బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య

indian-Central-government-New-educational-policy
కేంద్ర ప్రభుత్వం సంచలనం... 18 ఏళ్ల వరకు నిర్బంధ విద్య
దేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ దాదాపుగా అన్ని వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు దేశంలో అమలు అవుతున్న విద్యా వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేస్తూ జాతీయ విద్యా విధానం (నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020) పేరిట రూపొందిన నివేదికకు మోదీ సర్కారు బుధవారం ఆమోద ముద్ర వేసింది. వెరసి మొత్తంగా దేశంలో ఇప్పటిదాకా అమలు అవుతున్న విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రాథమిక విద్యను మాతృభాషలోనే బోధించాలన్న కీలక విషయంతో పాటు ఆయా తరగతుల నుంచి పై తరగతులకు వెళ్లేందుకు నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని కూడా సమూలంగా మార్చివేసింది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ జాతీయ విద్యా విధానంలో పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చేదాకా నిర్బంధ విద్యను కొనసాగించాలని కూడా మోదీ సర్కారు తీర్మానించింది. ఇప్పటిదాకా నిర్బంధ విద్య 14 ఏళ్ల వయసు వరకు మాత్రమే పరిమితం కాగా... దానిని 18 ఏళ్లకు పెంచుతూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఇక నూతన జాతీయ విద్యా విధానంలో ఉన్న ప్రధాన అంశాలు ఏమిటన్న విషయంలోకి వెళితే...



- నిర్బంధ విద్యను 14 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు పెంచారు
- ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిగా మాతృభాషలో గానీ ఆయా ప్రాంతాలకు చెందిన ప్రాంతీయ భాషలో గానీ కొనసాగించాలి
- యాంత్రికంగా పాఠాలను చదువుకునే పద్ధతికి ముగింపు పలకడం. ప్రాక్టికల్ విద్యా విధానానికి పెద్ద పీట వేస్తారు
- ఎంఫిల్ కోర్సులు ఇకపై కొనసాగవు. వాటిని పూర్తిగా తొలగించేసినట్టే
- న్యాయ వైద్య కళాశాలలు మినహా మిగిలిన అన్ని ఉన్నత విద్యాసంస్థలను ఒకే రెగ్యులేటర్ కిందకు తీసుకువస్తారు
- యూనివర్శిటీలు ఇతర ఉన్నత విద్యాసంస్థలకు నూతన విద్యా విధానం ప్రకారం కామన్ ఎంట్రెస్ పరీక్షలను నిర్వహిస్తారు
- పాఠశాల పాఠ్యాంశాలను ప్రాధాన్యతా స్థాయికి తీసుకురావడం. 6వ తరగతి నుంచి వొకేషనల్ విద్యతో అనుసంధానం చేస్తారు
- 2035 నాటికి హైస్కూల్ విద్యార్థుల్లో 50 శాతం మందికి ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చేలా చేస్తారు
- జీడీపీలో 6 శాతాన్ని విద్యకు కేటాయించాలని కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం జీడీపీలో 4 శాతాన్ని మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు
- విద్యా సంస్థల ఫీజులకు ఒక పరిమితిని విధించడం
- 2030 నాటికి ప్రాథమిక పాఠశాలల నుంచి సెకండరీ లెవెల్ స్కూళ్ల వరకు 100 శాతం స్థూల నమోదు నిష్పత్తి ఉండేలా లక్ష్యాన్ని నిర్దేశం
- రిపోర్ట్ కార్డుల్లో మార్కులతో పాటు విద్యార్థుల నైపుణ్యాలు సామర్థ్యాలను పేర్కొనాల్సిందే
- ఇకపై కేంద్రం స్థాయిలో విద్యా సంబంధిత వ్యవహారాలను పర్యవేక్షించే మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును కేంద్ర విద్యా శాఖగా పిలుస్తారు

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...