బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మరో మూడు రోజులు ఆగితే హైదరాబాద్ ఎలా ఉంటుందో?


మరో మూడు రోజులు ఆగితే హైదరాబాద్ ఎలా ఉంటుందో?

Coronavirus-in-Hyderabad-Telangana
మరో మూడు రోజులు ఆగితే హైదరాబాద్ ఎలా ఉంటుందో?
ఎలాంటి హైదరాబాద్ ఎలా మారిపోయింది? కొన్ని దశాబ్దాలుగా నిద్రను మరిచిన నగరం ఇప్పుడు పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా విశ్రమిస్తోంది. విశాలమైన రోడ్లు బోసిపోతుంటే.. విపరీతమైన రద్దీతో ఉండే దిల్ సుఖ్ నగర్.. కుకట్ పల్లి.. అమీర్ పేట.. ఐటీ కారిడార్.. ఇలా చెప్పుకుంటూ పోతే గ్రేటర్ పరిధిలో ఎన్నో ప్రాంతాలు ఇప్పుడు వెలవెలపోతున్నాయి. కరోనా పుణ్యమా అని.. హైదరాబాద్ మహానగరాన్ని ఇలా కూడా చూసి రావాల్సి వస్తోందని బోరుమనేవారు లేకపోలేదు. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు లాంటి రద్దీ ప్రాంతంలో రోడ్డు మీదకు నెమలి నడుచుకుంటూ వచ్చిందంటే.. నగరం ఎలా మారిందో ఇట్టే అర్థమైపోతుంది.

అంతేనా.. లాక్ డౌన్ వేళ హైదరాబాద్ మహా నగరంలో రాత్రిళ్లు రోడ్ల మీదకు టూవీలర్ మీద బయటకు రావటం అంటే పెద్ద సాహసం కిందనే లెక్క. మీరనుకున్నట్లు పోలీసుల కారణంతో కాదు.. వీధి కుక్కల దెబ్బకు వణికిపోవాల్సిందే. రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా లైట్ల కాంతులతో.. జనసంచారంతో ఉండే వీధులు వారాల తరబడి నిర్మానుష్యంగా మారిపోవటంతో రోడ్లున్ని కుక్కల మయంగా మారింది. లాక్ డౌన్ ప్రభావం ఆ మూగ జీవాల మీదా పడింది. వాటికి సరైన ఆహారం లేకపోవటంతో తీవ్రమైన అసహనంతోనూ.. ఆవేశంగానూ కనిపిస్తున్నాయి. అత్యవసర సేవల కోసం రాత్రిళ్లు టూ వీలర్ మీద వెళ్లే వారంతా హడలిపోతున్నరు. పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న దుస్థితి.

ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా



ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా

Breaking-News-America-Revealed-India-Craze
ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా
భారత్ ఎన్ని సాధించినా.... ప్రపంచం ఒప్పుకోదు. సరిగ్గా చెప్పాలంటే ఒప్పుకోవడానికి మనసు రాదు. ఇండియాను పేద దేశంగా చూపడానికి ప్రపంచ దేశాలు చేయని ప్రయత్నమే ఉండదు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ సాధిస్తున్న రికార్డులను ప్రపంచం గుర్తించకుండా ఉంచడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. వాటిలో ఒకటి... భారత్ కరోనాను ఇతర దేశాల కంటే సమర్థంగా కంట్రోల్ చేయడం వల్ల ఎక్కడ మనం గ్లోబల్ లీడర్ అవుతామో అన్న భయంతో ఐక్య రాజ్య సమితి కరోనా వల్ల భారత్ లో 40 కోట్ల మంది పేదరికంలోకి పోతారు అని ఒక నివేదిక అర్జెంటుగా బయట పెట్టింది. ఇది ఎంత చోద్యం అంటే... 200 దేశాల్లో కరోనా వస్తే భారత్ సహా ఎన్నో దేశాలు లాక్ డౌన్ పెడితే కేవలం భారత్ మాత్రమే ఎందుకు పేదరికంలోకి పోతుంది? ఈ నష్టం అందరికీ జరుగుతుంది కదా? మరి ఎందుకు ఈ రిపోర్టు అంటే... భారత్ ను అప్రతిష్ట పాలు చేయడం ద్వారా మన సమర్థతను కప్పిపుచ్చే ప్రయత్నం. చేతిని అడ్డుపెట్టి సూర్యడిని ఆపగలమా? సాధ్యం కాదు. ఇది కూడా అంతే.

