బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

100 ఉత్తమబ్లాగుల విషయమై మీ సూచనలు, సలహాలు పంపండి.

ఇంతకు ముందు ఈ విషయమై ప్రస్తావించినప్పుడు శ్యామలీయంగారు, శ్రీనివాస్(Who am i)గారు, చైతన్యకుమార్ గారు కొన్ని అభిప్రాయాలు వెలిబుచ్చారు. నాకు ఏవిషయ ప్రాతిపదికపై ఉత్తమ బ్లాగులుగా ఎన్నుకోవాలి అనే విషయంలో కొన్ని ఆలోచనలు కలిగాయి. నిజానికి శ్యామలీయంగారు చెప్పినట్లు తరచు టపాలు వేసినంత మాత్రాన, లేక వివాద విషయాలు వ్రాసి వీక్షకులను ఆకర్షించినంత మాత్రాన మనం ఉత్తమబ్లాగులుగా ఎన్నుకోలేము. ముందు ఏది ఉత్తమ బ్లాగో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. దీని విషయమై నేను కొన్ని ఆలోచనలు చేసాను. దయచేసి మీరు కూడా కొన్ని సలహాలు, సూచనలు తెలియజేస్తే అవ్వన్నీ కలిపి మీ ముందు పెడతాను. అందులోనుండి మంచి నిర్ణయం తీసుకుని 100 ఉత్తమ బ్లాగుల శీర్షికను ప్రారంభిద్దాము. దీనికి మీరెమంటారు?

బ్లాగ్ వేదికలో 100 ఉత్తమ బ్లాగులు.

మీ అందరి అభిమానానికి దగ్గరవుతున్న బ్లాగ్ వేదికలో 100 ఉత్తమ బ్లాగులు పేరుతో శీర్షిక ప్రారంభించి అంతర్జాలంలో ఉన్న ఉత్తమ బ్లాగులన్నీ కేవలం ఒక 100 వరకు మాత్రమే ప్రవేశ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది.ఒకవేళ 100 ఉత్తమ బ్లాగులు దొరికిన తరువాత కూడా మరింత అత్యుత్తమమైన బ్లాగులు కనిపిస్తే వాటిని చేర్చి వాటిలోనుండి కొద్దిగా మాత్రమే ఉన్న బ్లాగులను తొలగించి అత్యుత్తమమైన వాటికి చోటు కలిపిస్తూ 100ఉత్తమ బ్లాగులను చక్కదిద్దుతూ ఉండాలి.ఎందుకంటే ఎవరైనా ఈజీగా చదువుకోడానికి వీలుగా ఉంటుంది.ఈ ఆలోచన మీకు నచ్చితే దయచేసి మీ దృష్టికి వచ్చిన, ఇష్టపడిన బ్లాగులుంటే సూచించండి.క్రింది కామెంట్ బాక్స్ ద్వారా కాని, లేదా sakshyamgroup@gmail.com గాని పంపించవచ్చు.

తెలుగు బ్లాగుల ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందా?

