బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
Showing posts with label Political news. Show all posts
Showing posts with label Political news. Show all posts

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు కరోనా నెగటివ్ - వారంలోపే కోలుకున్నారంటూ తివారీ ట్వీట్

Central-home-minister-amit-shah-tests-negative-for-covid-19
అమిత్ షా కు కరోనా నెగటివ్ - వారంలోపే కోలుకున్నారంటూ తివారీ ట్వీట్
కరోనా పాజిటివ్ తో హాస్పటల్ లో జాయినయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా మహమ్మారి నుండి  కోలుకున్నారని, తాజాగా నిర్వహించిన టెస్టుల్లో ఆయనకు నెగటివ్ వచ్చిందని షా సహచర బీజేపీ ఎంపీ, ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ మనోజ్ తివారీ ఆదివారం ట్విటర్ లో ఈ సమాచారాన్ని షేర్ చేశారు. దీంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు, షా అభిమానులు కుదుటపడ్డారు. 55ఏళ్ల అమిత్ షా.. జులై 29నాటి కేంద్ర కేబినెట్ భేటీ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. కరోనా లక్షణాలతో ఈనెల 2న గుర్గావ్ లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. తనతో కాంటాక్ట్ అయినవాళ్లందరూ ఐసోలేషన్ లోకి వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన సూచించారు. షా తర్వాత అర డజను మంది కేంద్ర మంత్రులు కరోనా పాజిటివ్ గా తేలడం గమనార్హం. వారిలో ''భాబీజీ అప్పడాలు తింటే కరోనా రాదంటూ'' ప్రచారం చేసిన అర్జున్ రామ్ మేఘావాల్ కూడా ఉన్నారు. మొత్తానికి వారం రోజుల్లోపే షా కొవిడ్ నుంచి కోలుకోవడం గమనార్హం.


ఏడాది పాలన పై ప్రజలకు మోదీ లేఖ ..!

PM-Narendra-Modi-letter-to-the-people-of-India
కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చి శనివారానికి ఏడాది పూర్తయ్యింది. 2019 లో జరిగిన  ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి కేంద్రంలో మరోసారి పాగ వేసింది. దేశంలోని ప్రతి పౌరుడి కలను సాకారం చేస్తూ భారత్ స్థాయిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ ప్రపంచ నాయకుడిగా మోదీ కీర్తి గడించారు. ఈ ఏడాది కాలంలో ఎన్నో సమస్యాత్మక అంశాలను సులువు చేసి అనేక విజయాలను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లు పౌరసత్వ చట్ట సవరణ ఆర్టికల్ 370 రద్దు అయోద్య వివాదం వంటి వాటికి శాశ్వత పరిష్కారం చూపించారు. రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయిన సందర్భంగా .. దేశప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రధాని మోదీ ఒక లేఖ రాశారు.

ఢిల్లీలో 31 దాకా థియేటర్లు క్లోజ్ పరీక్షలు బంద్ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్

ఢిల్లీలో 31 దాకా థియేటర్లు క్లోజ్ పరీక్షలు బంద్ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్

India-Capital-Delhi-Shuts-Schools--Colleges--Cinema-Halls-To-Counter-Corona-virus
ఢిల్లీలో 31 దాకా థియేటర్లు క్లోజ్ పరీక్షలు బంద్ ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్
చైనాలోని వూహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 4638 మంది మృత్యువాత పడ్డారు. 126258 మందికి వ్యాప్తించింది. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) బుధవారం మహమ్మారీగా ప్రకటించింది. అప్పటికే ఈ వైరస్ కారణంగా కుదేలైన మార్కెట్లు WHO ప్రకటనతో కుప్పకూలాయి. భారత్ అమెరికా జపాన్ సౌత్ కొరియా.. అన్ని దేశాల మార్కెట్లు పాతాళంలోకి జారాయి. దలాల్ స్ట్రీట్లో సెన్సెక్స్ ఏకంగా దాదాపు 3వేలు పతనమైంది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నాయి. ఢిల్లీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు కాలేజీల్లో మార్చి 31వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించరాదని నిర్ణయించింది. సినిమా హాల్స్ను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధానంగా జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ఆదేశాలిచ్చింది. భారత్లో కరోనా కేసులు 73కు చేరుకున్నాయి.

