ఆంధ్రా బ్యాంకు... ఈ పేరు వినగానే తెలుగు ప్రజలు తమ సొంత బ్యాంకుగా పరిగణిస్తారు. ఆంధ్రా బ్యాంకు శాఖకు వెళితే.. తమ బ్యాంకులోకి అడుగుపెట్టినట్టే ప్రతి తెలుగోడూ భావిస్తాడు. అలాంటి ఆంధ్రా బ్యాంకు ఇకపై కనబడదు. తెలుగోడి గుండె పగిలే ఈ వార్త ఎవరి నోటి నుంచి వచ్చిందో తెలుసా? ఆంధ్రా కోడలైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నోటి నుంచే ఈ వార్త వినాల్సి రావడం నిజంగా దురదృష్టకరమే. ఏం చేస్తాం మరి... తెలుగింటి కోడలు దేశ రాజధానిలో మీడియా సమావేశం పెట్టి మరి తన అత్తారింటి బ్యాంకుగా పేరుగాంచిన ఆంధ్రా బ్యాంకును ఇంకో బ్యాంకులో విలీనం చేస్తున్నామని - ఇకపై ఆంధ్రా బ్యాంకు పేరు వినిపించడని ఏమాత్రం సంకోచం లేకుండానే చెప్పేశారు.
అయినా తెలుగింటి కోడలు అయినా - ఆంధ్రా కోడలుగా మనం పిలుచుకున్నా... తన సొంత రాష్ట్రం - తన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలపై శీతకన్నేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్నా... తన అత్తారింటికి జరుగుతున్న అన్యాయాన్ని ఆపడం సాధ్యం కాదు కదా. ఏపీలోని కీలక జిల్లా - రాజకీయంగా మంచి పరిణతి కనిపించే జిల్లాగా పేరున్న కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య... ఎఫ్పుడో స్వాతంత్య్రానికి పూర్వమే 1923 నవంబర్ 20న కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆంధ్రా బ్యాంకును ప్రారంభించారు.
అప్పటి నుంచి ఇప్పటిదాకా తనదైన రీతిలో సేవలు అందించిన ఆంధ్రా బ్యాంకు.. తన ప్రధాన కార్యాలయాన్ని మచిలీపట్నం నుంచి ఉమ్మడి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు మార్చుకుని దేశీయ బ్యాంకింగ్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆంధ్రా బ్యాంకుకు 2885 బ్రాంచ్ లు ఉన్నాయి. 38 శాటిలైట్ కార్యాలయాలు - 3798 ఏటీఎంలను కలిగిన ఆంధ్రా బ్యాంకు ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో కీలక బ్యాంకుగానే ఎదిగింది.
1969లో అప్పటి ప్రధాని ఇందిరా గాందీ... బ్యాంకుల జాతీయకరణ దిశగా తీసుకున్న నిర్ణయంతో అప్పటిదాకా తన సొంతంగానే సాగిన ఆంధ్రా బ్యాంకు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారిపోయింది. ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ప్రైవేట్ బ్యాంకుల పోటీని కూడా తట్టుకుని ఆంధ్రా బ్యాంకు తనదైన శైలి ప్రగతిని సాధించింది. ఇలాంటి బ్యాంకు ఇకపై కనిపించదంటే... నిజంగానే తెలుగు ప్రజలకు చేదు వార్తగానే చెప్పాలి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆంధ్రా బ్యాంకును కలిపేస్తున్నట్లుగా నిర్మల చేసిన ప్రకటన తెలుగోళ్లను కోపం తెప్పించిందనే చెప్పాలి.
ఈ కోణంలో కొందరు నిర్మల నిర్ణయాలను పరిశీలన చేయగా... ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. మహారాష్ట్ర కేంద్రంగా కొనసాగుతున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాస్తవానికి ఆంధ్రా బ్యాంకు కంటే చిన్నదే. అయితే ఆ బ్యాంకును ఏ ఒక్క బ్యాంకులో విలీనం చేయని నిర్మల... దాని కంటే ఎన్నో రెట్లు పెద్దదైన ఆంధ్రా బ్యాంకును మాత్రం యూనియన్ బ్యాంక్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించడం నిజంగానే ఆగ్రహం తెప్పించేదే. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు విలీనం బెడద లేకుండా చూసిన కేంద్రం... దాని బలోపేతానికి ఇతోదికంగా నిధులు ఇచ్చే దిశగానూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కూడా నిర్మల నోట వెంటే వినాల్సి వచ్చింది.
ఇక ఆంద్రా బ్యాంకులో ఇతర బ్యాంకులను విలీనం చేసి ఆంధ్రా బ్యాంకు పేరును కొనసాగిస్తారని కొందరు ఆశించినా... అందుకు విరుద్ధంగా వ్యవహరించిన కేంద్రం... ఆంద్రా బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆప్ ఇండియాలో విలీనం చేస్తూ... యాంకర్ బ్యాంకుగా యూనియన్ బ్యాంకే వ్యవహరిస్తుందని ప్రకటించి... ఆంధ్రా బ్యాంకు పేరు ఇకపై వినబడదని సంచలన ప్రకటన చేసింది. మొత్తంగా ఏళ్ల తరబడి ఉత్తమ సేవలు అందించిన తెలుగోళ్ల బ్యాంకు పీక తెలుగింటి కోడలు చేతితోనే పిసికించేయడం మోదీ మార్కు పాలనకే చెల్లిందన్న వాదన వినిపిస్తోంది.

No comments:
Post a Comment