బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మీ దగ్గర పాతబ్లాగులు ఉన్నాయా?

ఈమధ్య గూగుల్ సర్చ్ లో వెతుకుతున్నప్పుడు కొన్ని ఓల్డ్ బ్లాగులు కనిపించాలి. వాటిని చదువుతుంటే చాలా ఆహ్లాదంగా ఫీలవ్వడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు వస్తున్న బ్లాగుల్లో చాలా వరకూ బోరు కొట్టించేవే! బలమైన సబ్జెక్ట్ ఏదీ కనిపించడం లేదు, సరికదా వాటి దరిదాపులకు కూడా పోబుద్ధి కావడం లేదు. బ్లాగులు చదవాలన్న ఇంట్రెస్ట్ క్రమేపీ తగ్గిపోతుంది. మన తెలుగులో మంచి,మంచి బ్లాగులు రావాలి. వచ్చిన కొంతమంది కామెంటేటర్లు బ్రతకనివ్వడం లేదు. ఇదంతా దృష్టిలో పెట్టుకుని బాగా పాతబడిపోయిన మంచి బ్లాగులు అన్నీ కలిపి ఒక లిస్ట్ గా ఇస్తే చదువుకోవడానికి వీలుగా బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఓల్డ్ బ్లాగులను సేకరించడం జరుగుతుంది. దయచేసి మీ దృష్టిలో, మీకు తెలిసిన ఓల్డ్ బ్లాగులుంటే వాటి లింక్ లను క్రింది కామెంట్ బాక్స్ లో ఇవ్వవల్సిందిగా కోరుచున్నాను.

మహారాష్ట్ర - హర్యానా ఎన్నికలతో జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే!

No-Hopes-On-Jamili-Elections-After-Haryana-Assembly-Elections-Blogvedika-News
జమిలి ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్టే! : 2019 ఎలక్షన్లలో మోడీ ప్రభుత్వం బంపర్ మెజారిటీతో అధికారంలోకి రాగానే.. మూడేళ్లలోనే ఎన్నికలు ఉంటాయంటూ ఒక ప్రచారమ మొదలైంది. దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ - లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు  నిర్వహించాలని బి‌జే‌పి పార్టీ వాళ్లు ముచ్చటపడుతూ వచ్చారు. దీనికి జమిలి ