బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏడాది పాలన పై ప్రజలకు మోదీ లేఖ ..!

PM-Narendra-Modi-letter-to-the-people-of-India
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తయ్యింది. 2019 లో జరిగిన  ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు పౌరసత్వ చట్ట సవరణ ఆర్టికల్ 370 రద్దు అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా .. దేశప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు.

లాక్ డౌన్ పై సస్పెన్స్..20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ

PM-Narendra-Modi-annouced-Rs-20-lakh-crore-for-self-development

లాక్ డౌన్ పై సస్పెన్స్..20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ

కరోనా మహమ్మారిపై కొనసాగిస్తున్న పోరులో కీలక దశగా భావిస్తున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా? లేదంటే... ఈ నెల 17తోనే ఎత్తేయాలా? అన్న విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనదైన మార్క్ సస్పెన్స్ ను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా నానాటికీ కుదేలవుతున్న ఆర్థిక రంగానికి ఊపిరిలూదేలా లాక్ డౌన్ ను ఈ నెల 17తో ముగిస్తారని దాదాపుగా అన్ని వర్గాలు భావిస్తే... అందుకు విరుద్ధంగా వ్యవహరించిన మోదీ.. అసలు లాక్ డౌన్ ను పొడిగించాలా? వద్దా? అన్న విషయంపై ఈ నె 18 లోగా నిర్ణయం తీసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పేశారు. అయితే కుదేలైన ఆర్ధిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేలా ఏకంగా రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం చేశారు.

జూన్ 1 వరకు లాక్ డౌన్ ..ప్రధాని సంచలన నిర్ణయం !

U-K--lockdown-to-stay-in-place-till-June-1

జూన్ 1 వరకు లాక్ డౌన్ ..ప్రధాని సంచలన నిర్ణయం !

చైనా లో వెలుగుచూసిన ఈ మహమ్మారి వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఎన్ని కఠిన మైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అమెరికాలో ఈ మహమ్మారి భాదితుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నారు. అమెరికా తరువాత దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి.  ఈ  వైరస్ మరణాల సంఖ్యలో యూరప్ దేశాలన్నిటి కంటే టాప్లో కొనసాగుతోంది.

షాకిచ్చిన కేంద్రం: కరోనాతో కలిసి బతకాల్సిందేనట.!

 
కరోనా వైరస్ దేశంలో విస్తరిస్తుండడం.. కట్టడికి విధించిన లాక్ డౌన్ పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోవడంతో కేంద్ర ప్రభుత్వంలో నిరాశ నిసృహ వ్యక్తమవుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో  కరోనా కేసుల సంఖ్య 59662కి చేరిందని.. కరోనా వల్ల దేశంలో ఇప్పటివరకు 1985మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

ఈ సందర్భంగా లవ్ అగర్వాల్ మాట్లాడుతూ ‘‘ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే కరోనా వైరస్ నియంత్రణ చర్యలను జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలని.. మన ముందు పెద్ద సవాల్ ఉందని.. కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోక తప్పదని’’ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దేశవ్యాప్తంగా 216 జిల్లాల్లో ఇప్పటిదాకా కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదని లవ్ అగర్వాల్ తెలిపారు. 42 జిల్లాల్లో గత 28 రోజులుగా పాజిటివ్ కేసులేవీ నమోదు కాలేదని పేర్కొన్నారు. మరో 29 జిల్లాల్లో గత 21 రోజులుగా కొత్త కేసులు బయటపడలేదన్నారు.

లాక్ డౌన్ మినహాయింపుల నేపథ్యంలో వలస కూలీలు సొంత ప్రాంతాలకు వెళుతున్నారని.. కరోనా విజృంభించే అవకాశాలున్నాయని.. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని లవ్ అగర్వాల్ తెలిపారు. వలస కూలీల కోసం 222 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు తెలిపారు. 2.5 లక్షల మంది సొంత ప్రాంతాలకు వెళ్లారని వివరించారు.

ఇది వరకు ఏపీ సీఎం జగన్ కూడా ఇదే మాట అని లాక్ డౌన్ సడలించాలని.. కరోనాతో కలిసి బతకాల్సిందేనని.. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. అప్పుడు జగన్ ను విమర్శించిన వాళ్లకు ఇప్పుడు కేంద్రం ప్రకటన చెంపపెట్టులా మారింది.

చెన్నై మార్కెట్ వల్లే ఏపీలో కరోనా..700మంది కోసం వేట!

చెన్నై మార్కెట్ వల్లే ఏపీలో కరోనా..700మంది కోసం వేట!

ఏపీలో కరోనా వ్యాప్తిపై సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ పై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్షించిన సీఎం ఈ సందర్భంగా ఏపీలో కరోనా వ్యాప్తికి తమిళనాడు కోయంబేడు మార్కెట్ ఒక కారణం అని చెప్పుకొచ్చారు. ఆ మార్కెట్ వల్లే చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని.. చెన్నైలోని కోయంబేడు మార్కెట్ కు వెళ్లిన రైతులతోపాటు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన 700మంది కూలీలపై దృష్టిపెట్టామని తెలిపారు. ఈ 700మంది కూలీలు రాష్ట్రంలోకి ప్రవేశించారని.. వారికి అనుమతులు లేవని.. పరీక్షలు చేయించుకోలేదని.. వారి వల్లే కరోనా వ్యాపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి వివరాలు తెలుసుకొని పరీక్షలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని వివరించారు.

ఏపీకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితోనే ముప్పు ఎక్కువగా ఉందని సీఎం జగన్ అన్నారు. వారిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.ఇందుకోసం సరిహద్దుల్లో 11 చోట్ల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా కరోనా నిర్ధారణ పరీక్షల్లో దేశంలోనే ఏపీ ముందుందని సీఎం జగన్ చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 165069 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ప్రతీ 10 లక్షల మంది జనాభాకు 3091 పరీక్షలు చేస్తున్నట్టు వివరించారు.

Related Posts Plugin for WordPress, Blogger...