బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Dailymotion.com/sakshyamtv

కామెంట్ల వరద ఏమయింది?

ఈమధ్య ఏబ్లాగు చూసినా ఎందులోనూ పెద్దగా కామెంట్లే కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో తెలుగు బ్లాగుల విజిటింగ్ రేట్ కూడా పడిపోయింది. పెద్దగా ఎవరూ అగ్రిగేటర్ల ద్వారా బ్లాగుల వీక్షణకు రావడం లేదు. ఆ రీతిలో బ్లాగు టపాలు లేవంటారా? లేక తెలుగు బ్లాగులను ఆదరించేవారే కొరువయ్యిపోయారా? నా ఉద్దేశ్యంలో ఈతరం వాళ్ళందరూ తెలుగు కంటే ఆoగ్లం (ఇంగ్లీష్) అంటేనే ప్రేమ చూపిస్తున్నారు గాని మాతృభాష పట్ల ఇచుమంత ఆదరణ కూడా చూపించడం లేదు. నిజానికి ఈ జనాల నెత్తి మీద కూర్చున్న రాజకీయ నాయకులు కూడా తెలుగుభాష ఔన్నత్యం,ప్రాముఖ్యత కొరకు ఏవిధమైన కృషి కూడా చేయలేదు. ఇక తెలుగు భాష ఎలా బ్రతుకుతుంది. చదువురాని వారి వలన ఇది బ్రతుకుతుందిగాని, చదువుకున్నవారు,చదువుకుంటున్నవారి వలన ఈ భాష బ్రతకడం లేదు.ఈ ప్రభావం ఇప్పటినుండే తెలుగుబ్లాగులపై పడిపోయింది. ఒక్కప్పుడు ఎన్నో చర్చలు జరిగేవి. కామెంట్లే ఊపిరిగా బ్లాగర్లు ఎన్నో అద్భుతమైన రచనలు చేసేవారు. ఇప్పుడు ఆ ఊపిరేది?   

బ్లాగిల్లు మూతబడిపోయింది. ఇక తరువాత ఏవో..?

బ్లాగిల్లు మూతబడే ముందురోజు "బ్లాగిల్లు శ్రీనివాసుగారు" ఫోన్ చేసి సర్ బ్లాగిల్లు మూసివేద్దామనుకుంటున్నానని అన్నప్పుడు నేను చాలా అవాక్కయ్యాను. అరె ఈయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారేమిటబ్బా అని ఆశ్చర్యపోయాను. దానిని నడపడం తనకు చాలా ఆర్ధిక ఇబ్బందిగా ఉందని చెప్పారాయన! నిజమే ఈ బ్లాగుల వలన ఎటువంటి ఆదాయం లేకపోగా ఎంతో వృధా ఖర్చు. ఏదో ఫ్రీగా ఒక బ్లాగు క్రియేట్ చేసి ఏవో మన రాతలు మనం వ్రాసుకుంటే పర్లేదు గాని ఒక డొమైన్ మెయిన్ టైన్ చేస్తూ ఒక అగ్రిగేటర్ని నడపాలంటే మామూలు విషయం కాదుకదా! ఈ ఇబ్బందులన్నీ మోయలేక ఆయన బ్లాగిల్లు మూసివేశారు. బ్లాగిల్లు మూసివేస్తున్నానని ఆయన తన బ్లాగులో వ్యక్తం చేసినా ఒకరు కూడా ముందుకు వచ్చి సహకరించకపోవడం చాలా ఆశ్చర్యంగానే ఉంది. తెలుగు బ్లాగుల ప్రపంచం అంతమయ్యిపోతుందా అనిపిస్తోంది. బ్లాగిల్లుకు ముందు ఎన్నో అగ్రిగేటర్లు కాల గర్భంలో కల్సిపోయాయి. ఇప్పుడు బ్లాగిల్లు...ఇక ముందు ఏవో...ఇప్పుడున్న ప్రధాన అగ్రిగేటర్లు రెండే ఉన్నాయి ఒకటి కూడలి, రెండోది మాలిక. ఏదిఏమైనా ఎంతో కాలం ఇంచుమించు 4 లేక 5 సంవత్సరాల నుండి తెలుగు బ్లాగుల కోసం బ్లాగిల్లు శ్రీనివాస్ గారు చేసిన కృషి మనం మరవలేనిది. 

బ్లాగ్ వేదికకు మీ బ్లాగులను కలపండి.

మీరు బ్లాగరా? అయితే వెంటనే మీ బ్లాగులను బ్లాగ్ వేదికకు జతచేయండి. బ్లాగ్ వేదిక ద్వారా అనేక ప్రయోజనాలు పొందండి. కాలానుగుణంగా సమకూర్చే అనేక ఫీచర్స్ లో పాల్గొనండి. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
Related Posts Plugin for WordPress, Blogger...