బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

India surpasses Italy in corona deaths | కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్

india-surpasses-italy-in-corona-deaths
కరోనా మరణాల్లో ఇటలీని దాటేసిన భారత్
భారత దేశంలో కరోనా కేసులు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 35 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కాగా 779 మరణాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఒక్కరోజు 55వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 16.4 లక్షలు దాటాయి. ఇందులో యాక్టివ్ కేసులు 547726 కాగా రికవరీలు 1060000 ఉన్నాయి. మరణాలు 35817గా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం వరకు 31 మంది మరణించారు.

కరోనా కేసుల్లో మరణాల్లో భారత్ ఇతర దేశాలను దాటుతోంది. భారత్లో 130 కోట్ల మందికి పైగా ప్రజలు ఉంటారు. ఇతర దేశాల్లో తక్కువ జనాభా ఉంటుంది. ఆ లెక్కన మన వద్ద మరణాల రేటు తక్కువగా ఉన్నప్పటికీ రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఈ రోజు మరణాల్లో మన దేశం ఇటలీని దాటేసింది. ఇటలీలో ఇప్పటి వరకు 35132 మంది మృతి చెందగా ఇండియాలో 35817 ఉన్నాయి.అగ్రరాజ్యం అమెరికాలో 4635226 కేసులు 155306 మరణాలు చోటు చేసుకున్నాయి. కేసుల్లో 2613789తో బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా భారత్ మూడో స్థానంలో ఉంది. మరణాల్లో అమెరికా బ్రెజిల్ (91377) మెక్సికో (46000) యూకే (45999) ఫ్రాన్స్ (30254) స్పెయిన్ (28443) ఉన్నాయి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...