ఈమధ్య బ్లాగులను విమర్శించడం ఫ్యాషన్ గా మారిపోయింది. సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏదైనా ఒక సినిమా తీస్తే రిలీజ్ కి ముందు మీడియాలో గందరగోళం సృష్టిస్తాడు. అతని అసలు ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలందరిదృష్టి అతను తీసిన ఆ పనికిమాలిన సినిమా వైవునకు మళ్లించాలని. అతను సినిమా ఎంత చెత్తగా తీసిన లాభాలతో ఆ సినిమా పెట్టుబడిని వారం, పది రోజుల్లో లాగేస్తాడు.జనానికి ఆ సినిమాలో ఏం లేదని అర్ధమయ్యేలోపు జరగాల్సిన పనులన్నీ జరిగిపోతాయి.ఆయనగారు ఎంతగా జనాన్ని ప్రభావితం చేస్తాడంటే సినిమా చూసిన వాడు చూడని వాడితో ఆ సినిమాకి వేస్ట్ బాగోలేదు అని చెప్పినా చూడనివాడు సినిమా చూసి బాగోలేదని కనఫర్మ్  చేసుకునే వరకూ ఉండలేడు. అంతలా ఆయన మత్తు పని చేస్తుంది. ఈమధ్య కొంతమంది బ్లాగర్లు ఇదే పని పెట్టుకున్నట్టున్నారు. తమ బ్లాగులను పాపులర్ చేసుకోవడం కోసమో లేక ఏమి వ్రాయాలో అర్ధం కాకో ఇతర బ్లాగులను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ ఒరవడి తెలుగు బ్లాగులకు ఏమాత్రం ఆరోగ్యకరమైనది కాదని తెలుసుకోవాలి. వీలైతే తెలుగు బ్లాగులను ప్రోత్సాహించండి. అద్భుతమైన తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని నెలకొలిపే ప్రయత్నం చేయండి.అంతే కాని ఎదుటి వారి బ్లాగులను దూషించకండి. వీలయితే, వాటి యొక్క ఉన్నతికి సహకరించండి.అంతే కాని దయచేసి బ్లాగ్ ఫ్యాక్చనిజాన్ని తిరిగి లేపకండి ప్లీజ్! 

త్వరలో బ్లాగ్ వేదిక యాడ్ నెట్ వర్క్!

తెలుగు బ్లాగర్లు,బ్లాగ్ వీక్షకులు నాకందిస్తున్న ప్రోత్సాహం వలన ఇప్పటికే బ్లాగ్ వేదికను చక్కగా తీర్చిదిద్దాను. త్వరలో మరిన్ని మార్పులు, ప్రయోగాలు చేస్తాను.త్వరలో బ్లాగ్ కోడ్ తో బ్లాగ్ వేదికను తీర్చిదిద్దే ప్రయత్నం కూడా చేస్తాను. నిజానికి బ్లాగ్ వేదిక ఏ అగ్రిగేటర్ కు పోటీ కాదు. కూడలి, మాలిక, బ్లాగిల్లు శ్రీనివాస్ గారు, పల్లా కొండలరావుగారు ఇచ్చే ప్రోత్సాహంతోనే నా ప్రయోగాలు సాగుతున్నాయి. నిజానికి పైవారిని ఆదర్శంగా తీసుకునే ఈ బ్లాగ్ వేదికను నడుపుతున్నాను.ఎప్పటికైనా బ్లాగ్ వేదిక మీ అందరి మనస్సు దోసుకుంటుదన్న పూర్తి నమ్మకం నాకుంది. త్వరలోనే ఓ వినూత్న ప్రయోగం చేపట్టబోతున్నాను. బ్లాగ్ వేదిక యాడ్ నెట్ వర్క్ స్థాపించబోతున్నాను. మరిన్ని వివరాలు త్వరలో మీకందిస్తాను. అంతవరకూ శెలవు.

నా టపాకు విశేష స్పందన!

నేను ఇంతకు ముందు వ్రాసిన "తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లను ఆదుకోండి" అనే టపాకి విశేష స్పందన వచ్చింది. చాలామంది తెలుగుబ్లాగర్లు అగ్రిగేటర్ల లోగోలను వారి బ్లాగులకు జోడించడం ఒక శుభపరిణామంగా భావిస్తున్నాను. ఎంతోమంది నాకు మెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేయడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మన అగ్రిగేటర్లకే మనం సపోర్టు చేయకపోతే ఎలా చెప్పండి? మిగతా బ్లాగర్లు కూడా కనీసం తమ బ్లాగులను నమోదు చేసుకున్న అగ్రిగేటర్ల లోగోలనైనా అతికించి మద్దతు తెలిపితే బాగుంటుంది. నా తపనను అర్థం చేసుకుని తోడ్పాటును అందించిన వారందరికీ శుభాభివందనములు.

తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లను ఆదుకోండి!

