బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మీ బ్లాగ్ Off Page : SEO గూర్చి పూర్తిగా తెలుసుకోండి.మీ బ్లాగును టాప్ పొజిషన్లో నిలబెట్టుకోండి.

Get-Your-Blog-Off-Page-Learn-about-SEO
హాయ్ ఫ్రెండ్స్!.. మీ ముందుకు కొత్త ట్రాఫిక్ తో వచ్చేసా! ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనమందరమూ బ్లాగును నడుపుతూ ఉంటాము. నిజానికి మనకి అగ్రిగేటర్స్ ద్వారా తప్ప Google సెర్చింజన్ ద్వారా విజిటర్స్ రావడం బహు తక్కువ. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మన బ్లాగును SEOకి  అనుగుణంగా తీర్చి దిద్దకపోవడం ఒక కారణమైతే, మన బ్లాగులోని పోస్ట్ ఏవిధంగా పెట్టాలో తెలియక పోవడం మరొక కారణం. ఇంకా ప్రధానమైన సమస్య ఏమిటంటే Off Page : SEO గురించి అసలు తెలుసుకోకపోవడం. అంతర్జాలంలో ఎన్నో కోట్ల బ్లాగులుంటాయి. వాటిని తట్టుకుని మన బ్లాగు తన ఉనికిని చాటుకోవాలంటే మనకి Off Page : SEO గూర్చి తప్పక తెలియాలి. అప్పుడే మనం Google లో మన హవా చాటగలం. లేదంటే మన బ్లాగును మనం చూసుకోవడం తప్ప మరొకరు వీక్షించే అవకాశమే లేకుండా పోతుంది.

ఈరోజు తెలుగు బ్లాగ్ అగ్రిగేడర్ల ఉనికి మాయమవుతూనే ఉంది. కూడలి పోయిన తరువాత కేవలం మాలిక, శోధిని మాత్రమే మిగిలాయి. ఆ తరువాత  బ్లాగ్ వేదిక లాంటి కొన్ని బ్లాగ్ అగ్రిగేడర్లు కొద్దో,గొప్పో పని చేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా విజిటర్స్ సంఖ్య పెద్దగా ఏమీ రావడం లేదు. ఇంతకుముందు బ్లాగులో ఒక పోస్ట్ పెడితే కనీసం 250 మంది విజిటర్స్ వచ్చేవారు. ఇప్పుడు 50 మంది విజిటర్స్ రావడమే కష్టంగా మారిపోయింది. సబ్జెక్ట్ ఎంత బాగున్నా విజిటర్స్ సంఖ్య ఏమాత్రం పెరగడం లేదు. నిజానికి అగ్రిగేడర్ల ద్వారా వచ్చే వీక్షకులు పూర్తిగా తగ్గిపోయారు.

Off Page : SEO చేసిన బ్లాగులు మాత్రం google సెర్చింజన్ ద్వారా బాగానే విజిటర్స్ ని సంపాదించుకుంటున్నాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తరువాత మన తెలుగు బ్లాగర్స్ కి కూడా Off Page : SEO గూర్చి వివరాలు తెలియజేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఒక బ్లాగర్ తన బ్లాగును కొంతమందైనా విజిట్ చేసి తన పోస్టులు చదివితే అతనికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి మంచి,మంచి పోస్టులు పెట్టగలుగుతాడు. దాని వలన మనం కొంతవరకైనా తెలుగు బ్లాగుల ఉనికిని కాపాడుకున్న వాళ్ళమవుతాము. ఏమంటారు?

అసలు మనం పోస్టు ఏవిధంగా పెట్టాలి? బ్లాగును SEO ఏవిధంగా చేయాలి? Off Page : SEO అంటే ఏమిటి? ఇత్యాది విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ముందుగా మనం Off Page : SEO ఎన్ని రూపాలుగా ఉంటుందో తెలుసుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వివరణ అంతా ఈ బ్లాగులో అందిస్తాను. Codes, Setting Details ఈ Sakshyam Creative అనే బ్లాగులో అందిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ బ్లాగును మెయిల్ ద్వారానూ, గూగుల్ ప్లస్ ద్వారానూ ఫాలో కావడానికి Subscribe నన్ను చేసుకుని ప్రోత్సాహించండం మర్చిపోవద్దు.

