బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది


బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది

Corona-News-Obesity-Threat-During-Lock-Down-Time
బీ అలర్ట్..లాక్ డౌన్ వల్ల ఒబెసిటీ రిస్క్ ఉంది
కరోనా కోరలు పీకేందుకు ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా దాదాపుగా కర్ఫ్యూ వాతావరణం ఉంటుందని - లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలని.. ప్రజలు సహకరించకుంటే....పోలీసులు కఠిన చర్యలు తీసుకొనైనా సరే లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయాలని మోడీ గట్టిగా ఆదేశాలిచ్చారు. స్టే హోమ్...స్టే సేఫ్ అంటూ ప్రధాని నుంచి సెలబ్రిటీల వరకు పిలుపునిస్తున్నారు. కరోనా పుణ్యమా అంటూ ఏ ఫంక్షన్ టైంలోనో...స్పెషల్ అక్కేషన్ లోనే ఇంట్లో ఒకేసారి గుమిగూడే పిల్లలు - యువకులు - పెద్దలు - ముసలివారు..అంతా ఇప్పుడు ఒకే చోట కట్టగట్టుకొని కూర్చుంటున్నారు. అయితే ఇలా కదలకుండా..ఏమాత్రం శారీరక వ్యాయామం..అలసట లేకుండా...కూర్చోవడం వల్ల బరువు పెరిగే అవకాశముందని ఫిజీషియన్లు హెచ్చరిస్తున్నారు. ఇంట్లోనే ఉన్నాం కదా...అని స్నాక్స్ - చిరుతిండ్లు తినడం వల్ల అనర్థాలు వచ్చే అవకాశముందని వార్నింగ్ ఇస్తున్నారు.


వాస్తవంగా ఉద్యోగం చేసే సమయంలో టైంకి సరిపడా తిండి తింటాం...సరిపడా నిద్ర పోతాం. అదే ఖాళీగా ఉంటే...చాలామందికి ఆకలెక్కువగా వేస్తుంది....ఆటోమేటిక్ గా నిద్ర కూడా ఎక్కువ వస్తుంది. లాక్ డౌన్ టైంలో వర్క్ ఫ్రం హోం చేసేవారికి కంప్యూటర్ ముందు కొద్దో గొప్పో పనున్నా....ఎక్కువగా కూర్చొని ఉండడం వల్ల బరువు పెరిగే చాన్స్ ఉందట. అదే ఉద్యోగం చేసేందుకు బయటకు వెళితే శ్రమ పెరిగి కేలరీలు ఖర్చవుతాయి. మామూలు టైంలో అయితే బయటకు వెళ్లడం...జిమ్ కు వెళ్లడం...వ్యాయామం చేయడం వంటివి ఉంటాయి. ఇపుడు బయటకు వెళ్లలేని స్థితి. కొందరి ఇళ్లకే జిమ్ ఎక్విప్ మెంట్ పరిమితమైనందున...మెజారిటీ ప్రజలు వ్యాయామానికి వాకింగ్ కు దూరమవుతారు.  తిండిని తగ్గించుకోలేరు. పోనీ తక్కువ తిన్నా అది హెల్త్కి మంచిది కాదు. కానీ కేలరీలు కరగాలి. మరి ఇప్పుడు ఇళ్లలోనే ప్రజలు ఉండిపోవాల్సి రావడంతో.. ప్రజలు బరువు పెరిగే ప్రమాదం ఉంది. మాములుగా బ్రిటన్ ప్రభుత్వం అక్కడి వారికి రోజుకోసారి రన్నింగ్ - జాగింగ్ - సైక్లింగ్ చేయడానికి అనుమతిచ్చింది. మన ఇండియాలో మాత్రం పర్మిషన్లు లేవు. అందుకే మన దేశంలో సింపుల్ వ్యాయామాలు - యోగాలు - ఆసనాలు - వర్కవుట్స్...ఇంట్లో చిన్న చిన్న పనులు చేయడం వల్ల శారీరక శ్రమ కలిగి బరువు పెరగకుండా ఉంటారని డైటీషియన్లు చెబుతున్నారు.

1 comment:

  1. meaningless post.Life is prime than temporary obes fears.

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...