      గౌరవనీయులైన తెలుగు బ్లాగర్లందరికీ శుభాభివందనములు
      ఈరోజు మనకి అంతర్జాలంలో తెలుగు బ్లాగుల అగ్రిగేటర్లు ప్రధానంగా మూడే వున్నాయి. 1.కూడలి,2.మాలిక,3.బ్లాగిల్లు.ఇవి కాకుండా కొంతమంది నాలాంటి ఔత్సాహికులు బ్లాగుప్రపంచం,పూదండ,బ్లాగ్ వేదిక లాంటి అగ్రిగేర్లను నిర్వహిస్తున్నారు.
     గతంలో అందరి మన్ననలను పొందిన అగ్రిగేటర్ "హారం" పూసలదండలోని ఒక పూసలా అగ్రిగేర్ల మాలలోంచి విడివడి కనుమరుగయిపోయింది.మొన్నటికి మొన్న దాని నిర్వహణా భారం మోయలేక శ్రీనివాస్ గారు బ్లాగిల్లు ముగించేద్దామనుకుని, తిరిగి తెలుగు బ్లాగుల పట్ల అభిమానం చంపుకోలేక దానిని కష్టనష్టాలకోర్చి నిలబెట్టారు.ఆయనను మనమందరమూ అభినందించాల్సిందే!
    పల్లెప్రపంచం ఓనర్ పల్లా కొండలరావుగారు బ్లాగ్ ప్రపంచం నిర్వహించనని ఇప్పటికే తన బ్లాగు పూర్వకంగా తెలియజేసేసారు. ఇంకా గతంలో ఎంతోమంది ఇప్పటికే ఎన్నో తెలుగు అగ్రిగేర్లను మూసేసారు.దీనికంతటికీ కారణం ఏమిటి?
    నిజానికి ఈ తెలుగు బ్లాగుల అగ్రిగేర్లకు ఏవిధమైన ఆదాయవనరులు లేవు ఆఖరికి నెలవారి అయ్యే ఇంటర్ నెట్ బిల్లు కూడా ఈ అగ్రిగేర్ల వలన రాదు.అయినప్పటికీ తమ వ్యయంతో వీటిని కొనసాగిస్తున్నారు. మరి ఇన్నీ తెలిసిన మనం వారిని పట్టించుకుం టున్నామా? అంటే అదీ లేదు.
    మన బ్లాగులను ఈ అగ్రిగేర్లు ప్రమోట్ చెయ్యకపోతే అంతర్జాలంలో మన బ్లాగులకు ఉనికేలేదు.ఇది పచ్చి నిజం. ఎందుకంటే ఏ అగ్రిగేర్లోను నమోదు చేయని నా బ్లాగు ఒకటి ఒకనెలలో నాలుగంటే నాలుగు క్లిక్ లు మాత్రమే వచ్చాయి. తరువాత ఈ అగ్రిగేర్లలో నమోదు చేయబడిన తరువాత మరు నెలలో 2800 క్లిక్ లు వచ్చి చేరాయి.దీనిని బట్టి మన తెలుగు బ్లాగుల అగ్రిగేర్ల గొప్పతనం మనకు అర్ధమవుతోంది.
    నిజానికి ఈ అగ్రిగేర్లు బ్లాగుకు 1సం//కు ఒక 50రూపాయలో,100రూపాయలో ఫీజు పెడితే బాగుంటుందేమో అనిపిస్తోంది. కాని ఏ ఫీజు లేకుండా చాలా సేవ చేస్తున్నాయి.ఇతర రాష్ట్రాల అగ్రిగేర్లైతే కొంతమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి.
    ఇంత చేస్తున్న మనం వాటికి ఏమి చేస్తున్నామో చెప్పండి ఏమీ లేదే! ఏవిధంగా వారికి చేయూతనివ్వని మన తెలుగు బ్లాగర్లు కనీసం ఆయా అగ్రిగేర్ల లోగోలను కూడా మన బ్లాగులకు అతికించడం లేదు.కనీసం వారి అగ్రిగేర్ లోగోలను బ్లాగుల్లో పెట్టుకున్నా వారికి కొంత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని నిoపినవారమవుతాము.మనం వాటి పట్ల అదీ కూడా చేయకపోతే ఈ అగ్రిగేర్ల సేవలను ఉచితంగా పొంది వారికి తీరని అన్యాయం చేస్తున్నట్టే!
    ఎంతోమంది సీనియర్ బ్లాగర్లు కూడా వారికి కనీసం ఈ విధమైన సహకారం అందించడం లేదు. ఇది ఎంత దారుణం. దయచేసి ఇప్పటినుండైనా అగ్రిగేర్లను నిలబెడదాం! వాటి లోగోలను మన బ్లాగులకు అతికించి తెలుగు బ్లాగుల అగ్రిగేర్లందరికీ సెల్యూట్ చేద్దాం!జైహింద్!! 

