బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా



ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా

Breaking-News-America-Revealed-India-Craze
ఇండియా క్రేజు ఏంటో చెప్పిన అమెరికా
భారత్ ఎన్ని సాధించినా.... ప్రపంచం ఒప్పుకోదు. సరిగ్గా చెప్పాలంటే ఒప్పుకోవడానికి మనసు రాదు. ఇండియాను పేద దేశంగా చూపడానికి ప్రపంచ దేశాలు చేయని ప్రయత్నమే ఉండదు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో భారత్ సాధిస్తున్న రికార్డులను ప్రపంచం గుర్తించకుండా ఉంచడానికి విశ్వప్రయత్నం చేస్తోంది. వాటిలో ఒకటి... భారత్ కరోనాను ఇతర దేశాల కంటే సమర్థంగా కంట్రోల్ చేయడం వల్ల ఎక్కడ మనం గ్లోబల్ లీడర్ అవుతామో అన్న భయంతో ఐక్య రాజ్య సమితి కరోనా వల్ల భారత్ లో 40 కోట్ల మంది పేదరికంలోకి పోతారు అని ఒక నివేదిక అర్జెంటుగా బయట పెట్టింది. ఇది ఎంత చోద్యం అంటే... 200 దేశాల్లో కరోనా వస్తే భారత్ సహా ఎన్నో దేశాలు లాక్ డౌన్ పెడితే కేవలం భారత్ మాత్రమే ఎందుకు పేదరికంలోకి పోతుంది? ఈ నష్టం అందరికీ జరుగుతుంది కదా? మరి ఎందుకు ఈ రిపోర్టు అంటే... భారత్ ను అప్రతిష్ట పాలు చేయడం ద్వారా మన సమర్థతను కప్పిపుచ్చే ప్రయత్నం. చేతిని అడ్డుపెట్టి సూర్యడిని ఆపగలమా? సాధ్యం కాదు. ఇది కూడా అంతే.



ఎవరు అవునన్నా కాదన్నా భారత్ దూసుకుపోతోంది. కోటి పది కోట్ల జనాభాను కంట్రోల్ చేయలేక ప్రపంచ దేశాలో కరోనాతో విలవిలలాడుతుంటే... 130 కోట్ల జనాభాను ఒక్క తాటిపైకి తెచ్చిన కరోనా పై యుద్ధం ప్రకటించడం ద్వారా తొలి అతిపెద్ద విజయం సాధించారు మోదీ. అనంతరం మన దేశానికి సరిపడా మందులు తయారుచేసుకోవడమే కాకుండా కోవిడ్ 19 పై పోరుకు మన దేశాన్ని అభ్యర్థించేంత పెద్ద సంఖ్యలో మనం ఆ మందులు తయారుచేస్తున్నాం. అమెరికాతో పాటు ఇపుడు అనేక తోపు దేశాలకు ప్రాణభిక్ష పెడుతున్న మనదేశం ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ గ్రాఫ్ రకరకాలుగా బయటపడుతూనే ఉంది. తాజాగా చరిత్రలో మొదటి అమెరికా అధ్యక్ష భవనం అమెరికాకు చెందిన సంస్థలు వ్యక్తులు ప్రముఖులను కాకుండా మూడే మూడు ఇతర దేశాల ట్విట్టరు అక్కౌంట్లను ఫాలో అవుతోంది. ఆ మూడూ మనవే. ఒకటి ప్రధాని మోడీ వ్యక్తిగత అక్కౌంట్. రెండోదీ పీఎంవో అక్కౌంట్. మూడోది రాష్ట్రపతి అక్కౌంట్. ఇది తాజాగా జరిగిన మార్పు.

ఉత్తినే మనల్ని తీసిపడేసే స్థాయి నుంచి మన మీద ఇతర దేశాలు ఆధారపడే రోజులు వచ్చేశాయి. ప్రపంచం భ్రమలు మెల్లగా తొలగుతున్నాయి. ఇండియాను వేయాల్సింది అభివృద్ది చెందుతున్న దేశాల జాబితాలో కాదు. సమర్థవంత దేశాల జాబితాలో వేయాలి. అదే దారిలో ఉంది ఇండియా. 50 వేల కంటే తక్కువ కేసులతో ఇండియా కరోనాపై విజయం సాధిస్తే ఇక ప్రపంచం పై మన ముద్ర వేసినట్టే అనుకోవాలి.

2 comments:

  1. ఈ మాటలు మన సిక్కులరిస్ట్ మేధావులు,ఎర్రవారికి నచ్చటం లేదండి

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...