బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బ్లాగిల్లు మూతబడిపోయింది. ఇక తరువాత ఏవో..?

బ్లాగిల్లు మూతబడే ముందురోజు "బ్లాగిల్లు శ్రీనివాసుగారు" ఫోన్ చేసి సర్ బ్లాగిల్లు మూసివేద్దామనుకుంటున్నానని అన్నప్పుడు నేను చాలా అవాక్కయ్యాను. అరె ఈయన ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారేమిటబ్బా అని ఆశ్చర్యపోయాను. దానిని నడపడం తనకు చాలా ఆర్ధిక ఇబ్బందిగా ఉందని చెప్పారాయన! నిజమే ఈ బ్లాగుల వలన ఎటువంటి ఆదాయం లేకపోగా ఎంతో వృధా ఖర్చు. ఏదో ఫ్రీగా ఒక బ్లాగు క్రియేట్ చేసి ఏవో మన రాతలు మనం వ్రాసుకుంటే పర్లేదు గాని ఒక డొమైన్ మెయిన్ టైన్ చేస్తూ ఒక అగ్రిగేటర్ని నడపాలంటే మామూలు విషయం కాదుకదా! ఈ ఇబ్బందులన్నీ మోయలేక ఆయన బ్లాగిల్లు మూసివేశారు. బ్లాగిల్లు మూసివేస్తున్నానని ఆయన తన బ్లాగులో వ్యక్తం చేసినా ఒకరు కూడా ముందుకు వచ్చి సహకరించకపోవడం చాలా ఆశ్చర్యంగానే ఉంది. తెలుగు బ్లాగుల ప్రపంచం అంతమయ్యిపోతుందా అనిపిస్తోంది. బ్లాగిల్లుకు ముందు ఎన్నో అగ్రిగేటర్లు కాల గర్భంలో కల్సిపోయాయి. ఇప్పుడు బ్లాగిల్లు...ఇక ముందు ఏవో...ఇప్పుడున్న ప్రధాన అగ్రిగేటర్లు రెండే ఉన్నాయి ఒకటి కూడలి, రెండోది మాలిక. ఏదిఏమైనా ఎంతో కాలం ఇంచుమించు 4 లేక 5 సంవత్సరాల నుండి తెలుగు బ్లాగుల కోసం బ్లాగిల్లు శ్రీనివాస్ గారు చేసిన కృషి మనం మరవలేనిది. 

3 comments:

  1. చౌదరి గారూ ! మీ అభిమానానికి కృతజ్ఞతలు . తెలుగు బ్లాగులు మళ్ళీ వెలగాలంటే తెలుగు భాష ముందు ఆదరణ పొందాలి, అభివృద్ధి చెందాలి . అప్పుడే క్రొత్తతరం వస్తుంది, రచనలు చేసేవారి సంఖ్య పెరుగుతుంది.

    ReplyDelete
  2. శ్రీనివాస్ గారూ,
    మీ బ్లాగిల్లు మూత పడినట్లు నాకు తెలియదు. కొత్త బ్లాగిల్లు సిద్ధం చేసి కొంతకాలం నడిపారు కదా!
    ఏమయినప్పటికీ ఇంతకాలం అగ్రిగేటర్ నడిపినందుకు మీకు ధన్యవాదాలు. మీ బ్లాగిల్లునే నేను ప్రధానంగా చూసేవాడిని.

    ReplyDelete
  3. శరత్ గారూ బ్లాగిల్లుపై మీకు గల అభిమానానికి కృతజ్ఞతలు . ప్రస్తుతానికి బ్లాగిల్లును క్రింది లింకులో చూడొచ్చు
    http://blogillu.blogspot.com/

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...