నేటి సినిమాల వలన సమాజానికి మేలు ఎక్కువా? తక్కువా? కారణమేమిటి?

                           మీ జవాబులను అందించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇకనుండీ బ్లాగ్ వేదిక బ్లాగులకు రివ్యూలు!

తెలుగు బ్లాగుల వేదిక "బ్లాగ్ వేదిక"లో చేరబోయే  బ్లాగులకు రివ్యూలు రాద్దామని అనుకుంటున్నాను. ఇదంతా కేవలం ఆయా బ్లాగులకు మరింత ప్రచారం కలిపించడం కోసమేనని గమనించగలరు. బ్లాగ్ వేదిక కోసం ఓ మంచి మనసున్న మారాజు కోడ్ ఇస్తానని మాట ఇచ్చారు. ఆయనకు బ్లాగు పూర్వకంగా ధన్యవాదములు తెలుపుకుంటున్నాను. నేను ప్రతిక్షణం తెలుగు బ్లాగుల కోసమే ఆలోచిస్తున్నాను. ఇంకా బ్లాగ్ వేదికను అభివృద్ధి పరచాలంటే ఏమి చెయ్యాలి? ఎటువంటి శీర్షికలు ప్రవేశ పెడితే బాగుంటుంది ఇత్యాది ఎన్నో విషయాలు నా పరిశీలనలో ఉన్నాయి. ఎవరి అభిప్రాయాలు వారికుంటాయి. వాటిజోలికి పోనంతవరకూ తెలుగు బ్లాగులకు ఏవిధమైన ఇబ్బంది ఉండదని నా అభిప్రాయం. నీ అభిప్రాయమేదో నీవు చెప్పు. నీ అభిప్రాయం నచ్చిన వాళ్లు కలుస్తారు. నచ్చని వాళ్లు విమర్శిస్తారు. అటువంటి వారిని వదిలి పెట్టేయి. నీ తప్పులను హుందాగా ఎత్తిచూపించేవారిని మాత్రం దూరం చేసుకోకు. ఆనందంగా స్వీకరించి నీ తప్పులను సరి చేసుకో ఇదే నా పాలసీ! ఇదే నేను ఫాలో అవుతాను. ఇప్పటి వరకూ పెద్దగా నన్ను వ్యతిరేకించినవారు లేరు ఒకరిద్దరు తప్ప! ప్రోత్సాహించినవారు మాత్రం అనేకులు. అయితే "రచ్చబండ" స్థాపించిన తరువాత వ్యతిరేకుల ఉదృతి పెరిగే అవకాశం ఉందనిపిస్తోంది. ఏది,ఏమైనా తెలుగు బ్లాగుల పట్ల నా కృషి విరమించుకునే అవకాశం మాత్రం లేదు.

నేటి సినిమాల వలన సమాజానికి మేలు ఎక్కువా? తక్కువా? కారణమేమిటి?

                                  పై ప్రశ్నను పంపినవారు: ముకుందం - కోదాడ!
మీ జవాబులను అందించడానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇదేం ఖర్మ?

