బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

చట్టంతో ఆటాడుకుంటున్న నిర్భయ హంతకులు!

చట్టంతో ఆటాడుకుంటున్న నిర్భయ హంతకులు!

జరిగి సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా ఒళ్ళు జలదరించే అత్యంత పాశవికంగా కిరాతకంగా ఒక యువతిని అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన.. వ్యక్తులకు తీవ్రమైన శిక్ష అయితే పడింది. ఇప్పుడు కాదు.. కొన్నేళ్ల కిందటే వాళ్లకు ఉరి శిక్ష ఖరారు అయ్యింది. అయితే ఇన్నాళూ ఆ శిక్ష అమలు గురించి అధికారులు ముందుకు వెళ్లలేదు. అయితే దిశపై అత్యాచారం నేపథ్యంలో.. నిర్భయ హంతకులు ఏమయ్యారంటూ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. ఆ శిక్ష అమలుకు ఫైళ్లు కదిలాయి. ఇక ఇదే సమయంలో.. నిర్భయ హంతకులు చట్టంతో ఆటలు మొదలుపెట్టారు.



కొన్నేళ్ల కిందటే వారికి ఉరి శిక్ష ఖరారు అయినా.. అది అమలయ్యేందుకు సమయం వచ్చే వరకూ వారు క్షమాభిక్షను కోరలేదు. రాష్ట్రపతి దృష్టికి వారు తమ క్షమాభిక్ష పిటిషన్ ను తీసుకెళ్లలేదు. అయితే ఎప్పుడైతే వారికి శిక్ష అమలవుతుందనే వార్తలు వచ్చాయో.. ఇప్పుడు క్షమాభిక్ష పిటిషన్ వారికి గుర్తుకు వచ్చింది. ఆ మరి ఆ పిటిషన్ ను అంతా కామన్ గా జాయింటుగా ఒకేసారి పెట్టారా.. అంటే అది కూడా లేదు!

ముందుగా ముకేష్ సింగ్ అనే వాడు రాష్ట్రపతికి క్షమాభిక్ష  పిటిషన్ పెట్టాడు. దాన్ని ఆయన తిరస్కరించారు. ఆ తర్వాత దానిపై వాడు సుప్రీం కోర్టుకు వెళ్లాడు. అక్కడ కూడా తిరస్కరణ ఎదురైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీనే వారికి శిక్ష అమలు కావాల్సింది. కానీ.. వినయ్ శర్మ అనే మరొకడు రాష్ట్రపతిని ఆశ్రయించాడు. తనకు క్షమాభిక్ష కావాలన్నాడు. దాన్ని కూడా రాష్ట్రతి తిరస్కరించాడు. అప్పుడే వాళ్లు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కలిగాయి.

ఇప్పుడు మూడో వాడు పిటిషన్ దాఖలు చేశాడు. క్షమాభిక్షను కోరుతూ రాష్ట్రపతి వద్దకు పిటిషన్ పెట్టాడు అక్షయ్ ఠాకూర్ అనేవాడు. దీనిపై రాష్ట్రపతి  స్పందించే వరకూ.. వీళ్ల ఉరి ఆగినట్టే. అయితే మరో దోషి కూడా ఉన్నాడు. అతడు మరోసారి పిటిషన్ దాఖలు చేస్తాడేమో.

ఏతావాతా.. తమ ఉరి శిక్ష అమలును ఆపేందుకు అన్ని రకాల ప్రయత్నాలూ నిర్భయ హంతకులు ప్రయత్నిస్తూ ఉన్నారు. అది కూడా వ్యూహాత్మకంగా వీలైనంత లేట్ చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారని స్పష్టం అవుతోంది. వీరు చేసిన ఘాతుకానికి ఆపై ఇప్పుడు వీరు ఆడుతున్న ఆటలకు ప్రజల నుంచి వీరిపై మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.

మన దేశం రేపిస్టులను మేపడం తప్ప శిక్షించదన్న నిర్భయ తల్లి ఆవేదనను అర్ధం చేసుకునే స్థితిలో ఈ ప్రభుత్వాలు కూడా లేవు. ఒక్కసారిగా భారతదేశాన్ని మొత్తం ఊపెసినా కూడా ఆ మృగాలకు ఇప్పటివరకూ ఊరి శిక్ష పడకుండా ఏదో నెపంతో తత్సారం చేస్తూనే ఉన్నారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...