భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు.. |
భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని రికార్డ్స్ లో చంపేసిన కూతురు..
ఈ ప్రపంచంలో తల్లి బిడ్డల ప్రేమకి మరొకటి సాటిరాదు లేదు. కానీ ప్రస్తుత రోజుల్లో డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులకి కొడుకు అన్నం కూడా పెట్టడం లేదు ..భార్య వచ్చిన తరువాత కని పెంచిన తల్లిదండ్రులు కూడా బరువైపోతున్నారు అని కంటే కూతుర్నే కనాలి అంటూ పెద్ద పెద్ద సూక్తులు చెప్తున్నారు. నేటి రోజుల్లో ఇది బాగా ప్రాచుర్యం పొందింది ..ఏమిటంటే ..కొడుకు అయితే తల్లితండులకి కూడు పెట్టడు అదే కూతురు అయితే తల్లిదండ్రులని కంటికిరెప్పలా చూసుకుంటుంది. తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు ఉంటాయని భావిస్తున్నారు. కానీ తాజాగా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకుంటే కూతురు కంటే కొడుకే నయం అని అంటారేమో...తండ్రి చనిపోయాడు అనే భాద లేకుండా తల్లికి వచ్చే చంద్రన్న భీమని కాజేయాలని బతికున్న తల్లి చనిపోయిందని రికార్డులు సృష్టించింది. ఈ నిర్వాకానికి చంద్రన్న భీమా సిబ్బంది కూడా సహకారం అందించడం గమనార్హం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కడప జిల్లా రాజంపేట లో జరిగింది.
దీనిపై పూర్తి వివరాలు చూస్తే ...రాజంపేట పట్టణంలోని బలిజపల్లి చెందిన ఆదిలక్ష్మమ్మ వెంకటరత్నం దంపతుల కుమార్తె శాంతకుమారి. గతేడాది నవంబర్ 14 వ తేదీన వెంకటరత్నం మృతిచెందాడు. వెంకటరత్నం చంద్రన్నభీమా లో సభ్యుడు కావడంతో ఆ భీమా సొమ్ము కాజెయ్యాలని భావించిన కుమార్తె నామినీగా తల్లి ఉండాల్సిన స్థానంలో తన పేరును మార్చుకుంది. ఇక తన తల్లి ఆదిలక్ష్మమ్మ చనిపోయిందని రికార్డులు సృష్టించింది. ఇందుకు చంద్రన్న భీమా సిబ్బంది కూడా శాంతకుమారికి సహకరించారు. అయితే ఇటీవలే తనకు బియ్యం కార్డు పింఛను ఇవ్వాలని ఆదిలక్ష్మమ్మ మున్సిపాలిటీ కార్యాలయంకి వెళ్లగా జరిగిన విషయం తెలుసుకొని డబ్బు కోసం కూతురు చేసిన నిర్వాకం విని గుండెలవిసేలా ఏడ్చింది ఆదిలక్ష్మమ్మ.
అసలు భీమా సిబ్బంది ఎలాంటి ఎంక్వైరీ చేయకుండానే తను చనిపోయానని ఎలా ధృవీకరిస్తారు అని ఆమె అధికారులు నిలదీసింది. అంతేకాదు ఈ నిర్వాకం పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఏదేమైనా కేవలం భీమా డబ్బులు కోసం బ్రతికున్న తల్లిని సైతం చచ్చిపోయింది అని రికార్డ్స్ సృష్టించిన ఆ కూతురు గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్తున్నారు. ఈరోజుల్లో ఇలాంటి కూతుర్లు ఉండటం అత్యంత బాధాకరమైన విషయం.
తల్లిని నిజంగానే చంపెయ్యలేదు, అంత వరకు నయం.
ReplyDeleteవివరాలు కాస్త గందరగోళంగా ఉన్నాయి. తండ్రి (ఈ కేసులో బీమాదారుడు) చనిపోయిన తరువాత నామినీ పేరు ఎలా మార్చుతారు? బీమా గానీండి, బాంకులో గానీండి, నామినీ సదుపాయం ఉన్న ఎక్కడయినా కూడా ... ఎవరి పేరున ఉందో ఆ వ్యక్తే (తను బతికున్నప్పుడు) నామినీని వెయ్యటానికి గాని, వేసిన నామినీ పేరుని తరువాత మార్చడానికి గానీ వీలవుతుంది గానీ ఎవరు పడితే వారు ఎలా మార్పించేసుకుంటారు?
ఈ కేసులో ఒకవేళ సిబ్బందితో కుమ్మక్కయి నామినీ అని తన పేరిట మార్పించుకుందే అనుకుందాం .... తనే నామినీ అయినప్పుడు మరి ఇంక తల్లిని తప్పించాల్సిన అవసరం ఏమిటి?
ఏమిటో చిత్రాలు?
Deleteకాంప్లయన్సాఫీసరు గా గాక లీగలాఫీసరు గా ఆలో " చించుడి" విషయము తదితర వివరములరయగలరు :)
చేసే పని లీగల్ పరిధిలో సవ్యంగా చేస్తే లీగల్ “కాంప్లయన్స్” దానంతటదే జరుగుతుంది.
Delete
Deleteఅవన్నీ సరిగా జరిగి వుంటే ఈ న్యూసేల వచ్చును :)