నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత.. ఇక ఉరే! |
నిర్భయ నిందితుడి పిటీషన్ కొట్టివేత..ఇక ఉరే!
దేశ రాజధాని ఢిల్లీలో 2012లో జరిగిన నిర్భయ హత్యాచార కేసులో నిందితులకు విధించిన ఉరిశిక్ష అమలు ఆలస్యమవుతోంది. ఈ శిక్ష అమలులో రోజుకో పరిణామా చోటుచేసుకుంటూ ఉత్కంఠ నెలకొంది. చట్టంలో ఉన్న లొసుగులను వినియోగించుకుంటూ నిందితులు కేసును సాగదీస్తున్నారు. దీంతో వారికి విధించిన ఉరిశిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో వారికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. నిర్భయ హత్యాచార కేసులో దోషి పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తిరస్కరించింది. తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదు శిక్షగా మార్చాలంటూ నిర్భయ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్త వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది.ఈ పిటిషన్ విచారణకు ఎలాంటి కొత్త అంశాలు లేవని జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా ఆర్ఎఫ్ నారిమాన్ భానుమతి అశోక్ భూషణ్ ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్ను అంటూ పిటిషన్లో పేర్కొంటూ ఉరి నుంచి తప్పించుకోవాలని చూశాడు. దీన్ని గమనించిన ధర్మాసనం అతడి పిటిషన్ ను తిరస్కరించింది. తనకు విధించిన ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ క్యూరేటివ్ పిటిషన్ తన తరఫున న్యాయవాది ఏపీ సింగ్ తో ఆదివారం సుప్రీంకోర్టు రిజిస్ట్రీ వద్ద పిటిషన్ దరఖాస్తు చేసిన విషయం తెలిసిందే. నిర్భయ ఘటన జరిగిన రోజు తన వయసు 16 ఏళ్లు రెండు నెలలని అది తన స్కూలు రికార్డులను పరిశీలిస్తే తెలుస్తుందంటూ తన పిటిషన్లో పేర్కొన్నాడు. దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి ఆ పిటిషన్ తిరస్కరించిన అతడు రాష్ట్రపతికి మెర్సీ పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం పవన్ గుప్తాకు ఇంకా మిగిలే ఉంది.
ఇదిలా ఉంటే క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో పవన్ గుప్తా చివరివాడు. చివరి అవకాశం వినియోగించుకుని తప్పించుకుందామనుకుంటే సుప్రీంకోర్టు తోసిపుచ్చడంతో ఇక మిగతా ముగ్గిరితో పాటు పవన్గుప్తాకు కూడా ఉరిశిక్ష అమలు కానుంది. ఇదిలా ఉంటే తమకు విధించిన డెత్వారెంట్పై స్టే ఇవ్వాలని కోరుతూ పవన్ కుమార్ గుప్తాతో పాటు మరో నిందితుడు అక్షయ్ సింగ్లు ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎక్కడ పిటిషన్ వేసినా నిందితులకు ఎదురుదెబ్బ తగులుతోంది. చట్టంలో ఉన్న అవకాశాలు ఉన్న వాటిని సద్వినియోగించుకుని ఉరిశిక్ష తప్పించుకోవాలని చూడగా వారు ఉరి నుంచి తప్పించుకోలేకపోతున్నారు.
ఈ కేసులో మార్చి3వ తేదీన నిర్భయ ఘటనలో నిందితులకు ఉరి శిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఫిబ్రవరి 17వ తేదీన తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ముఖేశ్ వినయ్ అక్షయ్ సింగ్ రాష్ట్రపతి వద్ద క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేయగా రామ్నాథ్ కోవింద్ వాటిని తిరస్కరించారు. తాజాగా పవన్ కుమార్ గుప్తా దాన్నుంచి తప్పించుకునేందుకు క్యూరేటివ్ పిటిషన్ వేయగా వాటిని తిరస్కరించింది. వీటన్నిటి నేపథ్యంలో నిర్భయ ఘటనలో నిందితులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్ష అమలుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని కుదిరితే మంగళవారం వారికి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది.
తాజా వార్త మీరు మిస్సయినట్లున్నారు. ఒకరి క్షమాభిక్ష అర్జీ ఇంకా రాష్ట్రపతి వద్దనున్నందున ఉరిశిక్ష అమలును తదుపరి ఆదేశాలిచ్చేటంత వరకు ఆపు చేసిందిట పటియాలా హౌస్ కోర్టు ఈ రోజు సాయంత్రం.
ReplyDeleteనేరస్థుల వెనుక ఎంత రాజకీయ బలం లేకపోతే ఇలా ఇన్నిసార్లు వాయిదా వేయించుకోగలుగుతున్నారు. అదే దిశ నిందితుల విషయం లో కోర్టు విచారణ కూడా పూర్తవ్వలేదు. న్యాయవ్యవస్థ సిగ్గు పడాలి.
