These are the new districts of Andhra Pradesh! | ఆంధ్రాలో ఏర్పడే కొత్త జిల్లాలు ఇవే!
ఏపీలో ఉన్నఫలంగా మూడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మంత్రి వర్గం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయాలనుకుంటున్న మూడు మెడికల్ కాలేజీలకు అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు జరగబోతూ ఉంది. ఇప్పటి వరకూ మెడికల్ కాలేజీలు లేని జిల్లాల్లో కొత్త కాలేజీల ఏర్పాటు వల్ల కేంద్రం నుంచి భారీ రాయితీ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు పూనుకుంది. అందులో భాగంగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాల్లో రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అలాగే అరకు కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటు అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా విషయానికి వస్తే.. ప్రస్తుతం మచిలీపట్నం వేదికగా జిల్లా కేంద్రం ఉంది. ఇక పై విజయవాడ ప్రత్యేక జిల్లా కాబోతూ ఉంది. మచిలీపట్నం జిల్లా వేరు విజయవాడ వేరే జిల్లా అవుతుంది. బహుశా విజయవాడ కేంద్రంగా ఉండే జిల్లాకు కృష్ణా జిల్లా పేరు వెళ్లవచ్చు. మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం అంతా కలిసి ఒక జిల్లాగా ఏర్పాడే అవకాశాలున్నాయని అంటున్నారు. అయితే మచిలీపట్నం ఎంపీ సీటు పరిధిలో ఉండే గన్నవరం విజయవాడకు సమీపంలో ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో గన్నవరాన్ని విజయవాడ జిల్లాలోకి వేయాలనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
ఇక గుంటూరు జిల్లాలోని నరసరావుపేట ఎంపీ సీటు పరిధిలోని ప్రాంతం అంతా ఒక జిల్లాగా ఏర్పడనుంది. మెడికల్ కాలేజీ అయితే గురజాలలో ప్రారంభకావొచ్చు. కానీ నరసరావు పేట జిల్లా కేంద్రం అవుతుందా? అనేది ఆసక్తిదాయకమైన అంశం.
మరోవైపు అరకు కేంద్రంగా ప్రతిపాదనలో ఉన్న జిల్లాకు కూడా పాడేరును కేంద్రంగా ప్రకటించాలని అక్కడి వైసీపీ నేతలు అంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెడికల్ కాలేజీ అరకులో ఏర్పాటు అయినా జిల్లా కేంద్రంగా పాడేరు ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం కసరత్తు కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ అంశంపై స్పష్టత రావొచ్చు.
కొత్తగా ఏర్పడబోయే జిల్లా కేంద్రాలు చాలా దూరం, పైగా తూఫాను/సునామీ ప్రమాదం ఎక్కువ. ప్రశాంతంగా ఉండే ఈ నగరాల ప్రజలు త్వరలో కడప కేటుగాళ్లు ఫాక్షన్ తీసుకొస్తారని భయపడి చస్తున్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటు చేస్తే నాలుగు జెరాక్స్ దుకాణాలు రావడం తప్ప అభివృద్ధి ఏమీ జరగదు. కొత్త జిల్లాలు మోడీ, కెసిఆర్, ప్రశాంత్ కిషోర్, విశాఖ సాములోరు, రాం గోపాల్ వర్మ వగైరాల కుట్ర. అసలు కొత్త జిల్లాలు కావాలని ఎవరూ అడగలేదు. ఇట్లా జిల్లాలు పెంచుకుంటూ పొతే దేశవిదేశాలలో ఆంధ్రుల పరువు పోతుంది. వైకాపాకు ఓటు వేసినందుకు ఈ జిల్లాల ప్రజలు తమను తామే చెప్పుతో కొట్టుకుంటున్నారు.
ReplyDelete// “ కొత్తగా ఏర్పడబోయే జిల్లా కేంద్రాలు చాలా దూరం, ...” //
Deleteఎక్కడ నుండి దూరం, జై గారూ?
వీ ఎన్ ఆర్ గారు,
ReplyDeleteపై కామెంట్ జై గారి అభిప్రాయం అని అనుకుంటున్నారా ?
ఇతరులను quote చేస్తుంటే. సదరు reference ఇవ్వడం రివాజు. అదిక్కడ జరగలేదు.
Deleteమరి మండలాల విభజన సంగతి ఏమిటి? విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయితీలో ఆరు గ్రామాలు ఉన్నాయి. అది కొండ ప్రాంతం. ఆ ఆరు గ్రామాలకీ మండల కేంద్రానికి వెళ్ళే దారి లేదు కానీ పక్క జిల్లా కేంద్రం అయిన రాయగడకి వెళ్ళే దారి ఉంది. ఆ ఆరు గ్రామాల నుంచీ నడుచుకుని వెళ్ళినా గుమ్మలక్ష్మీపురం కంటే రాయగడే దగ్గర. పాడేరు కేంద్రంగా జిల్లాని నేను సమర్థిస్తాను. ఆ ప్రాంతంలో రోడ్లు తక్కువ, రోడ్లు ఉన్న చోట బస్సులు తక్కువ.
ReplyDeleteకోనసీమ సోయగాల్ని రొమాంటిక్ గా చిత్రీకరించిన సాంగ్
ReplyDeleteప్రతి ఉదయం నీ పిలుపే
హృదయంనే కదిలించే
మనసే పులకించే
Prati Udayam Nee Pilupe - Romantic Melody Song from Prema Entha Madhuram
Song Link: https://youtu.be/Z9qVLatW6dQ