బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Showing posts with label Indian News. Show all posts
Showing posts with label Indian News. Show all posts

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా నెగటివ్ - వారంలోపే కోలుకున్నారంటూ తివారీ ట్వీట్

Central-home-minister-amit-shah-tests-negative-for-covid-19
అమిత్ షా కు కరోనా నెగటివ్ - వారంలోపే కోలుకున్నారంటూ తివారీ ట్వీట్
కరోనా పాజిటివ్ తో హాస్పటల్ లో జాయినయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా మహమ్మారి నుండి  కోలుకున్నారని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు నెగటివ్ వచ్చిందని షా సహచర బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ మనోజ్ తివారీ ఆదివారం ట్విటర్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, షా అభిమానులు కుదుటపడ్డారు. 55ఏళ్ల అమిత్ షా.. జులై 29నాటి కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లందరూ ఐసోలేషన్ లోకి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. షా తర్వాత అర డజను మంది కేంద్ర మంత్రులు కరోనా పాజిటివ్ గా తేలడం గమనార్హం. వారిలో ''భాబీజీ అప్పడాలు తింటే కరోనా రాదంటూ'' ప్రచారం చేసిన అర్జున్ రామ్ మేఘావాల్ కూడా ఉన్నారు. మొత్తానికి వారం రోజుల్లోపే షా కొవిడ్ నుంచి కోలుకోవడం గమనార్హం.


India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

india-surpasses-italy-in-corona-deaths
కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్
భారత దేశంలో కరోనా కేసులు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 35 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా 779 మరణాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఒక్కరోజు 55వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 16.4 లక్షలు దాటాయి. ఇందులో యాక్టివ్ కేసులు 547726 కాగా రికవరీలు 1060000 ఉన్నాయి. మరణాలు 35817గా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు 31 మంది మరణించారు.

కరోనా కేసుల్లో మరణాల్లో భారత్ ఇతర దేశాలను దాటుతోంది. భారత్లో 130 కోట్ల మందికి పైగా ప్రజలు ఉంటారు. ఇతర దేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది. ఆ లెక్కన మన వద్ద మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు మరణాల్లో మన దేశం ఇటలీని దాటేసింది. ఇటలీలో ఇప్పటి వరకు 35132 మంది మృతి చెందగా ఇండియాలో 35817 ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

indian-Central-government-New-educational-policy
కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య
దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దాదాపుగా అన్ని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు దేశంలో అమలు అవుతున్న విద్యా వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేస్తూ జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020) పేరిట రూపొందిన నివేదికకు మోదీ సర్కారు బుధవారం ఆమోద ముద్ర వేసింది. వెరసి మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా అమలు అవుతున్న విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలన్న కీలక విషయంతో పాటు ఆయా తరగతుల నుంచి పై తరగతులకు వెళ్లేందుకు నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని కూడా సమూలంగా మార్చివేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ జాతీయ విద్యా విధానంలో పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేదాకా నిర్బంధ విద్యను కొనసాగించాలని కూడా మోదీ సర్కారు తీర్మానించింది. ఇప్పటిదాకా నిర్బంధ విద్య 14 ఏళ్ల వయసు వరకు మాత్రమే పరిమితం కాగా... దానిని 18 ఏళ్లకు పెంచుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటన్న విషయంలోకి వెళితే...

ISIS seeks to inflict corona on India .. | భారీ కుట్రకు తెర : భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్..

భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్.. 

ISIS seeks to inflict corona on India ..
భారత్ లో కరోనాను అంటించి దెబ్బ తీయాలని చూస్తున్న ఐసిస్
దారుణమైన మైండ్ సెట్ తో ప్రపంచాన్ని వణికించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ దుర్మార్గం మరోసారి బయటకు వచ్చింది. కరోనా కాలంలో విలవిలలాడిపోతున్న తీరును తమకు అవకాశంగా మార్చుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఇందులో భాగంగా భారత ముస్లింలను టార్గెట్ చేసుకుంది. తనకు చెందిన ఆన్ లైన్ పబ్లికేషన్ అయిన వాయిస్ ఆఫ్ హింద్ లో భారత్ మీద తనకున్న కసిని వ్యక్తం చేసింది.

భారత్ ను దెబ్బ తీయటం కోసం ఐసిస్ దుర్మార్గం తాజాగా బయటకు వచ్చింది. భారత్ పై దాడికి కరోనాను ఒక అవకాశంగా మార్చుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కరోనా క్యారియర్లుగా ముస్లింలు మారాలని పిలుపునిచ్చింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో పదిహేడు పేజీల లాక్ డౌన్ స్పెషల్ ఎడిషన్ విడుదల చేసిన సదరు సంస్థ.. నాస్తికుల్ని చంపేయాలని పిలుపునివ్వటం గమనార్హం. భారత్ పై పూర్తిస్థాయిలో దాడి చేయాలని పిలుపునిచ్చింది.

Will India's population decline What is actually going on | భారత జనాభా తగ్గిపోనుందా? అసలేం జరుగుతోంది?

భారత జనాభా తగ్గిపోనుందా? అసలేం జరుగుతోంది?

Will India's population decline What is actually going on
Will India's population decline What is actually going on
2100 సంవత్సరం నాటికి భారత జనాభా 100కోట్లకు పడిపోతుందని.. ఇప్పటితో పోలిస్తే 30-35 కోట్ల మంది వరకు జనాభా తగ్గిపోతుందని ప్రముఖ వైద్య జర్నల్ లాన్సెట్ ఓ నివేదికలో పేర్కొంది.

