బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Showing posts with label World News. Show all posts
Showing posts with label World News. Show all posts

బ్రిటన్ రాజుకు శిరచ్చేధనమైన వేళ.... | When the King of Britain was beheaded...

 బ్రిటన్ రాజుకు శిరచ్చేధనమైన వేళ.... | When the King of Britain was beheaded...

బ్రిటన్ రాజుకు శిరచ్చేధనమైన వేళ.... | When the King of Britain was beheaded...


ISIS seeks to inflict corona on India .. | భారీ కుట్రకు తెర : భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్..

భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్.. 

ISIS seeks to inflict corona on India ..
భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్
దారుణమైన మైండ్ సెట్ తో ప్రపంచాన్ని వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దుర్మార్గం మరోసారి బయటకు వచ్చింది. కరోనా కాలంలో విలవిలలాడిపోతున్న తీరును తమకు అవకాశంగా మార్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత ముస్లింలను టార్గెట్ చేసుకుంది. తనకు చెందిన ఆన్ లైన్ పబ్లికేషన్ అయిన వాయిస్ ఆఫ్ హింద్ లో భారత్ మీద తనకున్న కసిని వ్యక్తం చేసింది.

భారత్ ను దెబ్బ తీయటం కోసం ఐసిస్ దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. భారత్ పై దాడికి కరోనాను ఒక అవకాశంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కరోనా క్యారియర్లుగా ముస్లింలు మారాలని పిలుపునిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పదిహేడు పేజీల లాక్ డౌన్ స్పెషల్ ఎడిషన్ విడుదల చేసిన సదరు సంస్థ.. నాస్తికుల్ని చంపేయాలని పిలుపునివ్వటం గమనార్హం. భారత్ పై పూర్తిస్థాయిలో దాడి చేయాలని పిలుపునిచ్చింది.

Will India's population decline What is actually going on | భారత జనాభా తగ్గిపోనుందా? అసలేం జరుగుతోంది?

భారత జనాభా తగ్గిపోనుందా? అసలేం జరుగుతోంది?

Will India's population decline What is actually going on
Will India's population decline What is actually going on
2100 సంవత్సరం నాటికి భారత జనాభా 100కోట్లకు పడిపోతుందని.. ఇప్పటితో పోలిస్తే 30-35 కోట్ల మంది వరకు జనాభా తగ్గిపోతుందని ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్ ఓ నివేదికలో పేర్కొంది.

అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుంది. మన తర్వాత నైజిరియా చైనా అమెరికా పాకిస్తాన్ లు నిలుస్తాయి. ప్రస్తుతం 780 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2100 నాటికి 880కోట్లకు పెరుగుతుందని నివేదికలో పేర్కొంది.

చైనాను భారత్ 2027 కల్లా జనాభాలో దాటేస్తోంది. 2047నాటికి 161 కోట్లకు చేరుతుంది. తగ్గుతున్న గర్భధారణ రేటు వృద్ధుల సంఖ్య పెరగడం.. వివాహాల వయసు పెరగడం.. కుటుంబ నియంత్రణ.. కాన్పుకు కాన్నుకు మధ్య దూరం వంటివి జనాభా తగ్గుదలకు కారణంగా నివేదిక పేర్కొంది.

వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన

వైరస్ పై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన
WHO-sensational-statement-on-the-virus
మహమ్మారి వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్య్లూహెచ్ఓ) నిరంతరం పర్యవేక్షణ చేస్తోంది. ఈ వైరస్ కట్టడి.. నివారణ.. మందు కనిపెట్టుట.. వంటి వాటిపై డబ్ల్యూహెచ్ఓ దృష్టి సారించింది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉంది. ప్రపంచ దేశాల్లో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ప్రస్తుతం వైరస్ వ్యాప్తిపై డబ్ల్యూహెచ్ఓ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఈ వైరస్ ఇప్పట్లో వైరస్ అంతం కాదని ఇంకా ప్రభంజనం కొనసాగుతుందని కీలక ప్రకటన చేసింది.