వ్రాసిన టపాలకు తిండి (కామెంట్లు)దొరకక తెలుగు బ్లాగర్లు బాధ పడుతుంటే, మరో ప్రక్క కామెంట్లు ఎక్కువుగా రావడం తట్టుకోలేని వాళ్లు అలాంటి బ్లాగులను నిరోధించాలని గోల పెడుతున్నారు. ఇంకొన్నాళ్లు పోతే ఆన్లైన్ బ్లాగు ప్రపంచంలో ధర్నాయో, నిరాహారదీక్షయో (బ్లాగులకు దూరంగా ఉండడం,భోజనం మానివేయడం మాత్రం కాదు సుమా!) మొదలుపెడతారేమో! ఇవ్వన్నీ చూస్తుంటే ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న తెలుగు బ్లాగుల ప్రపంచానికి మరింతగా నాశనమయ్యే ప్రమాదం ఉందనిపిస్తోంది. పల్లా కొండలరావుగారు ప్రజను దూరం పెట్టడం, శ్యామలీయంగారు దూరంగా ఉంటాననడం ఇవ్వన్నీ రాబోయే తెలుగు బ్లాగుల ప్రపంచానికి సంభవించే విపత్తుకి సూచనగా ఉన్నాయి. నాలాంటి చిన్న బ్లాగర్లు ఇవ్వన్నీ చూస్తూ ఉండగలరా? తట్టుకోగలరా? నా వరకూ అయితే ఎప్పుడూ బ్లాగు ప్రపంచానికి ఏదో అభివృద్ధి చేయాలనే చూస్తున్నాను. ఖాళీ దొరికితే చాలు బ్లాగు ప్రపంచంలోనే గడుపుతున్నాను. అటువంటిది బ్లాగు ప్రమాదం వస్తే ఎలా? ఏది ఏమైనా ఆ ప్రళయాన్ని ఆపే ప్రయత్నం చేస్తాను.మీరు కూడా రండి.తెలుగు బ్లాగుల ప్రపంచాన్ని పునర్మిద్ధాం.

ఆడవారిపై అత్యాచారాలను నిరోధించాలంటే ఏమి చెయ్యాలి?

మీ సమాధానం పంపడానికి రచ్చబండ చర్చావేదికను సంప్రదించండి.


తెలుగు బ్లాగర్లందరికీ బ్లాగ్ వేదిక ప్రత్యేక స్వాగతం.

బ్లాగ్ వేదీక ఇంతకు ముందు ప్రకటించినమాదిరిగానే అతి త్వరలో వెబ్సైట్ గా మారుతుంది. మిగతా బ్లాగ్ వేదిక సర్వీసులన్నీ అదే డొమైన్ క్రింద కొనసాగుతాయి. ఇంకా ఏవైతే సర్వీసులు ప్రకటించాలని బ్లాగ్ వేదిక ప్రకటించిందో అవ్వన్నీ త్వరలో తమ సర్వీసులను ప్రారభిస్తాయి. యాడ్ నెట్ వర్క్ కూడా ప్రారంభమవుతుంది. ఇవ్వన్నీ బ్లాగ్ వేదికతో ముడిపడియున్న బ్లాగులకు మాత్రమేనని మనవి. ఒకవేళ మీ బ్లాగులను బ్లాగ్ వేదికలో జత చేయకుంటే ఈరోజే జతచేయండి.

రచ్చబండ చర్చావేదికలోని తొలి ప్రశ్న.. ప్రజ చర్చావేదిక నిర్వాహకులు పల్లా కొండలరావుగారిదే!

