బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది
బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది |
వాస్తవంగా ఉద్యోగం చేసే సమయంలో టైంకి సరిపడా తిండి తింటాం...సరిపడా నిద్ర పోతాం. అదే ఖాళీగా ఉంటే...చాలామందికి ఆకలెక్కువగా వేస్తుంది....ఆటోమేటిక్ గా నిద్ర కూడా ఎక్కువ వస్తుంది. లాక్ డౌన్ టైంలో వర్క్ ఫ్రం హోం చేసేవారికి కంప్యూటర్ ముందు కొద్దో గొప్పో పనున్నా....ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల బరువు పెరిగే చాన్స్ ఉందట. అదే ఉద్యోగం చేసేందుకు బయటకు వెళితే శ్రమ పెరిగి కేలరీలు ఖర్చవుతాయి. మామూలు టైంలో అయితే బయటకు వెళ్లడం...జిమ్ కు వెళ్లడం...వ్యాయామం చేయడం వంటివి ఉంటాయి. ఇపుడు బయటకు వెళ్లలేని స్థితి. కొందరి ఇళ్లకే జిమ్ ఎక్విప్ మెంట్ పరిమితమైనందున...మెజారిటీ ప్రజలు వ్యాయామానికి వాకింగ్ కు దూరమవుతారు. తిండిని తగ్గించుకోలేరు. పోనీ తక్కువ తిన్నా అది హెల్త్‌కి మంచిది కాదు. కానీ కేలరీలు కరగాలి. మరి ఇప్పుడు ఇళ్లలోనే ప్రజలు ఉండిపోవాల్సి రావడంతో.. ప్రజలు బరువు పెరిగే ప్రమాదం ఉంది. మాములుగా బ్రిటన్ ప్రభుత్వం అక్కడి వారికి రోజుకోసారి రన్నింగ్ - జాగింగ్ - సైక్లింగ్ చేయడానికి అనుమతిచ్చింది. మన ఇండియాలో మాత్రం పర్మిషన్లు లేవు. అందుకే మన దేశంలో సింపుల్ వ్యాయామాలు - యోగాలు - ఆసనాలు - వర్కవుట్స్...ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం వల్ల శారీరక శ్రమ కలిగి బరువు పెరగకుండా ఉంటారని డైటీషియన్లు చెబుతున్నారు.
meaningless post.Life is prime than temporary obes fears.
ReplyDelete