బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇక నుంచి తెలుగు ప్రజల ఆంధ్రా బ్యాంకు అడ్రెస్ గల్లంతు! - కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్

Centeral-minister-Nirmala-Sitharaman-Decision-Effect-on-Andhra-bank-blog-vedika
ఆంధ్రా బ్యాంకు... ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంకుగా పరిగణిస్తారు. ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళితే.. తమ బ్యాంకులోకి అడుగుపెట్టినట్టే ప్రతి తెలుగోడూ భావిస్తాడు. అలాంటి ఆంధ్రా బ్యాంకు ఇకపై కనబడదు. తెలుగోడి గుండె పగిలే ఈ వార్త ఎవరి నోటి నుంచి వచ్చిందో తెలుసా? ఆంధ్రా కోడలైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచే ఈ వార్త వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరమే. ఏం చేస్తాం మరి... తెలుగింటి కోడలు దేశ రాజధానిలో మీడియా సమావేశం పెట్టి మరి తన అత్తారింటి బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకును ఇంకో బ్యాంకులో విలీనం చేస్తున్నామని - ఇకపై ఆంధ్రా బ్యాంకు పేరు వినిపించడని ఏమాత్రం సంకోచం లేకుండానే చెప్పేశారు.

అయినా తెలుగింటి కోడలు అయినా - ఆంధ్రా కోడలుగా మనం పిలుచుకున్నా... తన సొంత రాష్ట్రం - తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలపై శీతకన్నేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నా... తన అత్తారింటికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడం సాధ్యం కాదు కదా. ఏపీలోని కీలక జిల్లా - రాజకీయంగా మంచి పరిణతి కనిపించే జిల్లాగా పేరున్న కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య... ఎఫ్పుడో స్వాతంత్య్రానికి పూర్వమే 1923 నవంబర్ 20న కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును ప్రారంభించారు.

Related Posts Plugin for WordPress, Blogger...