నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం
నలుగురు పిశాచాలకు ఉరి.. 2650 రోజులకు నిర్భయకు న్యాయం |
తీహార్ జైలు నెంబరు 3లో.. కోర్టు పేర్కొన్నట్లుగా నిర్భయ దోషులు నలుగురినీ ఉరి తీసినట్లుగా జైలు అధికారులు వెల్లడించారు. ఉరిశిక్ష అమలు చేసే సమయంలో మొత్తం పదిహేడు మంది సిబ్బంది అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. కదులుతున్న బస్సులో పారామెడికల్ విద్యార్థిని నిర్భయను అత్యంత అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసిన ఉదంతంలో దోషులైన ముకేశ్ సింగ్ (32).. పవన్ గుప్తా (25).. వినయ్ శర్మ (26).. అక్షయ్ కుమార్ సింగ్ (31) లను తీహార్ జైల్లో ఉరి తీశారు. జిల్లా మెజిస్ట్రేట్ సమక్షంలో ఈ ఉరిని పూర్తి చేశారు.
ఉరిశిక్ష అమలుకు ఒక రోజు ముందు అంటే.. గురువారం కూడా కోర్టు తమకు విధించిన శిక్ష నుంచి తప్పించుకోవటానికి చేసిన ప్రయత్నాల్ని కోర్టు ఏకీభవించలేదు. తమకు విధించిన ఉరిశిక్షను అమలు చేస్తున్న పటియాలా హౌస్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ.. నలుగురు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా వారికి ఎదురుదెబ్బ తగిలింది. పటియాలా హౌస్ కోర్టు తీర్పును సమర్థిస్తూ జస్టిస్ మన్మోహన్.. జస్టిస్ సంజీవ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తీర్పును వెల్లడించారు.
గతంలో కోర్టు విధించిన ఉరిశిక్షను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పారు. దీంతో.. నిర్భయ దోషులు అర్థరాత్రి దాటిన తర్వాత కూడా మళ్లీ సుప్రీం తలుపు తట్టారు. ఉరిశిక్ష అమలు కాకుండా స్టే ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో కూడా విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ భానుమతి.. జస్టిస్ అశోక్ భూషణ్.. జస్టిస్ బోపన్నలతో కూడి ధర్మాసనం సదరు స్టే పిటిషన్ ను కొట్టి వేసింది.
గతంలో కోర్టు ఇచ్చిన రీతిలో ఉరిని యథాతధంగా అమలు చేయాలని తీర్పు ఇవ్వటంతో.. ఈ రోజు తెల్లవారుజామున వారికి ఉరిశిక్షను అమలు చేశారు. ఉరి తీయటానికి ముందు నలుగురికి వైద్య పరీక్షలు నిర్వహించారు. వారి ఆరోగ్యం బాగుందని వైద్యులు వెల్లడించారు. దీంతో వారికి ఉరిశిక్ష అమలు చేశారు. ఇదిలా ఉండగా.. శిక్ష అమలు సమయంలో తీహార్ జైలు బయట పెద్ద సంఖ్యలు ప్రజలు గుమిగూడి ఉండటం గమనార్హం. దక్షిణాసియాలో అతి పెద్దదైన తీహార్ జైల్లో అత్యంత దారుణమైన నేరానికి పాల్పడిన నలుగురు దోషులకు ఒకేసారి ఉరిశిక్షను అమలు చేశారు. ఈ విధంగా ఒక కేసుకు సంబంధించి దోషులందరికి ఒకేసారి ఉరిశిక్షను అమలు చేయటం ఇదే మొదటిసారిగా చెబుతున్నారు.
నిర్భయ ఆత్మకు ఎట్టకేలకు సాంత్వన కలుగుతుంది. ఆమె తల్లిదండ్రులకు ఊరట లభిస్తుంది.
ReplyDeleteఆ నరరూప రాక్షసులకు శిక్ష పడనీకుండా చివరివరకు అడ్డుపడిన పుండాకోరు లాయర్లకు, మానవ హక్కుల మృగాలకు కూడా తగిన శిక్ష పడాలి. అప్పుడే సంపూర్ణ శాంతి దొరుకుతుంది నిర్భయకు.
The necessary changes should be brought in to complete the justice process in quick time.
Capital punishment only for rarest of rare crimes policy should be revisited.
Punishment should be commensurate with the crime committed and should be swiftly administered.
This comment has been removed by the author.
Deleteబిడ్డలను కొడుకులను సమానంగా పెంచే స్థాయికి తల్లితండ్రులు ఎదగాలి. స్త్రీలు వస్తువులు కాదని, వాళ్ళకీ వ్యక్తిత్వం ఉంటుందని సమాజం గుర్తించాలి. మహిళలు పతివ్రతలని లేదా కులటలని రెండే రెండు పరస్పర విపరీత విరుద్ధ ధోరణులు కాక every inch of the entire broad spectrumగా ఉంటారని అందరూ (ముఖ్యంగా మగపుంగవులు) గుర్తు ఎరిగె రోజులు రావాలి. మనిషిని మనిషిగా గుర్తించలేని రాజ్యాలు, మతాలు, సంప్రదాయాలు, పొస్తకాలు, పెద్దరికాలు కడతేరాలి. ఆకాశంలో సగం అంటే చీకటిలోనే కాదు, వెలుతురులోనూ సగం కావాలి.
Deleteఅప్పుడే నిర్భయకు శాంతి, భయానికి విముక్తి, నిరాశ్రయులకు & నిర్భాగ్యులకు వేకువ. ఆ రోజు ఎప్పుడుస్తోందో ఏమో, వో సుబహా కభీ తో ఆయేగీ.