చ్చబండ...ప్రజ చర్చావేదిక నిర్వాహకులు పల్లా కొండలరావుగారి తొలి ప్రశ్నతో రెడీ అయ్యింది.ప్రియమైన వీక్షకులందరూ ఈ ప్రశ్నకు జవాబు ఇవ్వండి.రచ్చబండ వేదికను జయప్రదం చేయండి.మీ స్పందనలను బట్టే బ్లాగు మనుగడ సాగుతుంది. మన శ్యామలీయంగారు చెప్పినట్టుగా ఈ చర్చావేదికను చేపల మార్కెట్ కాకుండా చూసుకోవాలని నిర్ణయించాను. అంతేకాదు ఈ రచ్చబండలో అతి లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాను.ప్రజ బ్లాగు పట్ల వచ్చిన విమర్శలను చూసాను. నిజానికి పల్లా కొండలరావుగారు తెలుగు బ్లాగుల ఉనికి కోసం తన వంతు కృషి చేస్తున్నారు. అది ఏమాత్రం గుర్తించకుండా కేవలం ఆయన పబ్లిసిటీ కోసం నడుపుతున్నారని మాటలాడటం ఎట్టి సమయంలోను సంస్కారవంతం కాదని నా నిశ్చితాభిప్రాయం. ఎంతో సమయాన్ని, వ్యయాన్ని ఖర్చు చేసి పబ్లిసిటీ కోసం నడపడం వలన ఒరిగేది ఏమీ లేదు. ఇటువంటి బ్లాగులను నడపడం వెనుక అసలు ఉద్దేశ్యం కేవలం ఒక అంశం యొక్క పూర్తి విషయాలను తెలుసుకోవడం, తెలియజేయడం అంతే! ఈ విషయాలను గమనిస్తారని కోరుకుంటూ నా బ్లాగు మిత్రులకు స్వాగతం పలుకుతూ ...మీ రచ్చబండ.

తెలుగు బ్లాగు మిత్రులందరికీ స్వాగతం..సుస్వాగతం.

 గౌరవనీయులైన తెలుగు బ్లాగు మిత్రులారా! ఈబ్లాగు ద్వారా అనేక అంశాలపై చర్చలు నిర్వహించాలనే ఉద్దేశ్యంతో ఈ రచ్చబండ ను స్థాపించాను.ఏదైనా అంశం పట్ల నల్గురూ కల్సి చర్చించగలిగినప్పుడే దాని యొక్క లోతుపాతులు తెలుస్తాయి. దాని యొక్క అసలు ప్రయోజనం మనిషికి అర్ధమవుతుంది. దాని అసలు ఉద్దేశ్యం నిరూపితమవుతుంది. దాని కారణంగానే ఈ రచ్చబండ బ్లాగు అందరికీ ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో నేను నిర్వహించాలనుకుంటున్నాను. ఇప్పటికే "ప్రజ" అనే పేరుతో ఓ చర్చావేదికను పల్లా కొండలరావుగారు నడుపుతున్నారు. ఇది తప్ప మరో చర్చావేదిక తెలుగు బ్లాగుల ప్రపంచంలో లేదు. బహుశా ఈ రచ్చబండ రెండవదవుతుంది. ఏది ఏమైనా ఈ రచ్చబండ అందరికీ ఉపయోగపడాలని ఆశపడుతున్నాను.
మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి:రచ్చబండ

ఈరోజు టపా:వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?- సాక్ష్యం మేగజైన్

బ్లాగ్ వేదిక ప్రకటించిన మాదిరిగానే ప్రతిరోజూ బ్లాగు వేదికలోని సభ్యుల బ్లాగర్ల నుండి, ప్రజాదరణ పొందిన మంచి,మంచి టపాలను మరొకసారి మీకు గుర్తుకు తీసుకు వస్తుంది.ఒక కండీషన్ ఏమిటంటే బ్లాగ్ వేదిక లోగో అతికించిన బ్లాగులను మాత్రమే పరిచయం చేస్తుంది. దయచేసి బ్లాగ్ వేదిక సభ్యులందరూ లోగోను మీ బ్లాగులకు అతికించవల్సిందిగా కోరుచున్నాము.గమనించగలరు.
ఈరోజు టపా:వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?

