బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మీ బ్లాగ్ Off Page : SEO గూర్చి పూర్తిగా తెలుసుకోండి.మీ బ్లాగును టాప్ పొజిషన్లో నిలబెట్టుకోండి.

Get-Your-Blog-Off-Page-Learn-about-SEO
హాయ్ ఫ్రెండ్స్!.. మీ ముందుకు కొత్త ట్రాఫిక్ తో వచ్చేసా! ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనమందరమూ బ్లాగును నడుపుతూ ఉంటాము. నిజానికి మనకి అగ్రిగేటర్స్ ద్వారా తప్ప Google సెర్చింజన్ ద్వారా విజిటర్స్ రావడం బహు తక్కువ. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే మన బ్లాగును SEOకి  అనుగుణంగా తీర్చి దిద్దకపోవడం ఒక కారణమైతే, మన బ్లాగులోని పోస్ట్ ఏవిధంగా పెట్టాలో తెలియక పోవడం మరొక కారణం. ఇంకా ప్రధానమైన సమస్య ఏమిటంటే Off Page : SEO గురించి అసలు తెలుసుకోకపోవడం. అంతర్జాలంలో ఎన్నో కోట్ల బ్లాగులుంటాయి. వాటిని తట్టుకుని మన బ్లాగు తన ఉనికిని చాటుకోవాలంటే మనకి Off Page : SEO గూర్చి తప్పక తెలియాలి. అప్పుడే మనం Google లో మన హవా చాటగలం. లేదంటే మన బ్లాగును మనం చూసుకోవడం తప్ప మరొకరు వీక్షించే అవకాశమే లేకుండా పోతుంది.

ఈరోజు తెలుగు బ్లాగ్ అగ్రిగేడర్ల ఉనికి మాయమవుతూనే ఉంది. కూడలి పోయిన తరువాత కేవలం మాలిక, శోధిని మాత్రమే మిగిలాయి. ఆ తరువాత  బ్లాగ్ వేదిక లాంటి కొన్ని బ్లాగ్ అగ్రిగేడర్లు కొద్దో,గొప్పో పని చేస్తూ ఉన్నాయి. వీటి ద్వారా విజిటర్స్ సంఖ్య పెద్దగా ఏమీ రావడం లేదు. ఇంతకుముందు బ్లాగులో ఒక పోస్ట్ పెడితే కనీసం 250 మంది విజిటర్స్ వచ్చేవారు. ఇప్పుడు 50 మంది విజిటర్స్ రావడమే కష్టంగా మారిపోయింది. సబ్జెక్ట్ ఎంత బాగున్నా విజిటర్స్ సంఖ్య ఏమాత్రం పెరగడం లేదు. నిజానికి అగ్రిగేడర్ల ద్వారా వచ్చే వీక్షకులు పూర్తిగా తగ్గిపోయారు.

Off Page : SEO చేసిన బ్లాగులు మాత్రం google సెర్చింజన్ ద్వారా బాగానే విజిటర్స్ ని సంపాదించుకుంటున్నాయి. ఈ విషయాన్ని పరిశీలించిన తరువాత మన తెలుగు బ్లాగర్స్ కి కూడా Off Page : SEO గూర్చి వివరాలు తెలియజేస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే ఒక బ్లాగర్ తన బ్లాగును కొంతమందైనా విజిట్ చేసి తన పోస్టులు చదివితే అతనికి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి మంచి,మంచి పోస్టులు పెట్టగలుగుతాడు. దాని వలన మనం కొంతవరకైనా తెలుగు బ్లాగుల ఉనికిని కాపాడుకున్న వాళ్ళమవుతాము. ఏమంటారు?

అసలు మనం పోస్టు ఏవిధంగా పెట్టాలి? బ్లాగును SEO ఏవిధంగా చేయాలి? Off Page : SEO అంటే ఏమిటి? ఇత్యాది విషయాలు పూర్తిగా తెలుసుకోవాలి. ముందుగా మనం Off Page : SEO ఎన్ని రూపాలుగా ఉంటుందో తెలుసుకుందాం. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. వివరణ అంతా ఈ బ్లాగులో అందిస్తాను. Codes, Setting Details ఈ Sakshyam Creative అనే బ్లాగులో అందిస్తాను. కాబట్టి మీరందరూ కూడా ఈ బ్లాగును మెయిల్ ద్వారానూ, గూగుల్ ప్లస్ ద్వారానూ ఫాలో కావడానికి Subscribe నన్ను చేసుకుని ప్రోత్సాహించండం మర్చిపోవద్దు.

ఇప్పుడు Off Page : SEO Details కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...