భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య ! |
భారత్ లో విజృంభిస్తున్న కరోనా ..62 కి చేరిన భాదితుల సంఖ్య !
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. చైనా దేశం వూహాన్ నగరంలో పుట్టిన ఈ మహమ్మారి ఆ దేశ సరిహద్దులు దాటి ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతోంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటి వరకు భారత్ లో కరోనా ప్రభావం పెద్దగా కనిపించలేదు. కానీ గత రెండు రోజుల్లోనే కరోనా బాధితుల సంఖ్య విపరీతంగా పెరిగింది. తాజాగా కేరళ కర్ణాటక పూణెలో కొత్త కేసులతో హడలెత్తిస్తోంది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 62కి చేరింది. దీంతో అప్రమత్తమైన కేంద్రం...రాష్ట్రాలకు సూచనలు జారీ చేయడంతో పాటు హై అలర్ట్ ప్రకటించింది.ఇకపోతే ఇప్పటివరకు మహారాష్ట్రలోని పూణెలో మొత్తం ఐదుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ ప్రకటించారు. వారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అలాగే రాజస్థాన్ రాజధాని జైపూర్లో 85 ఏళ్ల వృద్ధుడికి కరోనా నిర్ధారణ అయింది. అలాగే ఏపీలో కూడా తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇటీవలే ఇటలీ నుండి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్దారణ అవ్వడం తో నెల్లూరులోని హాస్పిటల్ లో ఐసోలేషన్ వార్డ్ ఏర్పాటు చేసి ..చికిత్స అందిస్తున్నారు. అలాగే కేరళలో తాజాగా మరో ఆరుగురికి కరోనా సోకినట్లుగా ప్రభుత్వం నిర్ధారించడంతో ఈ ఒక్క రాష్ట్రంలోనే 12 కేసులు నమోదైనట్లైంది.
No comments:
Post a Comment