బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

What-Is-The-Connection-Between-Rain-And-Corona-Virus
వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

వర్షం పడితే కరోనాని ఆపలేమంటగా ... ఎందుకంటే ?

కరోనా వైరస్ ..ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న అత్యంత భయంకరమైన వైరస్. చైనాలో పుట్టిన ఈ కరోనా వల్ల ఇప్పటికే మూడు వేలమందికి పైగా చనిపోయారు. అలాగే దాదాపుగా లక్ష మంది వరకు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఈ కరోనా ఇప్పటికే ప్రపంచంలోని 89 దేశాలకి వ్యాప్తి చెందింది. ఇకపోతే ఈ కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించకున్నా.. ఈ వైరస్ బారిన పడ్డ వారిని టచ్ చేస్తే సోకుతుంది. అయితే ఈ వైరస్ ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎక్కువసేపు తట్టుకోలేదని వేడి ఎక్కువగా ఉంటే వైరస్ క్షణాల వ్యవధిలోనే చనిపోతుంది అని కొందరు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఉండే ఉష్ణోగ్రతలని తట్టుకోవడం అంత ఈజీ కాదు.

అసలు ఈ వైరస్ మన దేశంలోకి ప్రవేశించిందే ..ఇతరదేశాల నుండి భారత్ కి వచ్చిన వారి వల్ల. ఈ కరోనా వైరస్ వేడిని ఎలా అయితే తట్టుకోలేదు .. అంతకు రెండురెట్లు చలి ప్రాంతంలో ప్రభావం చూపించగలదు. తక్కువ వేడి ఉన్న ప్రాంతాలలో ఎక్కువ యాక్టివ్గా పనిచేస్తుందట. అయితే ఎక్కడైనా వర్షాలు పడితే ఉష్ణోగ్రతలతో మార్పులు రావడం అనేది సహజం. దీంతో ఈ వైరస్ విజృంభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.



ప్రస్తుతం ఉత్తర భారతంలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రజలు కొంత ఆందోళనకి గురౌతున్నారు. జమ్మూ హిమాచల్ ప్రదేశ్ లడాక్ ఢిల్లీ వెస్ట్ బెంగాల్ పంజాబ్ హరియాణా ప్రాంతాల్లో సడన్ గా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల స్వల్పంగా వర్షాలు పడుతున్నాయి. తాజగా తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. దీంతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు రంగంలోకి దిగారు. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటునే మరోవైపు ఎవరైనా అస్వస్తతకు గురైతే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి అని చెప్తున్నారు.

5 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. వైరస్ ఇంతకు ముందే పట్టేసింది.

      Delete
    2. మతుండే మాట్లాడుతున్నారా? తమరామధ్య చంద్రబాబు గెలుస్తాడని మిడతంబొట్లు జాతకం చెప్పినట్టు గుర్తు.

      చంద్రబాబు ఓడడానికి కారణం అవినీతి మరియు show put up.

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
  2. @ "అలాగే దాదాపుగా లక్ష మంది వరకు ప్రాణాలతో పోరాడుతున్నారు"
    ఇది కరెక్ట్ కాదు. లక్షమందికి పైగా సోకింది. సీరియస్ అయింది కొంతమందికే.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...