|
జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా? |
మాజీ సియం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ పాల్పడుతున్న దాడులకు ప్రజలు గట్టి సమాధానం చెప్తారన్న విషయం వైసిపి వారు గమనిస్తే మంచిది. ఎందుకంటే మన సియం జగన్ యుక్త వయస్సు కలవాడు. ప్రస్తుత జనరేషన్ కలవాడు కాబట్టి అతని ఆలోచనలు కూడా చురుకుగానే పనిచేస్తాయి. అవన్నీ ఆంధ్రా అభివృద్ధిపై పెడితే బాగుంటుంది. నిజానికి వెనుకుండి చక్కని దారి చూపే సీనియర్ నాయకులు అతనికి కావాలి. కానీ అటువంటి ఆలోచనలు ఉన్న నాయకులెవరూ వైయస్సార్ పార్టీలో కనిపించడం లేదు. రోజా, అంబటి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి కొత్త లీడర్లు నోరేసుకు పడిపోవడం తప్ప వీళ్ళు ఊడబెరికేది ఏదీ లేదు. వీళ్ళందరూ అది కూల్చేస్తాం... ఇది కూల్చేస్తాం అంటుంటే రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం కలుగుతోంది. జగన్ చంద్రబాబు పట్ల వ్యహరిస్తోన్న తీరు నచ్చడం లేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు. ఆంధ్రాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న నాయకుడు. అటువంటి చంద్రబాబు పట్ల జగన్ గౌరవ తీరు ప్రదర్శిస్తే ఆ హుందాతనం జగన్ కు బంగార కిరీటమయి కూర్చుంటుంది. నిజానికి జగన్ మాదిరి చంద్రబాబు ఉంటే అనేక ఆర్ధిక కేసుల్లో ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తిని ఏమి చేయవచ్చో ఆలోచించండి. కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏరోజూ జగన్ మాదిరి ప్రవర్తించలేదు. ఇదే ఆంధ్రా ప్రజలను ఆలోచింపజేస్తుంది.
కనీసం ఇపుడైనా ఆంధ్రా ప్రజలు అలోచిస్తారని ఆశిద్దాము.
ReplyDeleteసాక్షాత్తు ప్రతిపక్ష నాయకుని మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడు పరామర్శించడం మానేసి ఎగతాళి చేసిన వారు ఇప్పుడు తమకు గౌరవం ఇవ్వడం లేదని గగ్గోలు పెట్టడం దయ్యాలు వేదం వల్లించినట్టుంది.
ReplyDeleteఈ ఖరీఫ్ పంట నుండి పగటి పూటే తొమ్మిది ఘంటలు విద్యుత్ సరఫరా వలన లక్షలాది రైతులు బాగుపడతారు. జనం ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఫలానా అతనెవరికో మర్యాద ఇవ్వట్లేదని లేదా రేకుల షెడ్డులు కూల్చారని దిగులు పడరు.
Super gaa chepparu, inka kontha mandiki ardham kavadam ledhu. Prajale mukyam ani
Deleteఆంధ్రా ప్రయోజనాలను TRS కు తాకట్టు పెట్టటం కూడా ప్రజహిత కార్యక్రమమేనా?
ReplyDeleteభ్రమరావతి భ్రష్టాచారుల భరతం పట్టడం, కరకట్ట అక్రమకట్టడాలపై ఉక్కుపాదం, బాక్సయిట్ భూతాలపై బెత్తం, ఇసుక మాఫియా ఆగడాల అంతం, వ్యవసాయానికి ఘంటలు పగటి పూటే కరెంటు, అంగన్వాడీ జీతాల పెంపు, డ్వాక్రా రుణమాఫీ, ఆర్టీసీ సమ్మె నివారణ, ఉద్యోగులకు మధ్యంతర భృతి, బడిపిల్లలకు అమ్మ ఒడి పథకం, పోలీసన్నలకు వారంలో ఒక సెలవు: ఇవాండీ తెరాసకు తాకట్టు పెట్టిన ప్రయోజనాలు?
Delete