Nirbhaya Accused Abuse Judicial Process | దేశ న్యాయ వ్యవస్థపై నిర్భయ నిందితుల అత్యాచారం

Nirbhaya Accused Abuse Judicial Process | దేశ న్యాయ వ్యవస్థపై నిర్భయ నిందితుల అత్యాచారం
నిర్భయ కేసు TV సీరియల్ మాదిరి సాగుతూనే ఉంది. అన్ని ఆధారాలు కూడా ఉండి వాళ్ళను ఉరి తీయాల్సిన కోర్టులు ఎందుకు కాలయాపన చేస్తున్నాయో అర్ధం కావడం లేదు. వీళ్ళ వెనుకుండీ కాపాడుతున్న ఆ ప్రభుద్ధులు ఎవరో? ఒక ఆడపిల్లను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన ఈ నరరూప రాక్షసుల తరపున వాదిస్తున్న న్యాయవాదులు అసలు మనుషులేనా? అనిపిస్తోంది.

బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా

Panchayat-elections-in-Andhra-Pradesh
బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా

బ్రేకింగ్ : ఏపీలో మోగిన ఎన్నికల నగారా

ఏపీలో ఎండలతో పాటు ఎన్నికల వేడి కూడా రాజుకుంటోంది. ఎన్నో రోజులుగా వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడింది. ఈ మార్చి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

మార్చి లోనే ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల సంఘానికి ప్రతిపాదనలు సైతం పంపించింది. మార్చి 7న ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 21న వీటి ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఇక పట్టణాల్లోనూ ఎన్నికల సందడి ఒకేసారి రాబోతోంది. మార్చి 10న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. మార్చి 24న ఎన్నికలు నిర్వహిస్తారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెక్ట్స్ టార్గెట్ అదే..క్లూ ఇచ్చిన కేంద్ర మంత్రి!

Modi-Target-After-CAA--Centre-might-bring-population-control-law-Says-Niranjan-Jyoti
ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెక్ట్స్ టార్గెట్ అదే..క్లూ ఇచ్చిన కేంద్ర మంత్రి!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నెక్ట్స్ టార్గెట్ అదే..క్లూ ఇచ్చిన కేంద్ర మంత్రి!

ఒకవైపు సంచలన నిర్ణయాలు.. రకరకాల వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నిర్ణయాలను అమలు చేస్తూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. సీఏఏ విషయానికే వస్తే పెద్ద రాద్ధాంతం జరుగుతూ ఉంది. ఢిల్లీలో అల్లర్లను పార్లమెంట్ లో ప్రస్తావిస్తూ ఉన్నాయి ప్రతిపక్షాలు. ఇక ఆర్టికల్ 370 రద్దు అంశం గురించి కోర్టులో విచారణ సాగుతూ ఉంది. ఇలాంటి రచ్చలు కొనసాగుతూ ఉండగానే.. మరో అంశం మీద మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇది జనాభా నియంత్రణ విషయంలో!

ఈ మేరకు కేంద్ర సహాయ మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి మాట్లాడుతూ.. మోడీ నెక్ట్స్ టార్గెట్ అదే క్లూ ఇచ్చారు! దేశంలో జనాభా నియంత్రణ చట్టం రాబోతోందని ఆమె వ్యాఖ్యానించారు. ఇదే గనుక వస్తే  పెను సంచలనం అవుతుంది.

నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత.. ఇక ఉరే!

Delhi-Court-Refuses-To-Put-On-Hold-Nirbhaya-Convicts-Execution-Tomorrow
నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత.. ఇక ఉరే!

నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత..ఇక ఉరే!

దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచార కేసులో నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలు ఆలస్యమవుతోంది. ఈ శిక్ష అమలులో రోజుకో పరిణామా చోటుచేసుకుంటూ ఉత్కంఠ నెలకొంది. చట్టంలో ఉన్న లొసుగులను వినియోగించుకుంటూ నిందితులు కేసును సాగదీస్తున్నారు. దీంతో వారికి విధించిన ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిర్భయ హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు  సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు..

A-daughter-who-killed-a-surviving-mother-for-insurance-bills
భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు..

భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు..