Deleteఅసలు ఆ నేరస్తులకు సహకరిస్తున్న లాయర్లు ఏ ఢిల్లీ అల్లర్లలోనో కరోనా కల్లోలం లోనో పోయి ఉంటే ఎంత బావున్నో.
ఈ రాక్షసులు వీళ్లకు సహకరిస్తున్న అమానుష హక్కుల పంది కొక్కులు మన న్యాయ్యవస్థ లోని లొసుగులను పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నాయి.
ReplyDeleteఅన్ని దారులు మూసుకుపోయి ఈ పిశాచాలను అతి త్వరలో ఉరి తీయాలని
నిర్భయ ఆత్మకు శాంతి చేకూరాలని నిర్భయ తల్లి దండ్రులకు మానసిక వేదన నుండి విముక్తి కలగాలని కోరుకుంటున్నాము.
రాష్ట్రపతి నో అన్నారట. ఇక సుప్రీం చివరగా నో తినడమే మిగిలి ఉంది. అంతా రూల్స్ ప్రకారం జరిగితే మే మొదటి వారానికల్లా శిక్ష అమలు కావచ్చు.
ReplyDelete// “మే మొదటి వారానికల్లా” //
Deleteమే ?? అచ్చుతప్పా? ఇదింకా మార్చ్ మెదటివారమే. రాష్ట్రపతి “నో” అన్న తరువాత ఇచ్చే 14 రేజుల గడువు కూడా ఈ నెలలోనే పూర్తవుతుంది.
నేరస్తుల వకీలును తేలికగా అంచనా వెయ్యలేం. ఇంకా ఏమేమి ఆలోచనలు అతని బుర్రలో ఉన్నాయో? NHRC కు విన్నవించుకున్నా ఆశ్చర్యం లేదు.
1. మార్చి చివరి వారానికి ఉరి తీసేలా డెత్ వారెంట్ జారీ అవుతుంది.
Delete2. శిక్షకు ఒకటో రెండో రోజులముందు "రాష్ట్రపతి క్షమాభిక్ష తిరస్కరణపై" చివరి దోషి సుప్రీం లో పిటిషన్ వేస్తాడు. మళ్ళీ ఉరిపై స్టే విధించబడుతుంది.
3. సుప్రీం పిటిషన్ ని తిరస్కరిస్తుంది.
4. ఏప్రిల్ చివరి వారానికి మరో వారెంట్ విడుదల అవుతుంది.
ఏప్రిల్ లో కొన్ని సెలవులు కూడా ఉన్నాయి కనుక వారెంట్ మే మొదటి వారానికి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదీ నా అంచనా.
ఈలోగా రెండోస్సారి మూడోస్సారి అంటూ వీళ్ళు క్షమాభిక్షకు అప్లై చేస్తే వ్యవస్థ చెంప చెల్లుమనిపిస్తుందా లేదా అనేది సందేహం.
అదా మీ లెక్క ? అలా గనక జరిగితే మరి కొంతకాలం కూడా సా....గే అవకాశాలు కూడా ఉండచ్చు - ఎందుకంటే భారతదేశంలో కోర్టులకు మే నెలలో వేసవి సెలవులు ఇస్తారు,
Deleteనేరాలకు సెలవుల్లేనపుడు కోర్టుకి సెలవులెందుకండీ దండగ!
DeleteBritish rule hang-over. కేసులు లక్షల్లో పెండింగ్ ఉన్నప్పుడు జడ్జీలకు వెకేషన్ ఏమిటి అని ఎప్పటి నుండో ఉన్న ప్రశ్న. కానీ ఎవరు మారుస్తారు?
Deleteఅయినా ఈ నెల 20న ముహూర్తం పెట్టారని ఇప్పుడే అందిన వార్త. చూద్దాం.
అయితే18వ తారీఖున వాడు రివ్యూ పిటిషన్ వేస్తాడు.
DeleteThis comment has been removed by the author.
Deleteహా హా హా సూర్య, మార్చ్ 18 వరకు ఎందుకు, ఇప్పుడే మొదలయింది. ఒకడు (ముకేష్) క్యురేటివ్ పిటిషన్, మెర్సీ అప్పీల్ మళ్ళీ వేస్తానంటున్నాడట. ఈక్రింది లింకులో చదవచ్చు. Happy reading 👍😊.
Delete2012 Nirbhaya case :: latest news
ఇదంతా చూసి batman begins సినిమా లోని ఈ డైలాగ్ గుర్తొచ్చి అర్థమేంటా అని గూగుల్ లో వెతికాను. Reddit లో దొరికిన సమాధానం తో నాకు మైండ్ బ్లాక్ అయింది
ReplyDeleteCriminals thrive on the indulgence on Society's understanding
Well said.
ReplyDeleteఅత్యాచారం చేసినవారికి ఒక వారంలో శిక్ష తప్పక ఇవ్వాలి
ReplyDeleteLatest Andhra Pradesh Political News
It seems the action by Sajjanar is correct.