ఇప్పుడు Off Page : SEO Details కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

మరో 9.. వరుస షాకులతో చైనా కంపెనీలు విలవిల

చైనా కంపెనీలకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా మరో 9 స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు కేంద్రం నోటీసులు జారీచేసింది. యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా భద్రపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రక్రియల గురించి తెలియజేయాలంటూ ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలకు కేంద్రం నోటీసులు పంపింది. నోటీసులు జారీచేసిన కంపెనీల్లో మోటోరోలో, ఆసుస్‌, హానర్‌, వన్‌ప్లస్‌, కూల్‌ ప్యాడ్‌, ఇన్‌ఫోకస్‌, బ్లూ, ఒప్పో, నుబియాలు ఉన్నాయి...Read More

Another 9 .. with row shocks China companies

శత్రు దేశాలకు దడ పుట్టిస్తున్న ఇండియా ఆయుధాలు

Indias-weapons-of-mass-destruction
డ్రాగన్‌' బుసలు కొడుతోంది. పదేపదే భారత భూభాగంలోకి చొరబడుతున్న చైనా, 'ముత్యాల సరం' పేరుతో భారత్‌ చుట్టూ ఉరితాడు పేనుతోంది. ఈ చక్రవ్యూహాన్ని ఛేదించేదెలా? చైనాకు మనం సమాధానం చెప్పలేమా...అంటే ప్రతి పౌరుడు ఇప్పుడు ఓ సైనికుడుగా మారి చైనాను బంగాళఖాతంలో కలిపేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే అత్యంత శక్తి వంతమైన ఆయుధాలు ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి..ఈ ఆయుధాలతో భారత సైన్యం ఇప్పుడు యుద్ధమంటూ వస్తే 1962 సంఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ రిపీట్ కాదనే ధీమాతో ఉంది. మిగతా...Read More

సముద్రంలో అంబాని దాచిన రహస్యం,చూస్తే నోరెళ్లబెడతారు !

Ambani's-hidden-secret-in-the-ocean-if-you-see-it
జియో అంటూ ఇండియా అంతా ఒక ఊపు ఊపేసిన అంబానీ దేశంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు. ఆయన విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటు పడిన మనిషి ప్రపంచంలోనే ఖరీదైన కార్లు,ప్రైవేట్ జెట్స్,షిప్స్ ఒకత రెండా కొత్తగా ఏదైనా వచ్చింది అంటే అది ఆయన ఇంట్లో ఉండాల్సిందే.ఇక ఆయన భార్య వాడే ఫోన్ ఖరీదు అక్షరాలా పాతిక కోట్లు. ఆయన ఉండే ఇంటి ధర ఏకంగా 12000 కోట్లు. మరి ఇప్పుడు ఏకంగా నీటిపైన తేలియాడే భవనాన్ని కొనుగోలు చేశారు. అదెలాగుందంటే.. Read More

ఈరోజు పబ్లిష్ చేయబడిన క్రొత్త విషయ సమాహారం

కామెంట్ల సెట్టింగ్స్ నుండి Anonymous తొలగిస్తే సభ్యత కలిగిన వ్యాఖ్యలు వస్తాయా?

కొంతమంది Anonymous ద్వారా అసభ్యత కలిగిన వ్యాఖ్యలు చేస్తూ బ్లాగర్లను కించపరచటమూ, రెచ్చ గొట్టడమూ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది అతి తెలివి బ్లాగర్లు తమ టపాలకు తామే Anonymous కామెంట్లు చేసుకుంటూ మరింత వివాదాలను సృష్టిస్తున్నారు.

ఇంకా మరికొంతమంది సన్నాసులున్నారు. తమకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయమున్న మిత్రుల యొక్క బ్లాగులలో Anonymous పేరు మీద విమర్శాత్మక, దూషణకరమైన లేక అవమాన పరిచే ధోరణిలో కామెంట్లు చేస్తూ చాలా దారుణంగా బాధకు గురిచేస్తున్నారు. వీరికి రెండు,మూడు ఐడిలు ఉంటున్నాయి.

కాబట్టి ఇటువంటి పరిస్థితులలో Anonymous ను కామెంట్ల సెక్షన్ ను బ్లాగర్ల సెట్టింగ్స్ నుండి తొలగిస్తే కొంతవరకైనా మంచి,మంచి పోత్సాహక కామెంట్లకు స్థానాన్ని కలిపించినవారమవ్వుతాము. దీనికి మీరేమంటారు?

If an unauthorized removal from the comments settings will come with comments from member states?

తెలుగు బ్లాగర్ దంతులూరి కిషోర్ వర్మ గారేమైపోయారు?

"మనకాకినాడలో" తెలుగు బ్లాగు ఈమధ్య అగ్రిగేటర్ లో కనిపించడం లేదు. ఆ బ్లాగ్ అప్డేట్ జరిగి చాలా కాలం కూడా అయ్యిపోయింది. ఇందులో ఎక్కువుగా కాకినాడను గూర్చిన సమాచారం లభించేది.

దంతులూరి కిషోర్ వర్మ  మంచి,మంచి రచనలతో పాటు ఎన్నో విశేషాలు అందించేవారు. ఇది చదవడానికి వీక్షకులకు ఎంతో సౌకర్యంగా ఉండడంతో పాటు ఇంట్రస్ట్ గా ఉండేది.

దయచేసి మన దంతులూరి కిషోర్ వర్మ గారిని మళ్ళీ తెలుగు బ్లాగుల ప్రపంచానికి తిరిగి రావాల్సిందిగా బ్లాగ్ వేదిక తరుపున కోరుచున్నాము.

Related Posts Plugin for WordPress, Blogger...