ఈ ప్రపంచంలో తల్లి బిడ్డల ప్రేమకి మరొకటి సాటిరాదు లేదు. కానీ ప్రస్తుత రోజుల్లో డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులకి కొడుకు అన్నం కూడా పెట్టడం లేదు ..భార్య వచ్చిన తరువాత కని పెంచిన తల్లిదండ్రులు కూడా బరువైపోతున్నారు అని కంటే కూతుర్నే కనాలి అంటూ పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు. నేటి రోజుల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది ..ఏమిటంటే ..కొడుకు అయితే తల్లితండులకి కూడు పెట్టడు అదే కూతురు అయితే తల్లిదండ్రులని కంటికిరెప్పలా చూసుకుంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయని భావిస్తున్నారు. కానీ తాజాగా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే కూతురు కంటే కొడుకే నయం అని అంటారేమో...

తండ్రి చనిపోయాడు అనే భాద లేకుండా తల్లికి వచ్చే చంద్రన్న భీమని కాజేయాలని బతికున్న తల్లి చనిపోయిందని రికార్డులు సృష్టించింది. ఈ నిర్వాకానికి చంద్రన్న భీమా సిబ్బంది కూడా సహకారం అందించడం గమనార్హం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట లో జరిగింది.

బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

Telangana-Hyderabad-As-Beggar-Free-City---It-is-Possible
బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

భారతదేశం ...ప్రపంచపటంలో మన ఈ దేశానికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు ప్రపంచం మొత్తం దాసోహం అంటుంది. కానీ దేశంలో కటిక పేదరికంలో బ్రతికేవారు కూడా లక్షల్లో ఉన్నారు. అన్నపూర్ణగా పిలిచే దేశంలో పట్టెడు అన్నం కోసం దేహి అంటూ యాచించే వారు చాలామంది ఉన్నారు. రోజురోజుకి ఇలాంటివారు దేశంలో పెరిగిపోతున్నారు. దీనితో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఏ కూడలి వద్ద చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇక ఈ యాచన వృత్తికి స్వస్తి చెప్పి వారికి ఏదో ఒక రకంగా పునరావాసం ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది . ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ అమలుకు హైదరాబాద్ ను ఎంచుకుంది కేంద్రం. హైదరాబాద్ లో రద్దీగా ఉండే సిగ్నల్స్ వద్ద దేవాలయాల వద్ద ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద విపరీతంగా యాచకులు కనిపిస్తుంటారు. హైదరాబాద్ ను యాచక రహిత నగరంగా (బెగ్గర్ ఫ్రీ సిటీ గా) మార్చాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం మొదటగా హైదరాబాద్ నుంచి ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే ..బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేలా జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకుగాను బిక్షగాళ్ల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఏడు అంశాలను తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.

పౌరసత్వం నిరూపించుకోండి..127 మంది హైదరాబాదీలకు నోటీసులు !

Indian-Aadhaar-Company-shock-to-127-Hyderabadis

పౌరసత్వం నిరూపించుకోండి ....127 మంది హైదరాబాదీలకు నోటీసులు !

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పై ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ చట్టాన్ని దేశంలోని ముస్లిములు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం మాత్రం ఈ నిర్ణయం పై వెనక్కి తగ్గే ప్రసక్తి లేనేలేదు అని తేల్చిచెప్పింది. ఈ తరుణంలో హైదరాబాద్ లో మీ పౌరసత్వం నిరూపించుకోండి అంటూ 127 మందికి ఆధార్ సంస్థ నోటీసులు జారీచేసింది. అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఫిబ్రవరి 20లోగా విచారణకు రావాలని ఆదేశించింది. సరైన పత్రాలు సమర్పించకపోయినా భారత పౌరులమని నిరూపించుకోకపోయినా వారి ఆధార్ కార్డులను రద్దు చేస్తామని హెచ్చరించింది.

బీజేపీతో పొత్తులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లెక్క తప్పింది?

Janasena-Leader-Pawan-kalyan-Misses-Clarity-on-about-Alliance-With-BJP-Party

బీజేపీతో పొత్తులో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లెక్క తప్పింది?

