బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చైనాకు మరో షాక్: మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న భారత్

చైనాకు మరో షాక్: మరో సంచలన నిర్ణయం తీసుకోనున్న భారత్

Another-shock-for-China--India-to-make-another-sensational-decision
సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితికి కారణమైన చైనాపై సాధారణ ప్రజలతోపాటు భారత ప్రభుత్వానికి తీవ్ర ఆగ్రహం ఉంది. డ్రాగన్ దేశానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని భారత్ భావిస్తోంది. ఈ క్రమంలోనే చైనా ఆర్థిక వ్యవహారాలను దెబ్బ తీసేలా భారత్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే చైనా వస్తువులు.. ఉత్పత్తులు.. సేవలు బహిష్కరించాలని ఉద్యమం వస్తోంది. దీనిలో భాగంగా తాజాగా 59 చైనా యాప్ లపై నిషేధం విధించి షాకిచ్చిన భారత్ ఇప్పుడు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది. కీలక దిగుమతులను అడ్డుకునే దిశగా భారత్ సమాలోచనలు చేస్తోంది. అదే జరిగితే మాత్రం చైనాకు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఆ దేశ ఉత్పత్తి సంస్ధలు భారీగా నష్టపోనున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే అత్యున్నత స్ధాయిలో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేస్తోంది.

గల్వాన్ లోయలో భారత సైనికులపై దాడి తర్వాత చైనాపై భారత వైఖరి పూర్తిగా మారిపోయింది. కీలకమైన చైనా ఉత్పత్తులను ఒక్కొక్కటిగా నిషేధిస్తూ రావాలని భావిస్తున్న కేంద్రం... తొలి విడతగా 59 పాపులర్ మొబైల్ యాప్ లను నిషేధించింది. దీనిపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయినా భారత్ వెనకడుగు వేయడం లేదు. తదుపరి చర్యపై కేంద్రం దృష్టి సారించింది.
ప్రస్తుతం దేశంలో వాడుకలో ఉన్న 4జీ టెక్నాలజీ స్ధానంలో 5జీ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చేలా ఉంది. దీనికి వీలుగా చైనాకు చెందిన 5జీ పరికరాల దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిణామాలతో వైఖరి మారింది. త్వరలో 5జీ పరికరాల దిగుమతులకు చెక్ పెట్టనుంది. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు కేంద్రమంత్రులు అధికారులతో ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. కమిటీ సూచనల ఆధారంగా వచ్చే సోమవారం కేంద్రం 5జీ పరికరాల దిగుమతిపై కీలక నిర్ణయం ప్రకటించబోతోందని తెలుస్తోంది.

5జీ స్పెక్ట్రమ్ వేలం వాస్తవంగా మార్చిలో జరగాల్సి ఉంది. వైరస్ వ్యాప్తితో అది వాయిదా పడింది. ఈ వేలం జరిగితే స్పెక్ట్రమ్ కొనుగోలు చేసిన ప్రైవేటు ఆపరేటర్లు చైనా నుంచి 5జీ పరికరాలు దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంది. ఆ పరికరాలను చైనాకు చెందిన హువాయ్ సంస్థ వాటిని సరఫరా చేస్తోంది. ఆ హువాయ్ సంస్థకు చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయి. ఇది తెలిసి గతంలో అమెరికా అధ్యక్షుడు డొనల్డ్ ట్రంప్ ఆ సంస్థను నిషేధం విధించారు. ఇప్పుడు భారత్ కూడా ఆ సంస్థను నిషేధించేలా పరిణామాలు ఉన్నాయి. ఇప్పుడు భారత్ చైనా 5జీ పరికరాలపై నిషేధం విధిస్తే దాని ప్రభావం హువాయ్ తో పాటు పలు ఎలక్ట్రానికి సంస్థలపై తీవ్రంగా పడనుంది. ఇదే గనుక జరిగితే భారీ దెబ్బ చైనాకు తగలనుంది.

అయితే చైనాను లక్ష్యంగా చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంటే 5జీ స్పెక్ట్రమ్ వేలం తర్వాత చైనా పరికరాల దిగుమతి కోసం ఎదురుచూస్తున్న దేశీయ మొబైల్ ఆపరేటర్లకు కూడా కేంద్రం నిర్ణయం ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. ఈ పరిణామం దేశీయ టెలీ కమ్యూనికేషన్ రంగంలో పెను మార్పులు రానున్నాయి. కేంద్రం చైనాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే దేశీయంగా భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. నిషేధం మాత్రం ఖాయమే అన్నట్లుగా సంకేతాలు ఇస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...