ReplyDeleteLatest news from SCI
ReplyDeletehttps://www.thehindu.com/news/national/nirbhaya-case-supreme-court-to-step-in-on-march-23-if-convicts-are-not-hanged-on-march-20/article30990699.ece
Is supreme court finalaising or dragging the matter is to be seen.
// "Is supreme court finalising or dragging the matter is to be seen." // అంటే ఈనెల 20న ఉరి అమలు కాకపోవచ్చేమో అని మీ అనుమానమా, లతిక గారూ? (ఉరి తేదీ 20; సుప్రీం కోర్ట్ విచారణ తేదీ 23 కదా)
Deleteవిచారణంతా పూర్తయ్యాల clemency ఎమీటండి? అంటే ఇప్పటిదాకా విచారణ చేసినోళ్లందరూ పిచ్చోళ్ళా?
ReplyDeleteరేపిస్టుకు భార్యగా ఉండలేనని ఈమధ్యే తెలిసిందట ఒకామెకు. పైపెచ్చు ఇంకా తన భర్త నిర్దోషే అని నమ్ముతోందిట. ఏమి పాతివ్రత్యం!
ReplyDelete"ఒక్క 3 రోజులు ఆగమ్మా, అప్పుడు రేపిస్టుకు భార్యగా కాక విధవగా మారుతావు" అని ఎవరన్నా చెపితే బాగున్ను.
ఇంక మూడు రోజుల్లో ముగింపు అనుకునేలా లేదండి. ఆవిడ విడాకులు కోరుతూ అర్జీ పెట్టుకుందటగా? మరి ఆ విడాకుల కేసు హియరింగ్ కు ఆమె భర్త (నిర్భయ దోషి) కూడా కోర్టులో హాజరవాలేమో కదా? మిగిలిన దోషుల భార్యలు కూడా విడాకుల కేసు వేస్తారేమో ..... మెల్లిమెల్లిగా ...... ఒకరి తరువాత ఒకరు ..... శిక్ష అమలుకు జస్ట్ రెండు మూడు రోజుల ముందు?
Delete(2). మరొకడు క్షమాభిక్ష కోరుతూ మరోసారి విన్నపం పెట్టుకున్నాడటగా? అది తేలాలిగా? అవకాశం ఉన్న తతిమ్మా వారు కూడా అదే పని చేస్తారేమో ..... మెల్లిమెల్లిగా ..... ఒకరి తరువాత ఒకరు ...... శిక్ష అమలుకు జస్ట్ రెండు మూడు రోజుల ముందు? తరువాత మూడో సారి ప్రయత్నం కూడా జరగవచ్చేమో, ఎవరు చెప్పొచ్చారు?
(3). అంతర్జాతీయ న్యాయస్ధానంలో (దేశాల మధ్య వివాదాలకు సంబంధించిన కోర్టు) అప్పీలు వెయ్యడం వింతగానే ఉంది కానీ మన దగ్గరే NHRC లో కూడా పిటిషన్ వేశాడటగా దోషుల లాయరు? ఘటికుడండీ అనాలా?
ఎవరి ప్రాణం వారికి తీపి.
చిరంజీవి “అభిలాష” సినిమా గుర్తొస్తోంది.
అభిలాషలో చిరంజీవికి, ఈ కేసులో ముండాకోరు లాయర్ కి పోలిక లేదండీ.
Deleteకోర్టు ఖర్చులకు బాధిత కుటుంబానికి ఎంత అవుతూ ఉందో తెలియదు కాని ఆ డబ్బులు ఏ బీహార్ రౌడీకో ఇచ్చి ఉంటే ఈపాటికి వాళ్ళని వేసేసి తలలు కూడా తెచ్చి ఇచ్ఛేవాడు. "వ్యవస్థని నమ్ముకునేకంటే వాళ్ళని నమ్ముకోవడమే ఉత్తమం" అనేలా ఉంది.
ReplyDeleteFunny video
సూర్య గారు. ఆధ్యాత్మిక వైరస్ ఆవేదన చదివారా. పాపం ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో దిగులు పడుతోంది.
ReplyDeleteఆధ్యాత్మిక వైరస్ ఆవేదనా? అస్సలు అర్థమైతే కరోనా మీద ఒట్టు.
Deleteమా సిద్ధాంతిగారు కరోనాకి గృహాలకి ముడి పెడతారనుకుంటే కరోనాకి దైవత్వాన్ని ఇచ్చేసారు. పైపెచ్చు అది కాటేసినోళ్లంతా దారితప్పిన వారేనంట. ఏం విజ్ఞానం ఏం విజ్ఞానం!☺️
నిర్భయ కేసు దోషులకు ఉరి శిక్ష అమలు ..... మొత్తానికి ముగిసింది. "నిర్భయ" తల్లి పోరాట ఫలితం.
ReplyDeleteuri Siksha amalu