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి ఇంకా తీవ్రమవడానికి అనువైన వాతావరణం ఉందని.. ఇంకా ఉధృతి పెరుగుతుందని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ మంగళవారం తెలిపారు. ప్రస్తుత వాతావరణం వైరస్ వ్యాప్తికి కారణమవుతోందని.. ఇంకా పెద్ద సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని దేశాల్లో వైరస్ కట్టడి చర్యలు సమగ్రంగా అమలవుతున్నాయని.. మరికొన్ని దేశాల్లో ఇంకా పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అన్ని దేశాల్లో సమగ్ర చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

Swiss-bank-accounts-India-at-77th
స్విస్ బ్యాంకుకు సంబంధించి తాజా రిపోర్ట్ వెల్లడైంది. 2019లో భారతీయుల డిపాజిట్లు 6 శాతం తగ్గి రూ.6625 కోట్లకు పరిమితమయ్యాయని స్విస్ బ్యాంకు ప్రకటించింది. భారతీయులు సొమ్ము భద్రపరిచే విధానం 5.8 శాతం పడిపోయినట్లు స్పష్టమైంది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో బ్యాంక్ ఈ వివరాలు తెలిపింది. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరి కల్లా స్విస్ బ్యాంకులో సొమ్ము దాచిపెట్టిన భారతీయ పౌరులు సంస్థల జాబితా ఆధారంగా ఈ కొత్త ర్యాంకులను వెల్లడించారు.

2018లో 74వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 77వ స్థానానికి పడిపోయింది. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా దీనికి సంబంధించిన గణాంకాలను రిలీజ్ చేసింది. స్విస్ బ్యాంకులో డబ్బు దాస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. ఎస్ ఎన్ బీకి చెందిన భారతీయ బ్రాంచిల్లోనూ ఆ సంఖ్య తగ్గినట్లు తేలింది. స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచిపెట్టన సొమ్ములో భారత వాటా కేవలం 0.06 శాతం మాత్రమే ఉన్నట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ తన రిపోర్ట్లో పేర్కొన్నది.

భూమిపై 8వ ఖండం కనుగొన్నారు.. ఎక్కడంటే?

భూమిపై 8వ ఖండం కనుగొన్నారు.. ఎక్కడంటే?
Found-the-8th-continent-on-earth
భూమిపై ఇప్పటిదాకా ఏడు ఖండాలే.. కానీ ఇప్పుడు 8వ ఖండాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ‘జిలాండియా’ అనే పేరు పెట్టారు. న్యూజిలాండ్ దేశానికి దగ్గరలో ఈ ఖండం ఉంది.

ఒకప్పుడు అన్ని ఖండాల్లోనే జిలాండియా కూడా సముద్రంలో పైకి తేలుతూ ఉండేదట.. కొన్ని కారణాల వల్ల ఇది సముద్రంలో కలిసిపోయింది. 2017లో దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

జిలిండియా చిన్న ఖండం ఏమీ కాదు.. దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజాగా న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు బాతిమెట్రి అనే విధానం ద్వారా ఈ ఖండం మ్యాప్ ను తయారు చేశారు. 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ జిలాండియా ఖండంలో కేవలం 6శాతం మాత్రమే సముద్రం పైకి కనిపిస్తుండడం గమనార్హం.

న్యూ క్యాలడోనియా దీవులు విస్తరించిన ప్రాంతంలో ఈ జిలాండియా ఖండం ఉంది. 1995లో బ్రూస్ లుయెండిక్ అనే భౌతిక శాస్త్రవేత్త మొదట ఎనిమిదో ఖండాన్ని గుర్తించారు. దానికి ఆ పేరు పెట్టారు.

జూన్ 1 వరకు లాక్ డౌన్ ..ప్రధాని సంచలన నిర్ణయం !

U-K--lockdown-to-stay-in-place-till-June-1

జూన్ 1 వరకు లాక్ డౌన్ ..ప్రధాని సంచలన నిర్ణయం !

చైనా లో వెలుగుచూసిన ఈ మహమ్మారి వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఎన్ని కఠిన మైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అమెరికాలో ఈ మహమ్మారి భాదితుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నారు. అమెరికా తరువాత దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి.  ఈ  వైరస్ మరణాల సంఖ్యలో యూరప్ దేశాలన్నిటి కంటే టాప్లో కొనసాగుతోంది.

ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా



ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా

Breaking-News-America-Revealed-India-Craze
ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా
భారత్ ఎన్ని సాధించినా.... ప్రపంచం ఒప్పుకోదు. సరిగ్గా చెప్పాలంటే ఒప్పుకోవడానికి మనసు రాదు. ఇండియాను పేద దేశంగా చూపడానికి ప్రపంచ దేశాలు చేయని ప్రయత్నమే ఉండదు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ సాధిస్తున్న రికార్డులను ప్రపంచం గుర్తించకుండా ఉంచడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. వాటిలో ఒకటి... భారత్ కరోనాను ఇతర దేశాల కంటే సమర్థంగా కంట్రోల్ చేయడం వల్ల ఎక్కడ మనం గ్లోబల్ లీడర్ అవుతామో అన్న భయంతో ఐక్య రాజ్య సమితి కరోనా వల్ల భారత్ లో 40 కోట్ల మంది పేదరికంలోకి పోతారు అని ఒక నివేదిక అర్జెంటుగా బయట పెట్టింది. ఇది ఎంత చోద్యం అంటే... 200 దేశాల్లో కరోనా వస్తే భారత్ సహా ఎన్నో దేశాలు లాక్ డౌన్ పెడితే కేవలం భారత్ మాత్రమే ఎందుకు పేదరికంలోకి పోతుంది? ఈ నష్టం అందరికీ జరుగుతుంది కదా? మరి ఎందుకు ఈ రిపోర్టు అంటే... భారత్ ను అప్రతిష్ట పాలు చేయడం ద్వారా మన సమర్థతను కప్పిపుచ్చే ప్రయత్నం. చేతిని అడ్డుపెట్టి సూర్యడిని ఆపగలమా? సాధ్యం కాదు. ఇది కూడా అంతే.

బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది


బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది

Corona-News-Obesity-Threat-During-Lock-Down-Time
బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది
కరోనా కోరలు పీకేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపుగా కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని - లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని.. ప్రజలు సహకరించకుంటే....పోలీసులు కఠిన చర్యలు తీసుకొనైనా సరే లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని మోడీ గట్టిగా ఆదేశాలిచ్చారు. స్టే హోమ్...స్టే సేఫ్ అంటూ ప్రధాని నుంచి సెలబ్రిటీల వరకు పిలుపునిస్తున్నారు. కరోనా పుణ్యమా అంటూ ఏ ఫంక్షన్ టైంలోనో...స్పెషల్ అక్కేషన్ లోనే ఇంట్లో ఒకేసారి గుమిగూడే పిల్లలు - యువకులు - పెద్దలు - ముసలివారు..అంతా ఇప్పుడు ఒకే చోట కట్టగట్టుకొని కూర్చుంటున్నారు. అయితే ఇలా కదలకుండా..ఏమాత్రం శారీరక వ్యాయామం..అలసట లేకుండా...కూర్చోవడం వల్ల బరువు పెరిగే అవకాశముందని ఫిజీషియన్లు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉన్నాం కదా...అని స్నాక్స్ - చిరుతిండ్లు తినడం వల్ల అనర్థాలు వచ్చే అవకాశముందని వార్నింగ్ ఇస్తున్నారు.

కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?


కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?

Breaking-News-China-Released-Corona-Virus-For-Trade-War
కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?
కరోనా మహమ్మారి పేరు చెప్పగానే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఆ రంగం..ఈ రంగం అని తేడా లేకుండా కరోనా అన్ని రంగాలపై పంజా విసిరింది. ముఖ్యంగా కరోనా దెబ్బకు ఆ వైరస్ సోకిన దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. కరోనా దెబ్బకు చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులున్నాయని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా కుప్పకూలుతూ రికార్డు స్థాయిలో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. కరోనా దెబ్బకు లాక్ డౌన్ ప్రకటించుకోవడం వల్ల గత నెల రోజుల కాలంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పుట్టిల్లయిన చైనా స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలి ఉంటుందని అంతా అనుకున్నారు.

కానీ ఆశ్చర్యకరంగా చైనా స్టాక్ మార్కెట్ గడచిన నెల కాలంలో + 0.3 శాతం వృద్ధి సాధించింది. మిగతా దేశాలన్నీ...-0.27 నుంచి -0.12 వరకు నష్టాల్లో మునిగితేలుతున్నాయి. కానీ కరోనా దెబ్బకు కుప్పకూలిపోవాల్సిన చైనా స్టాక్ మార్కెట్ వృద్ధి సాధించడం వెనుక చైనా ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అమెరికా-చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికాను దెబ్బకొట్టేందుకు కరోనా బూచిని చైనా వాడుకుందనే అభిప్రాయాలను అమెరికన్ యూరోపియన్ ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కరోనా భూతాన్ని ప్రపంచం మీదికి వదిలి...ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టి తమ దేశ ఆర్థిక వ్యవస్థను లాభాల బాటలో పెట్టాలనే కుట్ర చైనా చేసిందని వదంతులు వ్యాపిస్తున్నాయి.