Lockdown Creates Dramatic impact on Air Quality | లాక్ డౌన్ తో ప్రకృతికి మంచి రోజులు వచ్చాయా?


Lockdown Creates Dramatic impact on Air Quality | లాక్ డౌన్ తో ప్రకృతికి మంచి రోజులు వచ్చాయా?

lockdown,lockdown extend,impact of lockdown on nature,air quality,corona lockdown,environmental impact of lockdown, cm kcr on lockdown,lockdown updates from delhi,lockdown breakdown, lockdown terms, lockdown in india,lockdown modi,environmental impact of coronavirus pandemic, lockdown rules,changes created by the coronavirus,lockdown to extend,changes created by coronavirus, implement lockdown rules @ vizag,coronavirus

ప్రాణాంతక వైరస్ కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!



ప్రాణాంతక వైరస్ కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!

China-Virus-Corona-Effect-on-American-States
ప్రాణాంతక వైరస్ కరోనా కల్లోలం..అమెరికా దుస్థితి ఇంకెక్కడా కనిపించదేమో!
ప్రాణాంతక వైరస్ కరోనాతో ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు వణికిపోతున్నాయి. అసలు కరోనా సోకని కరోనా పేరు వింటే భయపడని దేశమంటూ ఇప్పుడు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇక ప్రపంచంలో ఏ మూలఏ దేశంలో విపత్తు ఎదురైనా... అండగా తానున్నానంటూ రంగంలోకి దిగే అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి అయితే మరింత దారుణంగా ఉందనే చెప్పాలి. అసలు కరోనాతో అత్యంత ఎక్కువ నష్టం నమోదైన దేశం అమెరికా అని కూడా చెప్పక తప్పదు. ఎందుకంటే... కరోనా పుట్టిన చైనాలో కంటే కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అమెరికాలోనే ఎక్కువ. మరణాల సంఖ్య కూడా అమెరికాలోనే అధికం. ఇంకా చెప్పాలంటే... అమెరికా వాణిజ్య నగరం న్యూయార్క్ లో నమోదైన పాజిటివ్ కేసులు మరణాలు పరిశీలిస్తే... కరోనాతో అమెరికాకు జరిగినంత నష్టం మరే దేశానికి కూడా జరగలేదనే చెప్పదు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలో కొనసాగుతున్న కరోనా విజృంభణ దాని ప్రభావంతో జరుగుతున్న నష్టం కరోనాతో అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఫలితంగా మారిపోతున్న మానవ సంబంధాలు తెగిపోతున్న భవ బంధాలు... ఇలా ప్రతి అంశం కూడా ఆసక్తికరంగా మారిందనే చెప్పాలి.

కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు


కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు

China-virus-Corona-lockdowns-have-changed-the-way-Earth-moves
కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఆ వైరస్ ప్రభావంతో మానవాళి ప్రపంచం ఇంటికే పరిమితమైంది. ప్రజల కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రోడ్లన్నీ బోసిపోయాయి. మార్కెట్ ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి. ఈ నేపథ్యంలో భూగోళమంతా ప్రశాంతంగా ఉంది. ప్రపంచమంతా లాక్ డౌన్ చేయబడింది. దీంతో ఇప్పుడు భూ - జల - రోడ్డు మార్గాలు అన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైలు - రోడ్డు - జల మార్గాలు స్తంభించిపోయాయి. ఈ కరోనా వైరస్ మానవాళికి ఎంతో నష్టం చేకూరుస్తున్నా.. భూగోళానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కాలుష్యాలు తగ్గిపోయాయి. ఈ సందర్భంగా భూతాపం తగ్గింది. ఈ క్రమంలో భూమి కంపనాల తీవ్రతలో గణనీయంగా తగ్గాయంట.

