బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?



కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?

Can-The-China-Virus-Corona-Hurt-In-4-Different-Ways
కరోనా 4 రకాలుగా ప్రమాదం తలపెడుతోంది?
వైరస్ అన్నది చాలా కామన్. అన్ని వైరస్ లు ఒకేలా ఉండవన్నట్లుగా కరోనా.. మిగిలిన వైరస్ లకు చాలా భిన్నం. ప్రపంచాన్ని వణికించిన చాలా వైరస్ లు ఉన్నాయి. ఒకప్పుడు సార్స్.. మెర్స్ వైరస్ లు వణికించాయి. కాకుంటే.. వీటితో పోలిస్తే కరోనా ప్రత్యేకత ఉంది. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరించే గుణం ఉంది.

ప్రాణాలు తీసేది తక్కువే అయినా.. ప్రాణం పోయేంతలా తిప్పలు పెట్టే సత్తా దీనికి ఎక్కువ. అన్నింటికి మించిన.. ఈ వైరస్ వ్యాపించిన విషయం తెలీకుండానే.. శరీరంలో కొన్నిరోజుల పాటు తిష్ట వేసిన తర్వాతే తన విశ్వరూపాన్ని చూపిస్తుంటుంది. ప్రపంచంలో ప్రమాదకరమైన వైరస్ లకులేని గుణం.. కరోనాకు ఉన్న మరో గుణం ఏమంటే.. చాలా తక్కువ వ్యవధిలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టేయటం.



కరోనా వైరస్ విషయంలో నాలుగు అంశాలు చాలా ముఖ్యమని చెబుతారు. అందులో మొదటిది చాలా ముఖ్యమైనది.. ఇది సోకిన తర్వాత చాలా రోజుల పాటు తన లక్షణాల్ని చూపించదు. దీంతో.. తమకు తెలీకుండానే చాలామంది కరోనాను అంటించేస్తారు. దీంతో.. ఎవరు వేరుగా ఉండాలో అర్థం కాని పరిస్థితి. ఈ కన్ఫ్యూజనే.. కరోనా వేగంగా విస్తరించటానికి కారణంగా చెప్పాలి.

రెండో అంశం.. కరోనా వచ్చిన అందరికి ఇది ప్రాణాంతకమైనది కాదు. ఇందులో ఎనభై శాతం మందికి ఈ లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే.. దగ్గు మాదిరే ఉండే చిన్న సమస్యగా ఉండిపోతుంది. దీంతో.. తమకు కరోనా భూతం పట్టిందన్న విషయం తెలీక.. అందరితోనూ ఎప్పటిలానే ఉండిపోతారు. దీంతో.. ఒక్కరితోనే వందలాది మంది కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. మూడోది.. ముఖ్యమైన అంశం ఏమంటే..కరోనా వైరస్ కు ఫ్లూ లక్షణాలు ఉండటం తో.. జనాలు తమకు వచ్చింది ఫ్లూ అనుకుంటారే కానీ.. కరోనా అనుకోరు. వారు గుర్తించేసరికి.. వారి కారణంగా చాలామంది ఎఫెక్ట్ అయి ఉంటారు. నాలుగో అంశం.. అతి కీలకమైనది ఏమంటే.. ఈ వైరస్ ప్రారంభంలో శరీరంలోని గొంతు భాగంలోనే ఉండిపోతుంది. దీంతో.. దగ్గు కానీ.. తుమ్ము లాంటి వాటితో.. వందల కోట్ల సూక్ష్మ క్రియులు బయటకు వచ్చేస్తాయి. వాటిని సరిగా క్లీన్ చేయకున్నా.. వ్యక్తిగత శుభ్రత పాటించకుండా ఉంటే పెను ప్రమాదం పొంచి ఉంటుందన్నది మర్చిపోకూడదు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...