బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

స్విస్ బ్యాంక్ ఖాతాలు...77వ స్థానంలో ఇండియా!

Swiss-bank-accounts-India-at-77th
స్విస్ బ్యాంకుకు సంబంధించి తాజా రిపోర్ట్ వెల్లడైంది. 2019లో భారతీయుల డిపాజిట్లు 6 శాతం తగ్గి రూ.6625 కోట్లకు పరిమితమయ్యాయని స్విస్ బ్యాంకు ప్రకటించింది. భారతీయులు సొమ్ము భద్రపరిచే విధానం 5.8 శాతం పడిపోయినట్లు స్పష్టమైంది. గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో బ్యాంక్ ఈ వివరాలు తెలిపింది. ఆ బ్యాంకులో ఖాతాలు ఉన్న దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. గత ఏడాది చివరి కల్లా స్విస్ బ్యాంకులో సొమ్ము దాచిపెట్టిన భారతీయ పౌరులు సంస్థల జాబితా ఆధారంగా ఈ కొత్త ర్యాంకులను వెల్లడించారు.

2018లో 74వ స్థానంలో ఉన్న భారత్.. ఇప్పుడు 77వ స్థానానికి పడిపోయింది. స్విస్ నేషనల్ బ్యాంక్ తాజాగా దీనికి సంబంధించిన గణాంకాలను రిలీజ్ చేసింది. స్విస్ బ్యాంకులో డబ్బు దాస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పడిపోతున్నది. ఎస్ ఎన్ బీకి చెందిన భారతీయ బ్రాంచిల్లోనూ ఆ సంఖ్య తగ్గినట్లు తేలింది. స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచిపెట్టన సొమ్ములో భారత వాటా కేవలం 0.06 శాతం మాత్రమే ఉన్నట్లు స్విస్ నేషనల్ బ్యాంక్ తన రిపోర్ట్లో పేర్కొన్నది.
ఇక అత్యధిక స్థాయిలో సొమ్ము దాచిన దేశాల్లో బ్రిటన్ మొదటిస్థానంలో ఉన్నది. స్విస్ విదేశీ ఫండ్లో బ్రిటన్ వాటా 27 శాతం ఉన్నట్లు తేలింది. భారత్తో పాటు పాకిస్థాన్ బంగ్లాదేశ్కు చెందిన నగదు నిల్వలు తగ్గగా.. అమెరికా బ్రిటన్ వాటా పెరిగినట్లు స్విస్ బ్యాంకు వెల్లడించింది. స్విస్ బ్యాంక్ లో భారతీయుల డిపాజిట్లు 2007లోనే రూ. 9 వేల కోట్లకు చేరుకున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశాల నుంచి నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని పేర్కొనడంతో స్విస్ బ్యాంక్ లో నగదు నిల్వలు భారీగా పడిపోయాయి. ఒక్క 2017 సంవత్సరంలోనే 44 శాతం తగ్గాయి. 2018లో 11 శాతం తగ్గాయి. వరుసగా మూడో ఏడాది కూడా తగ్గుదల కనిపించింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...