బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

నిర్భయ దోషులకు శిక్ష విధించేదెప్పుడు?

నిర్భయ దోషులకు శిక్ష విధించేదెప్పుడు?

when-is-punishment-for-fearless-guilty
        
కన్నకూతురు క్రూరమృగాల పట్ల చిక్కుకుపోయిన లేడిపిల్లలా మానవమృగాలకు బలయిపోయిందన్న వార్త ఆ తల్లిదండ్రులు ఎలా భరించారో ఊహిస్తేనే భయమేస్తుంది.

నిర్భయ ఉదంతం దేశమంతా అట్టుడుకిపోయేలా చేసింది. ఆ మానవమృగాలను ఉరి తీసేసి దేశానికి పట్టిన దరిద్రాన్ని ఈచట్టాలు వదిలించడం మాని ఎందుకు జాప్యం చేస్తున్నాయో అర్ధం కావడం లేదు.

ఒక ఆడబిడ్డను అతి కిరాతకంగా హింసించి.. పైశాచికంగా రేప్ చేసి చంపేసిన ఈ దుర్మార్గులను లొసుగులతో ఉన్న చట్టాలే ఏమీ చేయలేనప్పుడు రాజకీయ నాయకులు, బడాబాబుల యొక్క చీకటి బాగోతాలు, ఆర్ధిక నేరాలు పట్టుకుని ఈ చట్టాలు ఏమి చేయగలవు?

మన దేశ నేరస్తులకు గరుడపురాణమే న్యాయం చేస్తుంది. చచ్చిన తరువాత చేసిన పాపాలకు శిక్ష అనుభవించాలని గరుడపురాణం చెప్తుంది కాబట్టి మనకి కరెక్ట్ చట్టాలు ఆ భగవంతుడి సన్నిధిలో జరిగేవే తప్ప మన చట్టాలు ఏమీ చేయలేవు.

దిశను అత్యాచారం చేసి చంపేసిన నిందుతులను ఎంకౌంటర్ పేరుతో కాల్చి పడేసినప్పుడు అడ్డు రాని చట్టాలు నిర్భయ దొషులను ఉరి తీయడంలో ఎలా అడ్డొస్తున్నాయో ఒకసారి విజ్ఞులు ఆలోచించాలి. లొసుగులు, బొక్కలు లేని చట్టాలు రూపొందించుకోవాలి.

దయచేసి నిర్భయ తల్లిదండ్రుల మానసిక క్షోభను అర్ధం చేసుకుని ఆ దుర్మార్గులను ఉరి తీసి.. ఆ అమాయక తల్లిదండ్రులకు కొద్దిగానైనా మనస్సుకు నెమ్మది కలిగించమని కోర్టులను,ప్రభుత్వాలను వేడుకుంటున్నాను

1 comment:

  1. చట్టం లోని లోసుగు లను దుర్వినియోగం చేసి కిరాతక మృగాళ్లకు నిస్సిగ్గుగా శిక్ష పడకుండా చేస్తున్న న్యాయవాదుల రూపం లో ఉన్న మానవ హక్కుల వాళ్ళను ప్రజా కోర్టులో శిక్షించాలి

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...