బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

Telangana-Hyderabad-As-Beggar-Free-City---It-is-Possible
బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

బెగ్గర్ ఫ్రీ సిటీ గా హైదరాబాద్ ... సాధ్యమయ్యేనా?

భారతదేశం ...ప్రపంచపటంలో మన ఈ దేశానికీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పవిత్రమైన పుణ్యక్షేత్రాలకు ఆచార వ్యవహారాలకు కట్టుబాట్లకు ప్రపంచం మొత్తం దాసోహం అంటుంది. కానీ దేశంలో కటిక పేదరికంలో బ్రతికేవారు కూడా లక్షల్లో ఉన్నారు. అన్నపూర్ణగా పిలిచే దేశంలో పట్టెడు అన్నం కోసం దేహి అంటూ యాచించే వారు చాలామంది ఉన్నారు. రోజురోజుకి ఇలాంటివారు దేశంలో పెరిగిపోతున్నారు. దీనితో కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

దేశంలో ఏ కూడలి వద్ద చూసినా యాచకులు కనిపిస్తుంటారు. ఇక ఈ యాచన వృత్తికి స్వస్తి చెప్పి వారికి ఏదో ఒక రకంగా పునరావాసం ఉపాధి కల్పించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది . ఇక ఈ కొత్త ప్రాజెక్ట్ అమలుకు హైదరాబాద్ ను ఎంచుకుంది కేంద్రం. హైదరాబాద్ లో రద్దీగా ఉండే సిగ్నల్స్ వద్ద దేవాలయాల వద్ద ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద విపరీతంగా యాచకులు కనిపిస్తుంటారు. హైదరాబాద్ ను యాచక రహిత నగరంగా (బెగ్గర్ ఫ్రీ సిటీ గా) మార్చాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం మొదటగా హైదరాబాద్ నుంచి ఈ ప్రాజెక్ట్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగానే ..బెగ్గర్ ఫ్రీ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దేలా జీహెచ్ఎంసీ కార్యాచరణ ప్రారంభించింది. ఇందుకుగాను బిక్షగాళ్ల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ఏడు అంశాలను తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు.



1. పోలీస్ ఎన్జీవీవో కమ్యూనిటీ ఇతర ఏజెన్సీల సహకారంతో సర్వే చేసి యాచకులను గుర్తించడం
2. యాచకులను కేటగిరీల వారీగా.. పిల్లలు మానసిక వ్యాధిగ్రస్తులు సీనియర్ సిటిజెన్స్ దివ్యాంగులు అనాథలు కుటుంబాలున్నవారు పనిచేయగల వ్యక్తులుగా విభజించడం
3. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఏరియా ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయించడం
4. కేటగిరీల వారీగా అందరికీ కౌన్సిలింగ్ నిర్వహణ
5. మానసిక వ్యాధిగ్రస్థులకు ఉచిత భోజన వసతి కల్పించుట
6. యాచకులందరికీ సమగ్ర పునరావాసం
7. ఈ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేసేందుకు నిధుల సమీకరణ.

ఈ కార్యచరణను పక్కాగా అమలు పరిచేందుకు కార్పొరేటర్లు పోలీస్ శాఖ రెవెన్యూ పౌర సరఫరాల శాఖ అధికారులు ఐసీడీఎస్ ఉద్యోగులు ముఖ్యంగా ఎన్జీవోలు సంక్షేమ శాఖల ప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేర్చాలని జీహెచ్ ఎంసీ అధికారులు నిర్ణయించారు. అయితే హైదరాబాద్ వంటి మహా నగరంలో బెగ్గింగ్ అనేది ఇప్పుడు ఒక మాఫియాగా మారింది. ఇటువంటి సమయంలో బెగ్గింగ్ గ్యాంగ్ లు కష్టపడి జీవనం సాగించమంటే భిక్షాటన ఆపేస్తారా?లేదా ? అనేది వేచి చూడాల్సి ఉంది.

3 comments:

  1. సుఖపడే మనసు కష్టానికి కాలు కదపదు. కష్టమైన ఎక్కువకాలం పడుతుంది.

    newsgita.com

    ReplyDelete
  2. చిత్తశుద్ధితో చేయగలిగితే..ఏదీ అసాధ్యంకాదు.కానీ దిక్కులేనివారికి ప్రభుత్వమే దిక్కవ్వాలి. బిక్షగాళ్ళ పేరుతో కూడా జేబులు నింపుకునే అవినీతిపరులకు ఆఫీసుల్లో జీతాలు ఏర్పాటుచెసి మరో తప్పుచేయకూడదు

    ReplyDelete
  3. Did you realize there's a 12 word sentence you can communicate to your man... that will induce deep emotions of love and instinctual attractiveness to you buried within his heart?

    Because hidden in these 12 words is a "secret signal" that fuels a man's instinct to love, look after and protect you with his entire heart...

    12 Words That Fuel A Man's Love Instinct

    This instinct is so built-in to a man's mind that it will drive him to work harder than before to build your relationship stronger.

    Matter of fact, fueling this mighty instinct is absolutely mandatory to achieving the best ever relationship with your man that the moment you send your man a "Secret Signal"...

    ...You'll soon find him expose his heart and mind to you in such a way he's never expressed before and he will identify you as the one and only woman in the galaxy who has ever truly tempted him.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...