బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బ్లాగ్ వేదిక మరికొంత నూతనంగా!

పల్లా కొండలరావుగారు, వారి కుమారుడు అరవింద్ గారి సహకారంతో బ్లాగ్ వేదికను మరికొంత నూతనంగా తయారు చేసాను.బ్లాగు వేదికలో ముందుగా 20వరకూ తాజా టపాలు ప్రదర్శించబడతాయి. వీటి సంఖ్యను పెంచే ప్రయత్నాన్ని అరవింద్ గారు చూస్తున్నారు.ఇక లేటెస్ట్ అప్ డేట్ తో కూడిన మిగతా బ్లాగులన్నీ బ్లాగ్ విడ్జెట్స్ ద్వారా ప్రదర్శించబడతాయి.గమనించగలరు. బ్లాగ్ వేదికకు ఎంతగానో సహకరించిన పల్లా కొండలరావుగారికి, అరవింద్ గారికి బ్లాగ్ వేదిక తరుపున సాక్ష్యం గ్రూప్ తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు.

ప్రియమైన తెలుగు బ్లాగు వీక్షకులకు, తెలుగు బ్లాగర్లకు ప్రత్యేక తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు.

ఈ రోజు హైదరాబాద్ (వివరాలకు)లో సాయంత్రం 3గంటల నుండి 6గంటల వరకు తెలుగుబ్లాగుల దినోత్సవాన్ని తెలుగు వికీపీడియా, e-తెలుగు కల్సి సం యుక్తంగా నిర్వహిస్తున్నారు. వారికి నా బ్లాగ్ వేదిక తరపున ప్రత్యేక అభినందనలతోపాటు, శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. దానితోపాటు తెలుగు బ్లాగర్లందరికీ బ్లాగ్ వేదిక తరపున ప్రత్యేక శుభాకాంక్షలు. ఈ సమావేశం అత్యంత ప్రయోజనకారిగా, శాంతిపూరిత వాతావరణంగా జరగాలని ఆ సృష్టికర్తను మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. జైహింద్!!!

తెలుగు బ్లాగుల దినోత్సవానికి తెలుగు బ్లాగర్లందరికీ ప్రత్యేక ఆహ్వానం.


మీ తెలుగు బ్లాగులను బ్లాగ్ వేదికకు జతచేయండి

2,3రోజులలో బ్లాగ్ వేదిక ఒక ప్రొఫెషనల్ అగ్రిగేటర్ మాదిరిగా మారబోతుంది.ఇప్పటివరకూ బ్లాగ్ వేదికను ఆదరిస్తూ వచ్చిన మీకందరికీ ప్రేత్యెక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకనుండీ కూడా మరింతగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.100 ఉత్తమ బ్లాగుల శీర్షిక తయారైపోయింది. ఇంచుమించు 23బ్లాగుల వరకు సేకరణ జరిగింది. న్యూ కోడ్ తో మీ ముందు ప్రత్యక్షమవుతుంది.ఇక మీ తెలుగు బ్లాగులేమైనా ఉంటే బ్లాగ్ వేదికకు జతచేయండి.

ఈరోజు నుండి 100ఉత్తమ బ్లాగుల శీర్షిక ప్రారంభం

కొన్ని ఉత్తమబ్లాగులను సేకరించడం జరిగింది.అవన్నీ కూడా ఈరోజు 100 ఉత్తమబ్లాగులు (100 Blogs)పేరు మీద ఒక శీర్షికను ప్రారంభిస్తాను.ప్రతి ఉత్తమ బ్లాగరికి ఆ విషయాన్ని తెలియజేయేడమే కాకుండా ఆ శీర్షికకు సంబంధించిన లోగోను అందిస్తాను.ప్రతి ఉత్తమ బ్లాగరు ఆ లోగోను ధరించడం వలన కొన్ని ప్రయోజనాలు మీకు లభిస్తాయి. ఎవరికైనా మీ బ్లాగుతోపాటు ఇతర బ్లాగులను కూడా చూడవచ్చు. మీకు కూడా మీ బ్లాగు ఉత్తమ బ్లాగుల శీర్షికలో ఉండడానికి అర్హత ఉందనిపిస్తే తప్పనిసరిగా ఈ క్రింది బాక్స్ లో తెలియజేయండి. అంతే కాకుండా మీకు నచ్చి ఉత్తమ బ్లాగు అనిపించినా దయచేసి తెలియజేయండి. 100 ఉత్తమ బ్లాగులు అతిత్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాము. సహకరించగలరు....మీ బ్లాగ్ వేదిక టీం.

ఈరోజు నుండీ ఉత్తమ బ్లాగులకోసం వెతుకులాట!

తంలో ఎవరైనా ఉత్తమబ్లాగుల విషయంలో సలహాలు,సూచనలు అందించమని చెప్పాను గని ఎవరూ పెద్దగా స్పందించలేదు. అసలు ఈ శీర్షికను నడపడమే కష్టమని కొంతమంది ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఏ ప్రాతి ప్రదికపై మీరు ఉత్తమ బ్లాగులుగా సెలెక్ట్ చేస్తారు అని అడిగారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రశ్నలకు సమాధానం కష్టమే! అయినప్పటికీ మన కృషి మనం చేస్తే పోయేదేముంది అన్న ఉద్దేశ్యంతో ఈపనికి పూనుకున్నాను. నా ఆలోచనల ప్రకారం ప్రతి విభాగానికి 10బ్లాగుల చొప్పున 10 విభాగాల్ను ఎన్నుకుంటే బాగుంటుంది అనిపించింది. ఉదాహరణకు: 1.సాహిత్యం, 2.ఆధ్యాత్మికం, 3.సాకేతికం 4.రాజకీయ విశ్లేషణలు 5.సినిమా విశ్లేషణలు, 5.వింత ప్రపంచం 6.చదువు సంధ్యలు 7.సంపాదనా మార్గాలు 8.వార్తలు - వాయింపులు 9.షాపింగ్ మాల్స్ 10.పుస్తకాలు.
    పైవన్నీ 100ఉత్తమ బ్లాగుల్లో 10విభాగాలు. అవి మరింత మెరుగైన సేవలకోసం మారవచ్చు కూడా! ముఖ్యంగా ఒకో విభాగంలో అనేక బ్లాగులుండవచ్చు. అయితే ఏదైతే టపాల తరచుదనం ఉంటుందో అది మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే చక్కగ బ్లాగును ఎల్లప్పుడూ రాసేవారికి ఈ సౌకర్యం కల్గించడం భావ్యం అని నా భావం. ఈ నా ప్రయత్నం మీకందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. మీ అభిప్రాయాలకై ఎదురుచూస్తూ....@ కె.యస్.చౌదరి.

దేవుని యొక్క అద్భుతమైన సముద్ర సృష్టితాలు.

థార్మిక శాస్త్రాలలో ఒక గొప్ప విషయముంది.చెట్లన్నీ కలాలుగా మార్చి, సముద్రాన్ని సిరా చేసి దేవుని ఘనతను వ్రాసినా చెట్లు అరిగిపోతాయి,సముద్రాలు తరిగిపోతాయిగాని దేవుని ఘనత పూర్తికాదు అని చెప్పబడ్డాయి.అది ముమ్మాటికీ నిజమే! మచ్చుకు ఈ సముద్ర సృష్టితాలు చూడండి.
Related Posts Plugin for WordPress, Blogger...