నాక్కొంచెం తిక్కుంది....కానీ దానికో లెక్కుంది....గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ చెప్పిన ఈ డైలాగ్ చాలా పాపులర్ అయింది. అయితే సినిమాల్లో  పవన్ కల్యాణ్ లెక్క పక్కాగా ఉన్నా.....రాజకీయాల్లో మాత్రం ఆ లెక్క తప్పిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని 2014లో చెప్పిన పవన్ కల్యాణ్....అధికారంలో ఉన్న టీడీపీతో పొత్తుపెట్టుకొని ప్రశ్నించడం మానేయడంతో మొదటి సారి లెక్క తప్పారు. 2019లో ఒంటరి పోరాటం చేసి కుమారస్వామి తరహాలో సీఎం అయిపోదామనుకొని రెండో సారి లెక్కల్లో ఫెయిల్ అయ్యారు. ఇక తాజాగా 2020లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఏపీ రాజకీయాల్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడదామనుకొని ముచ్చటగా మూడోసారి లెక్క తప్పారు. బీజేపీతో జనసేన పొత్తు పూర్తిగా పొడవక ముందే....ఎన్డీఏలో వైసీపీ చేరడం దాదాపుగా ఖాయమవడంతో పవన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కేబినెట్లో చేరితే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి?

What-Is-The-Situation-Of-Janasena-Leader-Pawan-Kalyan-If-That-Happened

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిజెపి కేబినెట్లో చేరితే పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటి?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కేబినెట్లో చేరుతుందనే ఊహాగానాలు పవన్ కల్యాణ్ వీరాభిమానులను ఉక్కిరిబిక్కరి చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ వాళ్లు జగన్ ను పిలిచి మరీ పదవులు ఇస్తే అప్పుడు పవన్ కల్యాణ్ పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారుతూ ఉంది. ఇటీవలే పవన్ కల్యాణ్ వెళ్లి బీజేపీకి దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పవనే చాలా ఆసక్తిగా ఢిల్లీకి వెళ్లారు. ఒకటికి రెండు సార్లు ఢిల్లీ పర్యటన చేశారు. అయితే కనీసం అమిత్ షాను కానీ మోడీని కానీ కలవలేకపోయారు. చివరకు ఏదో నిర్మలా సీతారామన్ ను కలిసి చేతులుదులుపుకున్నారు పవన్. అంతటితో తనే వీర హిందుత్వవాదిగా మారిపోయారు పీకే. అంత వరకూ కమ్యూనిస్టులతో దోస్తీ చేసి ఎన్నికల సమయంలో బీజేపీని విమర్శించి.. పీకే చివరకు బీజేపీ సన్నిహితుడు అయిపోయాడు.

నిర్భయ దోషులకు శిక్ష విధించేదెప్పుడు?

నిర్భయ దోషులకు శిక్ష విధించేదెప్పుడు?

when-is-punishment-for-fearless-guilty
        
కన్నకూతురు క్రూరమృగాల పట్ల చిక్కుకుపోయిన లేడిపిల్లలా మానవమృగాలకు బలయిపోయిందన్న వార్త ఆ తల్లిదండ్రులు ఎలా భరించారో ఊహిస్తేనే భయమేస్తుంది.

నిర్భయ ఉదంతం దేశమంతా అట్టుడుకిపోయేలా చేసింది. ఆ మానవమృగాలను ఉరి తీసేసి దేశానికి పట్టిన దరిద్రాన్ని ఈచట్టాలు వదిలించడం మాని ఎందుకు జాప్యం చేస్తున్నాయో అర్ధం కావడం లేదు.

ఒక ఆడబిడ్డను అతి కిరాతకంగా హింసించి.. పైశాచికంగా రేప్ చేసి చంపేసిన ఈ దుర్మార్గులను లొసుగులతో ఉన్న చట్టాలే ఏమీ చేయలేనప్పుడు రాజకీయ నాయకులు, బడాబాబుల యొక్క చీకటి బాగోతాలు, ఆర్ధిక నేరాలు పట్టుకుని ఈ చట్టాలు ఏమి చేయగలవు?

మన దేశ నేరస్తులకు గరుడపురాణమే న్యాయం చేస్తుంది. చచ్చిన తరువాత చేసిన పాపాలకు శిక్ష అనుభవించాలని గరుడపురాణం చెప్తుంది కాబట్టి మనకి కరెక్ట్ చట్టాలు ఆ భగవంతుడి సన్నిధిలో జరిగేవే తప్ప మన చట్టాలు ఏమీ చేయలేవు.

