బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

Swiss-bank-accounts-India-at-77th
స్విస్ బ్యాంకుకు సంబంధించి తాజా రిపోర్ట్ వెల్లడైంది. 2019లో భారతీయుల డిపాజిట్లు 6 శాతం తగ్గి రూ.6625 కోట్లకు పరిమితమయ్యాయని స్విస్ బ్యాంకు ప్రకటించింది. భారతీయులు సొమ్ము భద్రపరిచే విధానం 5.8 శాతం పడిపోయినట్లు స్పష్టమైంది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో బ్యాంక్ ఈ వివరాలు తెలిపింది. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరి కల్లా స్విస్ బ్యాంకులో సొమ్ము దాచిపెట్టిన భారతీయ పౌరులు సంస్థల జాబితా ఆధారంగా ఈ కొత్త ర్యాంకులను వెల్లడించారు.

2018లో 74వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 77వ స్థానానికి పడిపోయింది. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా దీనికి సంబంధించిన గణాంకాలను రిలీజ్ చేసింది. స్విస్ బ్యాంకులో డబ్బు దాస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. ఎస్ ఎన్ బీకి చెందిన భారతీయ బ్రాంచిల్లోనూ ఆ సంఖ్య తగ్గినట్లు తేలింది. స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచిపెట్టన సొమ్ములో భారత వాటా కేవలం 0.06 శాతం మాత్రమే ఉన్నట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ తన రిపోర్ట్లో పేర్కొన్నది.

భూమిపై 8వ ఖండం కనుగొన్నారు.. ఎక్కడంటే?

భూమిపై 8వ ఖండం కనుగొన్నారు.. ఎక్కడంటే?
Found-the-8th-continent-on-earth
భూమిపై ఇప్పటిదాకా ఏడు ఖండాలే.. కానీ ఇప్పుడు 8వ ఖండాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దానికి ‘జిలాండియా’ అనే పేరు పెట్టారు. న్యూజిలాండ్ దేశానికి దగ్గరలో ఈ ఖండం ఉంది.

ఒకప్పుడు అన్ని ఖండాల్లోనే జిలాండియా కూడా సముద్రంలో పైకి తేలుతూ ఉండేదట.. కొన్ని కారణాల వల్ల ఇది సముద్రంలో కలిసిపోయింది. 2017లో దీన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

జిలిండియా చిన్న ఖండం ఏమీ కాదు.. దాదాపు 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది వ్యాపించి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తాజాగా న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు బాతిమెట్రి అనే విధానం ద్వారా ఈ ఖండం మ్యాప్ ను తయారు చేశారు. 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించిన ఈ జిలాండియా ఖండంలో కేవలం 6శాతం మాత్రమే సముద్రం పైకి కనిపిస్తుండడం గమనార్హం.

న్యూ క్యాలడోనియా దీవులు విస్తరించిన ప్రాంతంలో ఈ జిలాండియా ఖండం ఉంది. 1995లో బ్రూస్ లుయెండిక్ అనే భౌతిక శాస్త్రవేత్త మొదట ఎనిమిదో ఖండాన్ని గుర్తించారు. దానికి ఆ పేరు పెట్టారు.

ప్రధాన పత్రికకు కరోనా సెగ..16మందికి పాజిటివ్

ప్రధాన పత్రికకు కరోనా సెగ..16మందికి పాజిటివ్

New-Dangerous-Disease-Hits-in-News-Media
హైదరాబాద్ లో కరోనా విచ్చలవిడిగా అందరికీ సోకుతోందన్న విమర్శలున్నాయి. తెలంగాణ ప్రభుత్వం పెద్దగా టెస్టులు చేయకపోవడంతో ఎవరికి ఉందో ఎవరికి లేదో తెలియడం లేదు. ఉన్నవారు కరోనా బాంబర్లుగా మారి అందరికీ అంటించేస్తున్నారు. ఈ క్రమంలోనే అనుమానం వచ్చి తెలుగులోనే ప్రధాన పత్రిక తన ఉద్యోగులైన జర్నలిస్టులకు కరోనా టెస్టులు చేయించిందట ఇందులో షాకింగ్ విషయం బయటపడినట్టు మీడియా వర్గాల సమాచారం.

