బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు


కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు

China-virus-Corona-lockdowns-have-changed-the-way-Earth-moves
కరోనా వైరస్ తో భూగోళంలో అనూహ్య మార్పులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభించింది. ఆ వైరస్ ప్రభావంతో మానవాళి ప్రపంచం ఇంటికే పరిమితమైంది. ప్రజల కార్యకలాపాలన్నీ ఆగిపోయాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. రోడ్లన్నీ బోసిపోయాయి. మార్కెట్ ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి. ఈ నేపథ్యంలో భూగోళమంతా ప్రశాంతంగా ఉంది. ప్రపంచమంతా లాక్ డౌన్ చేయబడింది. దీంతో ఇప్పుడు భూ - జల - రోడ్డు మార్గాలు అన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో రైలు - రోడ్డు - జల మార్గాలు స్తంభించిపోయాయి. ఈ కరోనా వైరస్ మానవాళికి ఎంతో నష్టం చేకూరుస్తున్నా.. భూగోళానికి మాత్రం ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల కాలుష్యాలు తగ్గిపోయాయి. ఈ సందర్భంగా భూతాపం తగ్గింది. ఈ క్రమంలో భూమి కంపనాల తీవ్రతలో గణనీయంగా తగ్గాయంట.

అయితే ఈ కరోనా వైరస్ మూలంగా భూగోళంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సందర్భంగా భూ గ్రహం నిశ్చల స్థితిలో ఉందని ఆ శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఈ పరిణామాలు అంతా లాక్ డౌన్ వలన వచ్చాయని పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని బెల్జియంలోని రాయల్ అబ్జర్వేటరీలో భూ విజ్ఞాన - భూకంప శాస్త్రవేత్త థామస్ లెకోక్ తెలిపారు. కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి పలు దేశాల్లో లాక్ డౌన్ ప్రకటించారు. అయితే ఇదే సమయంలో బెల్జియంలో కూడా లాక్ డౌన్ ప్రకటించింది. ఈ లాక్ డౌన్ పకడ్బందీగా ఆ దేశంలో అమలు చేయడంతో ఆ దేశ వాతావరణ పరిస్థితిలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయంట. ఇదే సమయంలో ఈ దేశ రాజధాని బ్రస్సెల్స్ ప్రాంతంలో భూకంప శబ్ధంలో 30 నుంచి 50 శాతం తగ్గాయని సీఎన్ ఎన్ వెల్లడించింది.


ఈ లాక్ డౌన్ సందర్భంగా రోడ్లన్నీ వెలవెలబోతున్నాయి. పరిశ్రమలన్నీ మూతపడడంతో ఎలాంటి శబ్ద కాలుష్యం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ సందర్భంగా ఆ దేశంలో ఎలాంటి చిన్న శబ్ధానైనా గుర్తించగలుతున్నారని ఆ మీడియా సంస్థ తెలిపింది. అతి చిన్న ప్రకంపనాలను కూడా గుర్తిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని ప్రభావంతోనే తక్కువ శబ్ధంతో కూడిన సిగ్నల్ పొందుతున్నట్లు ఆ దేశ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అతి చిన్న శబ్దాన్ని వినగలుగుతున్నట్లు ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా వివరిస్తున్నారు. ఇలాంటి కంపనాల తీవ్రత తగ్గడంతో లాస్ ఏంజిల్స్ - వెస్ట్ లండన్ - యూకేలోను శాస్త్రవేత్తలు గమనించినట్లు తెలిపారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...