దిశను అత్యాచారం చేసి చంపేసిన నిందుతులను ఎంకౌంటర్ పేరుతో కాల్చి పడేసినప్పుడు అడ్డు రాని చట్టాలు నిర్భయ దొషులను ఉరి తీయడంలో ఎలా అడ్డొస్తున్నాయో ఒకసారి విజ్ఞులు ఆలోచించాలి. లొసుగులు, బొక్కలు లేని చట్టాలు రూపొందించుకోవాలి.

దయచేసి నిర్భయ తల్లిదండ్రుల మానసిక క్షోభను అర్ధం చేసుకుని ఆ దుర్మార్గులను ఉరి తీసి.. ఆ అమాయక తల్లిదండ్రులకు కొద్దిగానైనా మనస్సుకు నెమ్మది కలిగించమని కోర్టులను,ప్రభుత్వాలను వేడుకుంటున్నాను

నిర్భయ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది

Dilhi-Nirbhaya-mother-breaks-down-in-court
నిర్భయ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది

నిర్భయ తల్లి కంటతడి అక్కడున్నోళ్ల గుండె మండేలా చేసింది

కదులుతున్న బస్సులో ఏ పాపం తెలీని ఒక నిస్సహాయ ఆడపిల్లను అత్యంత దారుణంగా.. పైశాచికంగా.. మాటల్లో వర్ణించలేనంతగా మానసికంగా.. శారీరకంగా హింసించి.. ఆమె మరణానికి కారణమైన వారికి విధించిన ఉరిశిక్ష అంతకంతకూ వాయిదాలు పడుతున్న వైనంపై దేశ ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నేరం రుజువై.. వారు తప్పు చేసినట్లు పలు కోర్టులు తీర్పులు చెప్పేసిన తర్వాత.. శిక్ష అమలు కాకుండా అడ్డుకునేందుకు న్యాయశాస్త్రంలో తమకున్న అవకాశాల్ని వాడుతున్న నిర్భయ దోషుల తీరుపై బాధితురాలి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఉరిశిక్ష అమలు కాకుండా ఉండేందుకు ఒకటి తర్వాత ఒకటి చొప్పున వ్యూహాత్మకం తెర మీదకు తీసుకొచ్చి శిక్ష అమలు కాకుండా చేస్తున్నారు. దీంతో.. నిర్భయ దోషుల ఉరి ఆలస్యం కావటమే కాదు.. అసలు అమలు చేస్తారా? లేదా? అన్నది అనుమానంగా మారింది. ఇదిలా ఉంటే.. దోషులకు డెత్ వారెంట్లు ఇష్యూ చేయాలని కోరుతూ నిర్భయ తల్లిదండ్రులు మంగళవారం పాటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్... సీఎంగా కేటీఆర్

Telanagana-CM-KCR-as-a-member-of-the-Rajya-Sabha-Ktr-As-Cm

రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్... సీఎంగా కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు... తన కేబినెట్ లో ఓ కీలమ మంత్రిగానే కాకుండా పార్టీలో తన తర్వాతి స్థానంలో పార్టీ కార్యాధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును సీఎంగా చేసే కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఈక్వేషన్ కుదరక కేసీఆరే వాయిదా వేస్తున్నారో లేదంటే... అసలు అలాంటి ఈక్వేషన్లే లేవో తెలియదు గానీ... ఎప్పటికప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ అలా వార్తలు రావడం కొన్నాళ్ల పాటు చక్కర్లు కొట్టడం మళ్లీ చప్పున చల్లారి పోవడం జరుగుతోంది. మొన్నటి మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ దక్కిన తర్వాత కేటీఆర్ పట్లాభిషేకం ఇక తథ్యమేనని అంతా అనుకున్నారు. అయితే ఈ దఫా కూడా ఆ వార్తలన్నీ చప్పున చల్లారి పోయాయి. ఈ క్రమం లో ఇప్పుడు ఓ కొత్త ఈక్వేషన్ తెర మీదకు వచ్చింది. అదేమిటో చూద్దాం పదండి.

చట్టంతో ఆటాడుకుంటున్న నిర్భయ హంతకులు!

చట్టంతో ఆటాడుకుంటున్న నిర్భయ హంతకులు!

