బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?

జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?
జగన్ కు వ్యక్తిగత కక్షలు అవసరమా?
మాజీ సియం చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని జగన్ పాల్పడుతున్న దాడులకు ప్రజలు గట్టి సమాధానం చెప్తారన్న విషయం వైసిపి వారు గమనిస్తే మంచిది. ఎందుకంటే మన సియం జగన్ యుక్త వయస్సు కలవాడు. ప్రస్తుత జనరేషన్ కలవాడు కాబట్టి అతని ఆలోచనలు కూడా చురుకుగానే పనిచేస్తాయి. అవన్నీ ఆంధ్రా అభివృద్ధిపై పెడితే బాగుంటుంది. నిజానికి వెనుకుండి చక్కని దారి చూపే సీనియర్ నాయకులు అతనికి కావాలి. కానీ అటువంటి ఆలోచనలు ఉన్న నాయకులెవరూ వైయస్సార్ పార్టీలో కనిపించడం లేదు. రోజా, అంబటి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి కొత్త లీడర్లు నోరేసుకు పడిపోవడం తప్ప వీళ్ళు ఊడబెరికేది ఏదీ లేదు. వీళ్ళందరూ అది కూల్చేస్తాం... ఇది కూల్చేస్తాం అంటుంటే రాష్ట్ర ప్రజలకు ఆగ్రహం కలుగుతోంది. జగన్ చంద్రబాబు పట్ల వ్యహరిస్తోన్న తీరు నచ్చడం లేదు. ఎందుకంటే చంద్రబాబు అంటే సామాన్యమైన వ్యక్తేమీ కాదు. ఆంధ్రాకు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా పేరున్న నాయకుడు. అటువంటి చంద్రబాబు పట్ల జగన్ గౌరవ తీరు ప్రదర్శిస్తే ఆ హుందాతనం జగన్ కు బంగార కిరీటమయి కూర్చుంటుంది. నిజానికి జగన్ మాదిరి చంద్రబాబు ఉంటే అనేక ఆర్ధిక కేసుల్లో ఉండి ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తిని ఏమి చేయవచ్చో ఆలోచించండి. కానీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏరోజూ జగన్ మాదిరి ప్రవర్తించలేదు. ఇదే ఆంధ్రా ప్రజలను ఆలోచింపజేస్తుంది.

30రోజుల జగన్ పరిపాలన వైరల్ అవుతున్న వీడియో! | 30 days Jagan administration Video that goes viral!

30రోజుల జగన్ పరిపాలన వైరల్ అవుతున్న వీడియో!

లిఫ్ట్ ఇవ్వటం నేరం - ఫైన్ కట్టాల్సిందే!

offense-to-lift-fine-cut
టైటిల్ చూసి షాక్ అయ్యారా?

నిజమే..రాత్రి సమయంలో.. వర్షంలో.. లిఫ్ట్ అడిగిన వ్యక్తులను తన కారులో ఎక్కించుకున్న పాపానికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని చేతిలో చలానా పెట్టి.. కోర్టు మెట్లు ఎక్కించారు ఖాకీలు. అంతేనా.. మరోసారి ఇలా చేయొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. ఎవరో అల్లాటప్పా వ్యక్తులకు.. కేసులు లేక పెట్టింది కాదు ఇది.. ఓ ఐటీ కంపెనీ ఓనర్ కు ఎదురైనా చేదు అనుభవం..
ఇప్పటి వరకు బైక్, కారు నడిపే వాహనదారుల్లో 99శాతం మందికి లిఫ్ట్ ఇవ్వటం నేరం అన్న సంగతి ఇండియాలో తెలియకపోవటం మరో విచిత్రం.. విశేషం…

పూర్తి వివరాల్లోకి వెళితే.. నితిన్ నాయర్. ముంబైలో ఉంటాడు. ఐటీ కంపెనీలో పని చేస్తూ ఇటీవలే ఓ కొత్త కంపెనీ పెట్టుకున్నాడు. రోజూ మాదిరిగానే తన ఆఫీస్ నుంచి జూన్ 18వ తేదీ సాయంత్రం ఇంటికి వెళుతున్నాడు. ముంబైలోని ఐరోలి సర్కిల్ దగ్గరకు వచ్చాడు. అప్పటికే జోరు వాన.. ట్రాఫిక్ జామ్.. రోడ్లపై నీళ్లు.. ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేస్తున్న నితిన్ నాయర్ కు రోడ్డు పక్కన వర్షంలో ఇబ్బంది పడుతున్న ముగ్గురు వ్యక్తులు కంటపడ్డారు. వారు లిఫ్ట్ కోసం చూస్తున్నారు. వారి బాధను అర్ధం చేసుకున్న నితిన్ కారును ఆపాడు. ఎక్కడికి వెళ్లాలో తెలుసుకుని.. కారులో ఎక్కించుకున్నాడు.

Related Posts Plugin for WordPress, Blogger...