నరరూప రాక్షసుల్ని సైతం వణికిస్తున్న కరోనా


నరరూప రాక్షసుల్ని సైతం వణికిస్తున్న కరోనా

China-Coronavirus-Effect-on-isis-Terrorists
నరరూప రాక్షసుల్ని సైతం వణికిస్తున్న కరోనా
వారు మనుషులు రూపంలో ఉన్న నరరూప రాక్షసులు. ఈ భూమి మీద తమకు నచ్చని వారిని ఎంత దారుణంగా.. అమానవీయంగా హింసించి చంపాలో వారికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదని చెబుతారు. ఇక.. మహిళల్ని అయితే.. సెక్స్ బానిసలుగా చేస్తూ.. తాము ఆడపిల్లలుగా ఎందుకు పుట్టామురా భగవంతుడా అంటూ నిత్యం ఏడ్చేలా నరకయాతనకు గురి చేస్తుంటారు.

ఎదుటోళ్లను హింసించి.. వారి వేదనకు పండుగ చేసుకునే ఆ నరరూపరాక్షసులే ఐసిస్ ఉగ్రవాదులు. తమ తీరుతో ప్రపంచాన్ని వణికించిన వారిని.. కంటికి  కూడా కనిపించని కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రాణభయంతో వారంతా జాగ్రత్తలు తీసుకునేలా చేస్తోంది. తమ చేష్టలతో ప్రపంచానికి వణుకు పుట్టించిన ఐసిస్ ఉగ్రవాదులు.. కరోనా వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉంటున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లవద్దంటూ ఐసిస్ ప్రకటించింది.

దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాలు అల్ నబా మ్యాగ్ జైన్ లో ప్రకటించారు. ఈ సందర్భంగా ఐసిస్ ఉగ్రవాదులు.. కరోనా ప్రభావిత దేశాల వైపు అస్సలు వెళ్లొద్దని.. రోజులో వీలైనన్నిసార్లు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవాలని పేర్కొంది. ఆరోగ్య నిఫుణులు చేసిన సూచనల్ని తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పింది.

Venkata Krishna Big Breaking Alert to Public | ప్రజలారా.. కళ్ళు తెరవండి.. మిమ్మల్ని మీరే కాపాడుకోండి

Venkata Krishna Big Breaking Alert to Public | ప్రజలారా.. కళ్ళు తెరవండి.. మిమ్మల్ని మీరే కాపాడుకోండి

AP24x7 ఛానెల్ యొక్క అధినేత, జర్నలిస్టు అయిన వెంకటకృష్ణ గారు కరోనా విషయంలో ప్రభుత్వానికి గట్టి సూచనలు అందించారు. స్కూల్స్, కాలేజీలు, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా ధియేటర్లు రెండు,మూడు వారాలు మూసివేయడం మంచిదనే తన అభిప్రాయం తెలియజేశారు. తల్లిదండ్రులెవరూ తమ పిల్లలను స్కూళ్లకు పంపవద్దని మనవి చేశారు. ఒకసారి ఆయన మాటల్లోనే విందాం.


భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య !

China-Corona-virus-cases-in-India-double-from-last-week-to-62
భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య !

భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య !

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా దేశం వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు భారత్ లో కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత రెండు రోజుల్లోనే కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా కేరళ కర్ణాటక పూణెలో కొత్త కేసులతో హడలెత్తిస్తోంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం...రాష్ట్రాలకు సూచనలు జారీ చేయడంతో పాటు హై అలర్ట్ ప్రకటించింది.

YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

yes-bank-cricis-apsrtc-deposits-stalled-bank
YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

YES బ్యాంక్ లో చిక్కుకున్న రూ.240 కోట్లు ...అయోమయంలో APSRTC !