జరిగి సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా ఒళ్ళు జలదరించే అత్యంత పాశవికంగా కిరాతకంగా ఒక యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన.. వ్యక్తులకు తీవ్రమైన శిక్ష అయితే పడింది. ఇప్పుడు కాదు.. కొన్నేళ్ల కిందటే వాళ్లకు ఉరి శిక్ష ఖరారు అయ్యింది. అయితే ఇన్నాళూ ఆ శిక్ష అమలు గురించి అధికారులు ముందుకు వెళ్లలేదు. అయితే దిశపై అత్యాచారం నేపథ్యంలో.. నిర్భయ హంతకులు ఏమయ్యారంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ శిక్ష అమలుకు ఫైళ్లు కదిలాయి. ఇక ఇదే సమయంలో.. నిర్భయ హంతకులు చట్టంతో ఆటలు మొదలుపెట్టారు.

These are the new districts of Andhra Pradesh! | ఆంధ్రాలో ఏర్పడే కొత్త జిల్లాలు ఇవే!

these-are-new-districts-of-andhra-pradesh

These are the new districts of Andhra Pradesh! | ఆంధ్రాలో ఏర్పడే కొత్త జిల్లాలు ఇవే!

ఏపీలో ఉన్నఫలంగా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి వర్గం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడు మెడికల్ కాలేజీలకు అనుగుణంగా కొత్త జిల్లాల  ఏర్పాటు జరగబోతూ ఉంది. ఇప్పటి వరకూ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి భారీ రాయితీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే అరకు కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

మండలి రద్దు ఖాయం..కేంద్రం గ్రీన్ సిగ్నల్ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు

BJP-Leader-GVL-Narasimha-Rao-On-About-Council-Abolishment

మండలి రద్దు ఖాయం..కేంద్రం గ్రీన్ సిగ్నల్ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ శాసనమండలిపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లు కి అడ్డుపడుతుందన్న కోపంతో ఏకంగా సీఎం జగన్ మండలిని పీకేయడానికి నిర్ణయం తీసుకోని - అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరిచి ..మండలి రద్దు పై అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ ...ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు - అధికారంలో ఉన్న ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మండలిలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తుంటే ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు అంటూ మండలి రద్దుని తెరపైకి తీసుకొచ్చారు.

సీఏఏ దేశానికి మంచిది కాదు.. అది వందకు వందశాతం తప్పుడు నిర్ణయం : కేసీఆర్

Telangana-CM-KCR-Comments-on-Narendra-Modi-Blog-vedika

సీఏఏ దేశానికి మంచిది కాదు.. అది వందకు వందశాతం తప్పుడు నిర్ణయం : కేసీఆర్

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిపాదించిన పౌర సవరణ చట్టం (సీఏఏ) పై టీఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిజంగానే సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీకి భారీ స్ట్రోక్ ఇచ్చేసిన కేసీఆర్... సీఏఏ దేశానికి మంచిది కాదని అది వందకు వందశాతం తప్పుడు నిర్ణయమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కారణంగానే సీఏఏను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని కేసీఆర్ తేల్చి పారేశారు. అంతటితో ఆగని కేసీఆర్... సీఏఏపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు. సీఏఏపై రాబోయే నెల రోజుల్లో  ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులతో హైదరాబాద్లో ఒక సమావేశం  నిర్వహిస్తామని వెల్లడించారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ పార్టీ భారీ విజయం సాధించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Did Prime Minister Narendra Modi's regime really benefit the country? | ప్రధాని నరేంద్ర మోడీ పాలన నిజంగా దేశానికి మేలు చేసిందా?

Did Prime Minister Narendra Modi's regime really benefit the country? | ప్రధాని నరేంద్ర మోడీ పాలన నిజంగా దేశానికి మేలు చేసిందా?
ఒక మిత్రుడు పంపిన Facebook లింక్ ద్వారా ఈక్రింది పోస్టు వేశాను. అతని అభిప్రాయం ఎంతవరకూ వాస్తవమన్నది చూడటం కోసమే తప్ప ఇది నా స్వంత అభిప్రాయం మాత్రం కాదు. దేశానికి నిజంగా ఇంత గొప్ప ప్రయోజనాలు చేకూరాయా? లేక రాజకీయ అభిమాన డబ్బానా అనేది తెలియడం కోసమే!

