవారు ఎవరూ ఇంటువంటి కామెంట్లను ఉపేక్షించరు. కొంతమంది అదేం పోయేకాలమో విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.ఇదొక పైశాచిక ఆనందమేమో మరి.!
Related Posts Plugin for WordPress, Blogger...