దేశంలో ఒకవైపు కరోనా వైరస్ దెబ్బకి అందరూ భయంతో వణికిపోతుంటే ..మరోవైపు ఎస్ బ్యాంక్ దెబ్బ కూడా అందరిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. గత కొన్ని రోజులుగా సంక్షోభంలో చిక్కుకున్న ఎస్ బ్యాంక్ పరిస్థితి ఇప్పుడు మరింత దారుణంగా తయారైంది. దీనితో పలువురు ఎస్ బ్యాంక్ ఖాతాదారులు లబోధింబోమంటున్నారు. తాజాగా ఎస్ బ్యాంక్ బాధితుల్లో apsrtc కూడా చేరింది. గతంలో అధిక వడ్డీకి ఆశపడి apsrtc ఎస్ బ్యాంక్ లో లావాదేవీలు చేయడం ప్రారంభించింది. ప్రస్తుతం ఆర్టీసికి చెందిన రూ. 240 కోట్ల రూపాయలు బ్యాంకులో చిక్కుకుపోయాయి. దీంతో ఆర్టీసీ అధికారులు తలలు పట్టుకున్నారు.

వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

What-Is-The-Connection-Between-Rain-And-Corona-Virus
వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న అత్యంత భయంకరమైన వైరస్. చైనాలో పుట్టిన ఈ కరోనా వల్ల ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోయారు. అలాగే దాదాపుగా లక్ష మంది వరకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ కరోనా ఇప్పటికే ప్రపంచంలోని 89 దేశాలకి వ్యాప్తి చెందింది. ఇకపోతే ఈ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించకున్నా.. ఈ వైరస్ బారిన పడ్డ వారిని టచ్ చేస్తే సోకుతుంది. అయితే ఈ వైరస్ ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎక్కువసేపు తట్టుకోలేదని వేడి ఎక్కువగా ఉంటే వైరస్ క్షణాల వ్యవధిలోనే చనిపోతుంది అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఉండే ఉష్ణోగ్రతలని తట్టుకోవడం అంత ఈజీ కాదు.

అసలు ఈ వైరస్ మన దేశంలోకి ప్రవేశించిందే ..ఇతరదేశాల నుండి భారత్ కి వచ్చిన వారి వల్ల. ఈ కరోనా వైరస్ వేడిని ఎలా అయితే తట్టుకోలేదు .. అంతకు రెండురెట్లు చలి ప్రాంతంలో ప్రభావం చూపించగలదు. తక్కువ వేడి ఉన్న ప్రాంతాలలో ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుందట. అయితే ఎక్కడైనా వర్షాలు పడితే ఉష్ణోగ్రతలతో మార్పులు రావడం అనేది సహజం. దీంతో ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడి పేరుతో ఓ గ్రామం..ఎందుకుందో తెలుసా?

American-President-Jimmy-Carter-changing-its-name-to-Carterpuri
అమెరికా అధ్యక్షుడి పేరుతో ఓ గ్రామం..ఎందుకుందో తెలుసా?

అమెరికా అధ్యక్షుడి పేరుతో ఓ గ్రామం..ఎందుకుందో తెలుసా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో తొలిసారిగా అడుగు పెట్టిన సందర్భంగా పలు ఆసక్తికర అంశాలు తెరమీదకు వస్తున్నాయి. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. భారత్ లో ఇప్పటి వరకు ఆరుగురు అమెరికా అధ్యక్షులు పర్యటించగా ట్రంప్ ఏడవ అధ్యక్షుడిగా నిలిచారు. ట్రంప్ నకు సంబందించిన అంశాలు అలా పక్కనపెడితే...ఓ అధ్యక్షుడి పేరుతో మనదేశంలో ఓ గ్రామం ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఆయనే అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్.

మెలానియా ట్రంప్ జీవిత విశేషాలు

Melania-Trump-Life-Story

మెలానియా ట్రంప్ జీవిత విశేషాలు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ లో పర్యటన నేపథ్యంలో మోలానియా ఏం చేస్తారో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో నెలకొంది.

* మోలానియా 1970 సంవత్సరంలో యూరప్ లోని స్లోవేనియాలో జన్మించింది. 16ఏళ్ల వయస్సురాగానే మోడలింగ్ రంగంలోకి వెళ్లింది.

* 1998లో న్యూయార్క్ లో జరిగిన ఒక ఫ్యాషన్ వీక్ పార్టీలో మెలానియా తొలిసారిగా ట్రంప్ ను కలిసింది.