రలోకాన్ని వ్యతిరేకించే కొందరి నమ్మకాల్లో ఓ నమ్మకం "పునర్జన్మ" సిద్ధాంతం.ఈ విశ్వాసం లేక సిద్ధాంతం ప్రకారం మనిషి తన కర్మల సత్ఫలితాలను, దుష్ఫలితాలను అనుభవించడానికి ఈ లోకంలోనే పదే పదే జన్మిస్తాడని,తన కర్మల ఫలితంగా ఒకప్పుడు మనిషిగా జన్మిస్తే మరొక్కప్పుడు ఏదో ఒక జంతువుగానో,కీటకంగానో లేక చెట్టుచేమల రూపంలోనో జన్మించి మరల,మరల ఈ లోకంలోకే వస్తాడు అన్నది.ఈ సిద్ధాంతం ఓ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.గ్రీకు,రోమన్లు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు.ఈజిఫ్ట్ ప్రాచీన చరిత్రలోను ఈ విశ్వాసం కానవస్తుంది.వీటి ప్రభావంగా ఓ కాలంలో యూదుల్లోను ఈ నమ్మకం వ్రేళ్లూనుకుంది.మన భారతదేశంలోని హిందువుల్లోను,జైనుల్లోను,బౌద్ధుల్లోను దీనికి మంచి ప్రాచుర్యం లభించింది.
    ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటిని,ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.ఈ సిద్ధాంతాన్ని మనం విజ్ఞానం,తర్కం వెలుగులో సమీక్షిస్తే ఇది కేవలం ఓ అసత్యమైన నమ్మకం లేక సిద్ధాంతం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండదు. Read more

ఈరోజు టపా:పూర్తిగా చెడిపోతున్న కాలేజీ అమ్మాయిలు! -నా మనోడైరీ బ్లాగ్.

బ్లాగ్ వేదిక ప్రకటించిన మాదిరిగానే ప్రతిరోజూ బ్లాగు వేదికలోని సభ్యుల బ్లాగర్ల నుండి, ప్రజాదరణ పొందిన మంచి,మంచి టపాలను మరొకసారి మీకు గుర్తుకు తీసుకు వస్తుంది.ఒక కండీషన్ ఏమిటంటే బ్లాగ్ వేదిక లోగో అతికించిన బ్లాగులను మాత్రమే పరిచయం చేస్తుంది. దయచేసి బ్లాగ్ వేదిక సభ్యులందరూ లోగోను మీ బ్లాగులకు అతికించవల్సిందిగా కోరుచున్నాము.గమనించగలరు.

ఈరోజు టపా:పూర్తిగా చెడిపోతున్న కాలేజీ అమ్మాయిలు!
రోజు అమ్మాయిల పరిస్థితి దారుణంగా ఉంది.Boy Friend లేని అమ్మాయిలు లేరు.అలాగే Girl Friend లేని అబ్బాయిలు లేరు. (బహుశా కొంతమంది జెన్యూన్ అబ్బాయిలు,అమ్మాయిలు ఉండొచ్చు!నా అభిప్రాయం వారికి వర్తించదు) 
        కట్ చేస్తే...
        నేను ఒక ప్రాంతానికి వర్కు నిమిత్తం వెళ్లి,అక్కడ రూం అద్దెకు తీసుకుని ఉన్నాను.నేను 8నెలలు ఉండాల్సి వచ్చిందిలెండి.నా పక్క ఫోర్షన్ లో మరో నాలుగు గదులున్నాయి.వాటిలో కాలేజీ స్టూడెంట్స్ ఉంటున్నారు.
        నేను వాళ్లను దగ్గర నుండి గమనించింది ఏమిటంటే....

బ్లాగ్ వేదికకు మీ బ్లాగులను జతచేయండి.

మీ బ్లాగును బ్లాగ్ వేదికలో చేర్చుటకు ఈ Comment box 
కి మీ బ్లాగ్ URL ,మీ బ్లాగ్ గురించి రెండు మాటలు టైపు చేసి పంపించండి చాలు.24గం||లలో మీ బ్లాగును పరిశీలించి తీసుకోవడం జరుగుతుంది.

గమనించప్రార్ధన
* బ్లాగ్ వేదిక లోగో మీ బ్లాగుకు 
తప్పనిసరిగా జతచేసి సహకరించగలరు. బ్లాగ్ వేదిక లోగో అతికించని బ్లాగులు స్వీకరించబడవు.
* మంచి,మంచి మీ టపాలను పరిచయం చేసి మీ బ్లాగ్ లింక్ ఇవ్వడం,మీకు ముందుగా తెలియజేయడం జరుగుతుంది.
* త్వరలో ఎన్నో వినూత్న ఫీచర్లు. 
Related Posts Plugin for WordPress, Blogger...