బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్ల వరద ఏమయింది?

ఈమధ్య ఏబ్లాగు చూసినా ఎందులోనూ పెద్దగా కామెంట్లే కనిపించడం లేదు. ఈమధ్య కాలంలో తెలుగు బ్లాగుల విజిటింగ్ రేట్ కూడా పడిపోయింది. పెద్దగా ఎవరూ అగ్రిగేటర్ల ద్వారా బ్లాగుల వీక్షణకు రావడం లేదు. ఆ రీతిలో బ్లాగు టపాలు లేవంటారా? లేక తెలుగు బ్లాగులను ఆదరించేవారే కొరువయ్యిపోయారా? నా ఉద్దేశ్యంలో ఈతరం వాళ్ళందరూ తెలుగు కంటే ఆoగ్లం (ఇంగ్లీష్) అంటేనే ప్రేమ చూపిస్తున్నారు గాని మాతృభాష పట్ల ఇచుమంత ఆదరణ కూడా చూపించడం లేదు. నిజానికి ఈ జనాల నెత్తి మీద కూర్చున్న రాజకీయ నాయకులు కూడా తెలుగుభాష ఔన్నత్యం,ప్రాముఖ్యత కొరకు ఏవిధమైన కృషి కూడా చేయలేదు. ఇక తెలుగు భాష ఎలా బ్రతుకుతుంది. చదువురాని వారి వలన ఇది బ్రతుకుతుందిగాని, చదువుకున్నవారు,చదువుకుంటున్నవారి వలన ఈ భాష బ్రతకడం లేదు.ఈ ప్రభావం ఇప్పటినుండే తెలుగుబ్లాగులపై పడిపోయింది. ఒక్కప్పుడు ఎన్నో చర్చలు జరిగేవి. కామెంట్లే ఊపిరిగా బ్లాగర్లు ఎన్నో అద్భుతమైన రచనలు చేసేవారు. ఇప్పుడు ఆ ఊపిరేది?   

1 comment:

  1. స్వఛ్ఛంగా పారే నీటిప్రవాహంలో మురికి వరదలాగా అనేకమార్గాలద్వారా వచ్చి కలుస్తూ ఉంటే ఏమౌతుంది? ముచికుందానంది గతి ఏమయ్యిందో అదే అవుతుంది. చర్చాబ్లాగులు కూడా కాలుష్యం మేటలు మేటలుగా వదలటం అన్నదీ ఒక ముఖ్యకారణమే. చివరికి వ్యాఖ్యలు అంటే దుమ్మెత్తిపోసుకోవటాలూ దుర్భాషలాడుకోవటాలూ అన్న స్థితి రావటం వలన వ్యాఖ్యలు వ్రాసేందుకూ ఆసక్తి తగ్గుతోంది చదువరులకు - ఏమి చెప్పినా హేళనలకు గురికావలసిందేకదా అని. ఇక వ్రాసేవారికి ఉత్సాహం ఎలా వస్తుందండీ - విషయపరిజ్ఞానం లేకపోయినా విరుచుకుని పడితిట్టే వాళ్ళతోనూ నిందాలాపాలతో నిప్పులు కురిసే వాళ్ళతోనూ మాటలు పడటానికి టపాలు వ్రాయలని ఎవరు మాత్రం అనుకుంటారు? ఇక మిగిలినవి రొట్టబ్లాగులండి - సినిమాలూ, రాజకీయాలూ - ప్రచారాలూ వగైరాల సరుకులు. జనం ఇంకా బ్లాగుల్ని ఆదరించాలని కోరుకోవటమూ అత్యాశయే అనిపిస్తోంది.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...