చైనా లో వెలుగుచూసిన ఈ మహమ్మారి వల్ల ప్రస్తుతం ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అయితే ఎన్ని కఠిన మైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా కరోనా భాదితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అమెరికాలో ఈ మహమ్మారి భాదితుల సంఖ్య రోజురోజుకి భారీగా పెరుగుతున్నారు. అమెరికా తరువాత దారుణంగా దెబ్బతిన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి. ఈ వైరస్ మరణాల సంఖ్యలో యూరప్ దేశాలన్నిటి కంటే టాప్లో కొనసాగుతోంది.
ఇప్పటికే అక్కడ 31 వేల మందికి పైగా బ్రిటీషర్లు బలి అయ్యారు. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ సైతం చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. వైరస్ పాజిటివ్ గా తేలిన ఆయన వారం రోజుల పాటు ఆసుపత్రి పాలయ్యారు. వైరస్ తీవ్రత ఇంకా చల్లారకపోవడంతో బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. లాక్ డౌన్ ను జూన్ 1వ తేదీ వరకు పొడిగించినట్లు బోరిస్ జాన్సన్ ప్రకటించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరణాల రేటులో ఇప్పుడిప్పుడే కొద్దిగా వేగం మందగించిందని దీన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చేనెల 1వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినట్లు తెలిపారు
ఇప్పుడున్న లాక్ డౌన్ పరిస్థితులను మరింత కఠినం చేస్తామని అన్నారు. లాక్ డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల దాని తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టిందని ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగిస్తే కరోనాను అరికట్టవచ్చు అని అయన అభిప్రాయం పడ్డారు. ఏవైనా సడలింపులను ఇవ్వదలచుకుంటే.. జూన్ 1వ తేదీ తరువాతేనని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే బ్రిటీషర్లకు క్వారంటైన్ తప్పనిసరి చేశామని దానికి అంగీకరించిన వారే స్వదేశానికి రావాల్సి ఉంటుందనీ ఆయన స్పష్టం చేశారు వ్యవసాయం దాని అనుబంధ పరిశ్రమలకు ఇది వరకే పాక్షికంగా సడలింపులను ఇచ్చింది బ్రిటీష్ ప్రభుత్వం. వాటినే కొనసాగిస్తామని అన్నారు. పబ్లులు క్లబ్బుల వంటి ఎంటర్ టైన్ మెంట్లను తెరవడానికి ఇప్పట్లో ఆదేశాలను ఇవ్వలేమని అన్నారు.
No comments:
Post a Comment