అయితే ఈ కరోనా వైరస్ మూలంగా భూగోళంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా భూ గ్రహం నిశ్చల స్థితిలో ఉందని ఆ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిణామాలు అంతా లాక్ డౌన్ వలన వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీలో భూ విజ్ఞాన - భూకంప శాస్త్రవేత్త థామస్ లెకోక్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో బెల్జియంలో కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ పకడ్బందీగా ఆ దేశంలో అమలు చేయడంతో ఆ దేశ వాతావరణ పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయంట. ఇదే సమయంలో ఈ దేశ రాజధాని బ్రస్సెల్స్ ప్రాంతంలో భూకంప శబ్ధంలో 30 నుంచి 50 శాతం తగ్గాయని సీఎన్ ఎన్ వెల్లడించింది.

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!


ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!
Study-on-China-Virus-Corona-Spread-in-india
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య వేలతో ఆగదు 13 లక్షలకు చేరుతుందట!
ఇండియాలో కరోనా వైరస్ చాపకింద నీరులా వ్యాప్తి చెందుతుందని.. దాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలం అవుతుందంటూ ప్రముఖ మీడియా సంస్థ ది గార్డియన్ తన గ్రౌండ్ విశ్లేషణలో పేర్కొంది. ది గార్డియన్ చెబుతున్న కథనం ప్రస్తుతం జనాలను భయకంపితులను చేస్తోంది. ఇతర దేశాలతో పోల్చితే మన దేశం కరోనా వైరస్ ను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వం సిద్దంగా లేదని కనీసం కరోనా వైరస్ నిర్థారించే కిట్ లు కూడా ఇండియాలో అధికంగా లేవు. ఇప్పటి వరకు కేవలం 50 వేల మందికి మాత్రమే కరోనా పరీక్షలను ఇండియాలో నిర్వహించారు.

ప్రస్తుతం పుణెలోని మై ల్యాబ్ సంస్థ మాత్రమే కరోనా టెస్టు కిట్ లను తయారు చేస్తోంది. ఆ ఒక్క సంస్థ తయారు చేసే కరోనా టెస్టు కిట్ లు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏమాత్రం సరి పోవు. ఇక భారత్ లో కరోనా టెస్టుకు కేవలం 52 ల్యాబ్స్ కు మాత్రమే అనుమతించింది. దేశంలో ఉన్న జనాభాకు ఆ ల్యాబ్స్ సంఖ్యకు ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను వైరస్ వ్యాప్తి చెందుతున్న స్పీడ్ ను చూస్తుంటే మే నాటికి ఇండియాలో 13 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు కరోనా టెస్టింగ్ కిట్స్ ను ఎక్కువ మొతాదులో తయారు చేయాల్సిన అవసరం ఉందని ది గార్డియన్ కథనంలో పేర్కొన్నారు.

దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా


దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా

9-UN-employees-in-Geneva-test-positive-for-china-Virus-corona
దారుణం : 9 మంది ఐక్యరాజ్య సమితి అధికారులకు కరోనా
వారిని వీరిని అనే తేడా లేకుండా ప్రపంచ దేశాల్లో అందరిని కూడా కరోనా వైరస్ ముప్పుతిప్పలు పెడుతోంది. కరోనా వైరస్ కారణంగా పలు ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను అమలు చేస్తున్నా ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి అధికారులు అన్ని దేశాలకు సంబంధించిన విషయాలను సేకరించడం.. అవసరం అయిన సాయంను అందించడం చేస్తున్నారు. ఈ సమయంలో ఐక్యరాజ్య సమితి చాలా కీలకంగా వ్యవహరిస్తుందని ఇటీవలే అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి కథనంను రాయడం జరిగింది.

ఇంతలోనే జెనీవాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయ ఉద్యోగులకు 9 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందట. ఈ విషయంను ఐక్యరాజ్య సమితి ముఖ్య అధికారి అయిన అలెసాండ్రా వెలుసి తెలియజేశారు. ప్రస్తుతం వారి వివరాలను వెళ్లడి చేయలేం. కాని వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నాం. వారు త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం అంటూ ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు.

Related Posts Plugin for WordPress, Blogger...