బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పై అమెరికా కీలక నిర్ణయం.. ఫైర్ అయిన చైనా?

America-Decision-On-China-Corona-Virus

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పై అమెరికా కీలక నిర్ణయం.. ఫైర్ అయిన చైనా?

కరోనా వైరస్ ..ప్రస్తుతం చైనా తో సహా ..సుమారుగా 25 దేశాలని వణికిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్ భారిన పడితే కోలుకోవడం కష్టమే అని తెలుస్తుంది. దీనితో ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ గురించి ఆందోళన మొదలైంది. ఈ వైరస్ ని తమ దేశంలోకి రానివ్వకుండా వివిధ దేశాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వైరస్ పుట్టిన చైనాలో ఈ వైరస్ ప్రభావం చాలా ఎక్కువ గా కనిపిస్తుంది. ఈ కరోనా భారిన పడి ఇప్పటికే సుమారుగా 400 మందికి పైగా మరణించారు. అలాగే వందల మంది ఈ వైరస్ భారిన పడినట్టు తెలుస్తుంది. దీనితో చాలా దేశాలు కూడా తమ దేశ పౌరులని వెంటనే చైనా నుండి వెనక్కి రావాలని పిలుపునిచ్చాయి.



ఇకపోతే ఈ సమయంలో అమెరికా చేసిన ఒక ప్రకటన పై చైనా విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం అమెరికా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. గత రెండు వారాల్లో చైనాను సందర్శించిన విదేశీయులను తమ దేశంలోకి అనుమతించబోమని చెప్పింది. ఇలా చైనాను సందర్శించిన విదేశీయులను తమ దేశంలోకి అనుమతించబోమని చెప్తున్న అమెరికా చర్యలు భయాన్ని వ్యాప్తి చేయడానికే పనికొస్తాయన్నారు.

చైనా ప్రయాణికులపై నిషేధం విధించిన తొలి దేశం అమెరికానేనని హువా చున్ యింగ్ విమర్శించారు. చైనాలోని అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందిని పాక్షికంగా ఉపసంహరిచుకుంటామని చెప్పిన మొదటి దేశం కూడా అమెరికానేనని తెలిపింది. అంటువ్యాధుల నివారణ సామర్థ్యాలు పుష్కలంగా ఉన్న అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలే-ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు విరుద్ధం గా ప్రవర్తిస్తే ఎలా అంటూ ఆమె విమర్శించారు. చైనా ప్రయాణికుల ప్రవేశంపై అమెరికా నిషేధం ప్రకటించాక ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాలు కూడా ఈ నిషేధాన్ని విధించాయి. ఇలాంటి సందర్భాల్లో సరిహద్దుల మూసి వేతపై డబ్ల్యూహెచ్ వో హెచ్చరికలు చేసింది. వీటిని మూసేస్తే ప్రయాణికులు అనధికారికంగా దేశంలోకి ప్రవేశిస్తే ఈ కరోనా వైరస్ వ్యాప్తి మరింతగా పెరగ వచ్చని ఆ తరువాత ఆ వైరస్ ని అంతమొందించడం కష్టం అని తెలిపింది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...