సదురు ప్రధాన పత్రికకు కరోనా సెగ తగిలిందట. ఒకటి కాదు రెండు కాదు.. ప్రధాన కార్యాలయంలోని 125మందికి కరోనా టెస్టులు చేయిస్తే ఏకంగా 16మందికి పాజిటివ్ గా బయటపడడంతో ఆ మీడియా సంస్థ ఉలిక్కిపడింది.ఈ పదహారు మంది ఎవరెవరితో కాంటాక్ట్స్లో ఉన్నారు? అనే విషయాన్ని ఇప్పుడు ఆరా తీస్తున్నారు. వాళ్ల కుటుంబ సభ్యులకూ కరోనా పరీక్షలు చేయిస్తున్నారు.

ఉద్యోగులకి కొత్త మార్గదర్శకాలు జారీచేసిన ఏపీ హైకోర్టు

ఉద్యోగులకి కొత్త మార్గదర్శకాలు జారీచేసిన ఏపీ హైకోర్టు

Andhra-Pradesh-High-Court-issued-new-guidelines-for-employees
ఆంధ్రప్రదేశ్ లో వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది.  రోజురోజుకీ వైరస్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతూనే ఉంది. దీనితో రాష్ట్ర ప్రజానీకంతో పాటుగా ...ప్రభుత్వం కూడా ఆందోళన చెందుతుంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఈ వైరస్ తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు పరుస్తోంది. తాజాగా అనంతపురం జిల్లాలో లాక్ డౌన్ కూడా విధించింది ప్రభుత్వం. ఇక శనివారం ఏపీలో  కొత్తగా 491 కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు అధికారులకు సిబ్బందికి ఉద్యోగులకు కీలక మర్గదర్శకాలు విడుదల చేసింది. కార్యాలయంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదని హైకోర్టు రిజిస్ట్రర్ రాజశేఖర్ పలు సూచనలు చేశారు. హైకోర్టు అధికారులు సిబ్బంది కేంద్ర కార్యాలయం వదిలి వెళ్లరాదని ఆదేశించింది. ఒకవేళ ఎవరైనా అలా కార్యాలయం విడిచి వెళ్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.  అలానే కోర్టు వరండాల్లో జనసమూహం ఎక్కువగా ఉండటానికి వీల్లేదని పేర్కొన్నది.  కోర్టు ఆవరణలో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.   కొత్త మార్గదర్శకాలను ఉద్యోగులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు రిజిస్ట్రార్ పేర్కొన్నారు.  కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగుల కోసం కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

హైదరాబాద్ జర్నలిస్టులకు దిమ్మ తిరిగే షాక్.. రోజులో 23 మందికి పాజిటివ్

హైదరాబాద్ జర్నలిస్టులకు దిమ్మ తిరిగే షాక్.. రోజులో 23 మందికి పాజిటివ్

23-journalists-test-Dangerous-Disease-positive-in-Hyderabad-in-a-day
ప్రజల సమస్యలు.. మహమ్మారి వేళ.. ప్రభుత్వ ఏర్పాట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రంట్ లైన్ వారియర్స్ లో కీలకమైన జర్నలిస్టుల్ని మాయదారి రోగం కమ్మేసింది. ఈ మధ్యనే కొందరు జర్నలిస్టులకు పాజిటివ్ గా తేలటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు.. నాలుగు రోజుల క్రితం తెలంగాణ సెక్రటేరియట్ లో జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా మహమ్మారి నిర్దారణ పరీక్షల్ని నిర్వహించారు.

ఈ టెస్టులకు సంబంధించిన ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తంగా నలబై మందికి నిర్వహించిన పరీక్షల్లో 23 మందికి పాజిటివ్ గా తేలటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం ఆదివారం సాయంత్రం వేళలో బయటకు వచ్చింది. హైదరాబాద్ మీడియాలో ఇదో షాకింగ్ గా మారింది. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా రిపోర్టింగ్ లో ఉన్న వారికి.. డెస్కులో ఉన్న వారికి సైతం పాజిటివ్ కావటం గమనార్హం.

భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !

భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !

India-Overtook-The-UK-To-Become-The-Fourth-Worst-Hit-Nation
భారత్ లో  మహమ్మారి జోరు చాలా ఉదృతంగా కొనసాగుతోంది. రోజుకు సుమారు 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు రికార్డువుతుండడంతో మిగతా దేశాలను భారత్ వేగంగా దాటేస్తోంది.  ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్ను దాటేసింది.  2074397 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ (787489) - రష్యా (502436) వరుసగా రెండు - మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 9996 కొత్త  వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 286589కి చేరింది. వీరిలో ఈ  మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 141029 మంది కోలుకోగా.. 8102 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 137448 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Related Posts Plugin for WordPress, Blogger...