మన గౌరవప్రదమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడిజీ ఈమధ్యన ఎందుకు చాలా మంది చేత విద్వేషాన్ని ఎదుర్కొంటున్నాడని నేను చాలా ఆశ్చర్యపోయి ఆలోచించడం మొదలెట్టాను. చాలా వాస్తవాలను విశ్లేషించిన తరువాత ప్రతి అవినీతిపరులైన రాజకీయ నాయకులు, నల్లధనం బాధితులు, తీవ్రవాద గ్రూపులు, ఆటంకవాదులు, దేశద్రోహులు అందరి కడుపుమంటకి నిజమైన కారణం మన దేశభక్తుడైన ప్రధాని నరేంద్ర మోడిజీ యొక్క అవినీతి వ్యతిరేక విధానాల కారణంగానే అని అర్ధమైంది.
అది డి-మోనటైజేషన్ లేదా
బ్యాంక్ ఖాతాలతో ఆధార్ జత చేయడం, లేదా
టాక్సులు, సంపాదన, ఆదాయాలకు పాన్-కార్డుతో సహా ఆధార్ జత చేయడం
తద్వారా నల్లధనం నిర్మూలన, మాత్రమే వారి ద్వేషానికి కారణాలని కళ్ళకు కట్టినట్టు అర్ధమైంది....
వివరాలు:
* ఒక కొత్త బేస్ (ఆధార్ నం) ని లింకప్ చేయడం ద్వారా, ఒక మిలియన్ మంది కటిక పేదలు మహారాష్ట్రలో అదృశ్యమయ్యారు *

* 30 మిలియన్ల (30,000,000) నకిలీ LPG కనెక్షన్ ఖాతాదారులు మాయమయ్యారు *

* మదరసాల నుండి ఉపకార వేతనాలు పొందుతున్న 1,95,000 నకిలీ బాల బాలికల జాబితా ఎడారి ఎండమావిలా అదృశ్యమైంది *

* 1.5 మిలియన్ల (1,500,000) నకిలీ రేషన్ కార్డుదారులు అదృశ్యమయ్యారు *

ఎందుకని ఈ తరహా నకిలీమనుషులు, అకౌంట్స్ ఖాతాదారులు మాయమవ్వడం ఎలా మొదలైంది ?
ఈ బ్లాక్ మార్కెట్ దొంగల మొత్తం చిట్టా బయట పడబోతోంది....... కాబట్టి ఈ దొంగలందరూ కలిసి గౌరవనీయమైన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన దావా ప్రాథమిక ఆదాయ నివేదికలకు ఆధార్, పాన్ కార్డుల జతచేయడం అనేది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన అని వాజ్యం వేశారు. కొందరు ముఖ్యమంత్రులు కూడా ఈ చిట్టాలో ఉండడం మన ప్రజాస్వామ్యానికి అత్యంత హేయకరం *

మోడీ ఎం చేసాడు ?

* 1) 3 లక్షల పేపర్ నకిలీ కంపెనీలను మూసివేయబడ్డాయి. *

* 2) రేషన్ డీలర్లు దొంగ లిస్టులు కోల్పోవడంతో చాలా కోపంగా ఉన్నారు *

* 3) అక్రమ ఆస్తుల, బినామీ కింగ్ లు, బ్రోకరేజ్ డీలర్లు అందరూ తీవ్ర అసహనంతో ఉన్నారు *

* 4) అక్రమాలకు అలవాటు పడ్డ బ్రోకర్లు Online సాధన వ్యవస్థతో తమ గుట్టులు రట్టవుతాయని బెంబేలుపడ్డారు. *

* 5) 40,000 నకిలీ NGO లను మూసివేశారు, కాబట్టి ఈ NGO ల యజమానులు శరాఘాత హతాశులయ్యారు *

* 6) బినామీ నంబర్ టూలనుండి ఆస్తి కొనుగోలు చేసిన వ్యక్తులు హతాశులయ్యారు. *

* 7) ఇ-టెండర్ ప్రక్రియ ద్వారా, చాలామంది కాంట్రాక్టర్ల పప్పులు ఉడకడం మానివేశాయి. *

* 8) గ్యాస్ కంపెనీల ఆధారం చేయడం వాళ్ళ కొందరి ఆగ్రహం! *

* 9) ఇప్పటి వరకు, ఎప్పుడూ టాక్స్ అనేదే కట్టి ఎరుగని, కొత్తగా ఆదాయం పన్ను స్కాన్ కింద వచ్చి జేరిన 12 మిలియన్ల ప్రజల నుంచి వ్యతిరేకత ప్రారంభం అయ్యింది. *