* ఆ సమయంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడు. మెలానియా కలిసే నాటికే ట్రంప్ కు అప్పటికే రెండు వివాహాలు అయ్యాయి.

New sanctions in China .. to come out once in three days | చైనాలో కొత్త ఆంక్షలు.. మూడు రోజులకు ఒకసారే బయటకు రావాలి

new-sanctions-in-china-to-come-out-once-in-three-days
New sanctions in China .. to come out once in three days

New sanctions in China .. to come out once in three days | చైనాలో కొత్త ఆంక్షలు.. మూడు రోజులకు ఒకసారే బయటకు రావాలి

ఎంత ప్రయత్నించినా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంతకూ కంట్రోల్ కాని కొవిడ్ 19 వైరస్ సంగతి చూసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. అయినప్పటికీ.. ఈ వైరస్ విస్తరించటాన్ని మాత్రం ఆపలేక పోతున్నారు. నిత్యం పదుల సంఖ్యలో మరణాలు.. వేలాది మందికి ఈ మాయదారి వైరస్ సోకుతుండటంతో ఆ దేశం తీవ్రమైన ఒత్తిడికి గురి అవుతోంది. కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉండే ఈ వైరస్ తో డ్రాగన్ దేశం ఆగమాగమవుతోంది.

కొవిడ్ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న హుబే ప్రావిన్సులో ఇప్పటికే పలు నిషేధాలు విధించారు. ప్రజా రవాణాను నిలిపివేయటం.. రైళ్లు.. విమాన సర్వీసుల్ని ఆపేశారు. అంతేకాదు.. ఈ ప్రాంతంలోని ప్రజలు బయటకు రావొద్దని చెబుతున్నారు. అయినప్పటికీ.. వైరస్ వ్యాపించటం ఆగని నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త ఆంక్షల్ని అక్కడి ప్రజలకు విధించారు.

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పై అమెరికా కీలక నిర్ణయం.. ఫైర్ అయిన చైనా?

America-Decision-On-China-Corona-Virus

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పై అమెరికా కీలక నిర్ణయం.. ఫైర్ అయిన చైనా?

కరోనా వైరస్ ..ప్రస్తుతం చైనా తో సహా ..సుమారుగా 25 దేశాలని వణికిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ భారిన పడితే కోలుకోవడం కష్టమే అని తెలుస్తుంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ గురించి ఆందోళన మొదలైంది. ఈ వైరస్ ని తమ దేశంలోకి రానివ్వకుండా వివిధ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పుట్టిన చైనాలో ఈ వైరస్ ప్రభావం చాలా ఎక్కువ గా కనిపిస్తుంది. ఈ కరోనా భారిన పడి ఇప్పటికే సుమారుగా 400 మందికి పైగా మరణించారు. అలాగే వందల మంది ఈ వైరస్ భారిన పడినట్టు తెలుస్తుంది. దీనితో చాలా దేశాలు కూడా తమ దేశ పౌరులని వెంటనే చైనా నుండి వెనక్కి రావాలని పిలుపునిచ్చాయి.

ప్రపంచమంతా కరోనా కలకలం.. చైనా నుంచి ఇండియాకు వచ్చేస్తున్న విద్యార్థులు

Dangerous-virus-Corona-Students-from-China-to-India

ప్రపంచమంతా కరోనా కలకలం.. చైనా నుంచి ఇండియాకు వచ్చేస్తున్న విద్యార్థులు

చైనాలో పుట్టిన ‘కరోనా’ వైరస్ ఇప్పుడు వివిధ దేశాలకు విస్తరిస్తూ ప్రపంచానికి పెను సవాల్ విసురుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ‘హెల్త్ ఎమర్జెన్సీ’ ప్రకటించడానికి రెడీ అయ్యిందన్న వార్తలు గుబులు రేపుతున్నాయి.

ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బ కు 100 మందికి పైగా చనిపోయారు. వైరస్ తీవ్రత కారణంగా చైనా ఆర్థిక శాఖ 9 బిలియన్ డాలర్లు ప్రకటించి మహమ్మారిని తరిమివేసేందుకు నడుం బిగించింది. ప్రస్తుతం చైనాలో 2744మందికి వ్యాధి సోకినట్టు గుర్తించారు. 461మంది చావుబతుకుల మధ్య ఉన్నారు.
Related Posts Plugin for WordPress, Blogger...