అయితే ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ నిలుస్తుంది. మన తర్వాత నైజిరియా చైనా అమెరికా పాకిస్తాన్ లు నిలుస్తాయి. ప్రస్తుతం 780 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2100 నాటికి 880కోట్లకు పెరుగుతుందని నివేదికలో పేర్కొంది.

చైనాను భారత్ 2027 కల్లా జనాభాలో దాటేస్తోంది. 2047నాటికి 161 కోట్లకు చేరుతుంది. తగ్గుతున్న గర్భధారణ రేటు వృద్ధుల సంఖ్య పెరగడం.. వివాహాల వయసు పెరగడం.. కుటుంబ నియంత్రణ.. కాన్పుకు కాన్నుకు మధ్య దూరం వంటివి జనాభా తగ్గుదలకు కారణంగా నివేదిక పేర్కొంది.

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

Swiss-bank-accounts-India-at-77th
స్విస్ బ్యాంకుకు సంబంధించి తాజా రిపోర్ట్ వెల్లడైంది. 2019లో భారతీయుల డిపాజిట్లు 6 శాతం తగ్గి రూ.6625 కోట్లకు పరిమితమయ్యాయని స్విస్ బ్యాంకు ప్రకటించింది. భారతీయులు సొమ్ము భద్రపరిచే విధానం 5.8 శాతం పడిపోయినట్లు స్పష్టమైంది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో బ్యాంక్ ఈ వివరాలు తెలిపింది. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరి కల్లా స్విస్ బ్యాంకులో సొమ్ము దాచిపెట్టిన భారతీయ పౌరులు సంస్థల జాబితా ఆధారంగా ఈ కొత్త ర్యాంకులను వెల్లడించారు.

2018లో 74వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 77వ స్థానానికి పడిపోయింది. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా దీనికి సంబంధించిన గణాంకాలను రిలీజ్ చేసింది. స్విస్ బ్యాంకులో డబ్బు దాస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. ఎస్ ఎన్ బీకి చెందిన భారతీయ బ్రాంచిల్లోనూ ఆ సంఖ్య తగ్గినట్లు తేలింది. స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచిపెట్టన సొమ్ములో భారత వాటా కేవలం 0.06 శాతం మాత్రమే ఉన్నట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ తన రిపోర్ట్లో పేర్కొన్నది.

భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !

భారత్ లో వైరస్ విజృంభణ ...యూకేను వెనక్కినెట్టి 4 స్థానంలోకి !

India-Overtook-The-UK-To-Become-The-Fourth-Worst-Hit-Nation
భారత్ లో  మహమ్మారి జోరు చాలా ఉదృతంగా కొనసాగుతోంది. రోజుకు సుమారు 10వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు రికార్డువుతుండడంతో మిగతా దేశాలను భారత్ వేగంగా దాటేస్తోంది.  ప్రపంచంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న బ్రిటన్ను దాటేసింది.  2074397 కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానాల్లో బ్రెజిల్ (787489) - రష్యా (502436) వరుసగా రెండు - మూడో స్థానాల్లో కొనసాగుతున్నాయి.

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 9996 కొత్త  వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 357 మంది మరణించారు. తాజా లెక్కలతో దేశంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 286589కి చేరింది. వీరిలో ఈ  మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 141029 మంది కోలుకోగా.. 8102 మంది మరణించారు. ప్రస్తుతం మనదేశంలో 137448 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

ఏడాది పాలన పై ప్రజలకు మోదీ లేఖ ..!

PM-Narendra-Modi-letter-to-the-people-of-India
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తయ్యింది. 2019 లో జరిగిన  ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు పౌరసత్వ చట్ట సవరణ ఆర్టికల్ 370 రద్దు అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా .. దేశప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు.

నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం


నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం

Nirbhaya-Rape-Case-Convicts-Hanged-to-Death-at-Tihar-Jail
నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం
సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. అత్యంత పాశవికంగా గ్యాంగ్ రేప్ నకు పాల్పడి.. అమానవీయ తీరులో హింసించిన కామ పిశాచాలకు ఎట్టకేలకు తీహార్ జైల్లో ఉరిశిక్షను విధించారు. నేరం జరిగిన 2650 రోజులకు న్యాయం లభించింది. దేశంలోని ప్రతి ఒక్కరు నలుగురు నిర్భయ దోషులకు ఉరిశిక్ష విధించటం తప్పనిసరని భావిస్తున్న వేళ.. న్యాయపరమైన చిక్కుముడులతో తమకు విధించిన శిక్ష అమలు కాకుండా ఉండేందుకు చివరిక్షణాల వరకూ ప్రయత్నిస్తున్నప్పటికీ.. అన్ని అడ్డంకులు.. అవరోధాల్ని అధిగమించి.. ఎట్టకేలకు న్యాయం గెలిచింది. ఈ తెల్లవారుజామున (శుక్రవారం) 5.30 గంటలకు నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేసినట్లుగా తీహార్ జైలు అధికారులు ప్రకటించారు.

తీహార్ జైలు నెంబరు 3లో.. కోర్టు పేర్కొన్నట్లుగా నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీసినట్లుగా జైలు అధికారులు వెల్లడించారు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో మొత్తం పదిహేడు మంది సిబ్బంది అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంలో దోషులైన ముకేశ్ సింగ్ (32).. పవన్ గుప్తా (25).. వినయ్ శర్మ (26).. అక్షయ్ కుమార్ సింగ్ (31) లను తీహార్ జైల్లో ఉరి తీశారు. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఈ ఉరిని పూర్తి చేశారు.

Related Posts Plugin for WordPress, Blogger...