బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్... సీఎంగా కేటీఆర్

Telanagana-CM-KCR-as-a-member-of-the-Rajya-Sabha-Ktr-As-Cm

రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్... సీఎంగా కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు... తన కేబినెట్ లో ఓ కీలమ మంత్రిగానే కాకుండా పార్టీలో తన తర్వాతి స్థానంలో పార్టీ కార్యాధ్యక్షుడిగా ఉన్న తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును సీఎంగా చేసే కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. ఈక్వేషన్ కుదరక కేసీఆరే వాయిదా వేస్తున్నారో లేదంటే... అసలు అలాంటి ఈక్వేషన్లే లేవో తెలియదు గానీ... ఎప్పటికప్పుడు కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ అలా వార్తలు రావడం కొన్నాళ్ల పాటు చక్కర్లు కొట్టడం మళ్లీ చప్పున చల్లారి పోవడం జరుగుతోంది. మొన్నటి మునిసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎన్నికల్లో టీఆర్ఎస్ బంపర్ విక్టరీ దక్కిన తర్వాత కేటీఆర్ పట్లాభిషేకం ఇక తథ్యమేనని అంతా అనుకున్నారు. అయితే ఈ దఫా కూడా ఆ వార్తలన్నీ చప్పున చల్లారి పోయాయి. ఈ క్రమం లో ఇప్పుడు ఓ కొత్త ఈక్వేషన్ తెర మీదకు వచ్చింది. అదేమిటో చూద్దాం పదండి.



కేసీఆర్ కు ఆది నుంచి జాతీయ రాజకీయాలపై మక్కువ ఎక్కువే. మొన్నటి సార్వత్రిక ఎన్నికలకు ముందు థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాల పర్యటనలు చేసిన కేసీఆర్... అటు కాంగ్రెస్ ఇటు బీజేపీలకు దూరంగా సాగుతున్న పార్టీలతో జతకట్టి జాతీయ రాజకీయాల్లో సత్తా చాటుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు కొన్ని చోట్ల సానుకూల వాతావరణం కనిపించగా... మరికొన్ని చోట్ల ప్రతికూల వాతావరణం స్వాగతం చెప్పింది. ఏది ఏమైనా... సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆశించిన మేర సీట్లు రాకపోవడం ప్రత్యర్థులు ఆశించిన దాని కంటే ఎక్కువ స్థానాలు పొందడం లో కేసీఆర్ సైలెంట్ అయిపోయారు.
అయితే ఇప్పుడు మునిసిపోల్స్ లో సత్తా చాటిన తర్వాత కేసీఆర్ లో మరోమారు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగినట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఎలాగూ లోక్ సభ ఎన్నికలు లేవాయే. అవి వచ్చేదాకా ఆగాలంటే కూడా కుదరదు. అయితేనేం... రాజ్యసభ ఉంది కదా. త్వరలోనే రాజ్యసభ నుంచి కొందరు సభ్యులు రిటైర్ కానున్నారు. అప్పుడు తెలంగాణ కోటాలో టీఆర్ఎస్ కోటాలో రాజ్యసభకు వెళితే సరి. అలా రాజ్యసభ కు వెళ్లే మార్గాన్ని సుగమం చేసుకుని ఇటు తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసేద్దామనం కేసీఆర్ ఆలోచిస్తున్నట్లుగా ఇప్పుడు కొత్త తరహా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఎంట్రీ ఇస్తే... తనదైన శైలిలో పెద్దగా రాణించే అవకాశాలు పెద్దగా లేకున్నా... సయమం చూసుకుని రంగంలోకి దిగే నైజంతో కేసీఆర్ నేషనల్ పాలిటిక్స్ లో ఎలాగైనా రాణిస్తారనే చెప్పాలి. అంతేకాకుండా తన కుమారుడిని సీఎంగా చేసిన తర్వాత తాను రాష్ట్ర రాజకీయాలకే పరిమితమైతే బాగోదు కదా. అందుకే... కొడుకును సీఎం సీట్లో కూర్చోబెట్టిన తర్వాత కేసీఆర్ రాజ్యసభ సభ్యుడి గా వెళతారట. మరి ఈ వార్తల్లో ఏ మేర నిజముందో చూడాలి.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...