బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కామెంట్ల సెట్టింగ్స్ నుండి Anonymous తొలగిస్తే సభ్యత కలిగిన వ్యాఖ్యలు వస్తాయా?

కొంతమంది Anonymous ద్వారా అసభ్యత కలిగిన వ్యాఖ్యలు చేస్తూ బ్లాగర్లను కించపరచటమూ, రెచ్చ గొట్టడమూ చేస్తూ చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మరికొంతమంది అతి తెలివి బ్లాగర్లు తమ టపాలకు తామే Anonymous కామెంట్లు చేసుకుంటూ మరింత వివాదాలను సృష్టిస్తున్నారు.

ఇంకా మరికొంతమంది సన్నాసులున్నారు. తమకు వ్యక్తిగతంగా ఉన్న పరిచయమున్న మిత్రుల యొక్క బ్లాగులలో Anonymous పేరు మీద విమర్శాత్మక, దూషణకరమైన లేక అవమాన పరిచే ధోరణిలో కామెంట్లు చేస్తూ చాలా దారుణంగా బాధకు గురిచేస్తున్నారు. వీరికి రెండు,మూడు ఐడిలు ఉంటున్నాయి.

కాబట్టి ఇటువంటి పరిస్థితులలో Anonymous ను కామెంట్ల సెక్షన్ ను బ్లాగర్ల సెట్టింగ్స్ నుండి తొలగిస్తే కొంతవరకైనా మంచి,మంచి పోత్సాహక కామెంట్లకు స్థానాన్ని కలిపించినవారమవ్వుతాము. దీనికి మీరేమంటారు?

If an unauthorized removal from the comments settings will come with comments from member states?

5 comments:

  1. బ్లాగర్లే సభ్యతగా అజ్ఞాతలుగా వ్రాస్తున్నారు. బ్లాగులో ఉన్న ఇమేజ్ కి డామేజ్ కలుగకుండా అజ్ఞాతలుగా వ్రాస్తున్నపుడు వారినుండి సభ్యత ఆశించడం అత్యాశే ! తమ తమ బ్లాగులో అజ్ఞాతలు సభ్యతగా వ్రాయమని శాసించగలిగే అధికారం ఒక్క అగ్రిగ్రేటర్ లకే ఉంది. వారూ ఆ త్రాసులో ముక్కలే, వారూ అజ్ఞాతలుగా వ్రాస్తున్నారు. ఏదయినా తమ దాకా వస్తే గానీ తత్వం బోధపడదు. ముందు అగ్రిగ్రేటర్లను సంస్కరించండి !

    ReplyDelete
  2. అగ్రిగేటర్లు మాత్రం ఎలా దుర్వ్యాఖ్యలను నిరోధించగలరూ? ఎటువంటి వ్యాఖ్యలను అంగీకరించాలీ లేదా నిరోధించాలీ అన్నది బ్లాగర్లే ఆలోచించుకోవాలి.

    ReplyDelete
  3. ఏ బ్లాగులో అయితే దుర్వ్యాఖ్యలు వస్తున్నాయో ఆ బ్లాగును ఆగ్రిగేటర్ నుండి తీసివేయగలరు. ఇది ఒకరకంగా బ్లాక్ చేయడమే !
    ఇంకో పద్ధతి కూడా ఉంది. పరమ చండాలంగా బూతులు వ్రాస్తే ప్రచురించే బ్లాగర్ ని తీసుకొచ్చ్చి బ్లాగ్ సంఘానికి సర్వాధ్యక్షుడిని చేస్తే... ఎటువంటి గొడవలూ బ్లాగ్ లోకంలో రానివ్వకుండా బ్లాగర్ల ను కాపాడడమే కాకుండా కే సీ ఆర్ లాగా బుద్ధిగా పడి ఉంటాడు.

    ReplyDelete
  4. నీహారిక గారి వ్యాఖ్య నా చిట్టిబుఱ్ఱకి అర్ధం కాలేదు. మన్నించాలి.

    ఎవరన్నా నా బ్లాగులో దుర్వ్వ్యాఖ్య్యలు వ్రాస్తే అప్పుడు నా బ్లాగును అగ్రేటర్లు బ్లాక్ చేయాలని ఆవిడ అంటున్నారు. నాకు అర్ధమైనంతలో ఆవిడ ఉద్దేశం యేమిటంటే దుర్వ్వ్యాఖ్య్యలను ప్రచురించిన బ్లాగర్లు శిక్షార్హులే అని. ఇది తప్పకుండా సమర్ధనీయమే.

    దుర్వ్వ్యాఖ్య్యలు వ్రాసే బ్లాగర్లలో అదముణ్ణి తెచ్చి బ్లాగ్ సంఘానికి సర్వాధ్యక్షుడిని చేస్తే ఏం లాంభం? గొడవలు రావంటారు నీహారిక గారు. ఇక బ్లాగులు చదివేవాళ్ళే ఉండక గొడవలెక్కడివి అని ఆవిడ ఉద్దేశం కాబోలును! కానీ ఇక్కడ బ్లాగర్లను అతగాడు రక్షకుడు కావటం ఏమిటో అన్నది అయోమయంగా ఉంది.

    ఇకపోతే కే సీ ఆర్ లాగా బుద్ధిగా పడి ఉంటాడనటం ఏమిటో మరింత గందరగోళంగా ఉంది. నీహారికగారి దృషిలో కే సీ ఆర్ బుధ్ధిమంతుడన్న మాట. కాబోలును. ఇదేదో అధికప్రసంగంలా ఉంది (బహుశః నాదేనేమో! శాంతం పాపమ్‍)

    ReplyDelete
  5. అధములు ఉత్తములు అని విడి విడిగా ఎవరూ ఉండరు. ఉత్తముడు అధముడు కావచ్చు, అధముడు ఉత్తముడు కావచ్చు. చెన్నారెడ్డి గారి హయాములో అధముడు ఎవరు ? ఎన్ టీ ఆర్ హయాములో అధముడు ఎవరు ? కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం లో అధముడు ఎవరు ? కే సీ ఆర్ హయాం లో అధములే రేపు "ఉత్త"ముడై ముఖ్యమంత్రి కావచ్చు కదా ?

    ఇపుడు అధముడినే సర్వాధ్యక్షుడిని చేస్తే ఆయనే ఉత్తముడై బ్లాగర్లను కాపాడుతాడని నా ఉద్దేశ్యం. ఎందుకంటే అధముడెపుడూ తను నడిచి వచ్చిన దారి గుర్తుంచుకుంటాడు కదా ? ఎప్పటికపుడు కొత్త సమస్యలు వస్తుంటాయి కాబట్టి పరిష్కారాలెపుడూ శాశ్వతం కాదు సమస్యలే శాస్వతం ! అందుకే మనకు అంతమంది దేవుళ్ళు పుడుతూనే ఉన్నారు !

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...