* 10) GST వ్యవస్థ పరిచయంతో, వ్యాపార ప్రజలు ఏం చేయాలో పాలుపోక వ్యతిరేకత మొదలుపెట్టారు. ఎందుకంటే ప్రజలందరూ ఆటోమేటిక్ చెల్లింపు వ్యవస్థకు వచ్చారు! *

* 11) నంబర్ టూ వ్యక్తుల ఆటలు సాగక, ఏం చేయాలో పాలుబోక అసహనులయ్యారు. *

* 13) దాచిన నల్లధనాన్ని తెల్లబరచడం కాస్త బాగానే పెళుసుగా మారి గట్టి దెబ్బ తీసింది. *

* 14) సోమరిపోతు ప్రభుత్వ అధికారులు సమయానికి రావడం, పోవడం నిష్ఠగా పనిచేయడం అన్నది ఎరుగక అతలాకుతలం అయ్యారు. *

* 15) సమయానికి పని చేయడమనే అలవాటు లేక, లంచాలను తీసుకోవడం మరిగిన ప్రభుత్వ అధికారులు ఉద్యోగులు జరుగుతోంది అర్ధం కాక నోరెళ్లబెట్టారు. *

* 16) నకిలీ కరెన్సీ డీలర్స్: - డిజిటల్ ఎకానమీ కారణంగా వారిపై ఒత్తిడి పెరిగి కకావికలమయ్యారు. *

* 17) తీవ్రవాద, ఉగ్రవాద, ముసుగు సంస్థలు: - వారి నిధుల సమీకరణ అనేది కరువై అత్యంత దయనీయంగా తయారైంది. *

* 18) రియల్ ఎస్టేట్ మాఫియా: - వారి చెల్లింపులల్లో, లావాదేవీల్లో చాలా పెద్ద భాగం నగదు రూపంలో ఉంటుందనీ, CASH FLOW కారణంగా అకౌంట్ జమ చేయలేని నగదు, నల్లధనం వివరాలు బయటకి కక్కలేక కకావికలం అయ్యారు. ఇప్పుడు అవి లెక్కించని నగదుకు, నల్లధనం ఎం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. *

* 19) రాజకీయ నాయకులు: - దాదాపుగా జీరో స్కాములు అని నిరూపించబడిన శ్రీ నరేంద్ర మోడిజీ కూడా తన పూర్వ ప్రధాన మంత్రుల వలె ఉండి, కళ్ళు, చెవులు మూసుకు పోవచ్చని, ఆశ పడ్డ రాజకీయ నాయకులు, బ్రోకరేజ్ వ్యక్తులు, సంస్థలు మోడీ గారి తీరుకి తీవ్ర అసంతృప్తికి మనస్తాపానికి గురయ్యారు.

ఇలా మోడీ వ్యతిరేకులు అందరూ కట్ట కట్టుకుని మోడీ వ్యతిరేకంగా కలిసిపోయి, ఒక కూటమిగా ఏర్పడి కూటు ఖిచిడి పార్టీని ఏర్పాటు చేయడానికి చేతులు కలిపారు. శ్రీ నరేంద్ర మోడిజీ రెండోసారి గద్దె ఎక్కకుండా ఉండాలని వెతకని దారి లేదు, లేపని రాయి లేదు.

అందువల్ల ఈ బాధ్యత ఇప్పుడు 1.25 బిలియన్ల మంది భారతీయులపై ఆధారపడి ఉంది.....
అవినీతిపరులైన ఖిచిడి పార్టీలకు మద్దతు ఇవ్వాలో...... లేదా
ఈ భరతమాత యొక్క నిజమైన కుమారుడు, ,భారతపుత్రుడు మన గౌరవప్రదమైన ప్రధాని శ్రీ నరేంద్ర మోడిజీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా అని నిర్ణయించడం అనేది మన చేతుల్లోనే ఉంది.
ఇప్పుడుబాల్ మీ కోర్టులో ఉంది. చేయాల్సింది మనమే. *

జైహింద్ ! జైభారత్ *

Source : https://www.facebook.com/permalink.php?story_fbid=242771036708095&id=100029256018791&__tn__=K-R

Related Posts Plugin for WordPress, Blogger...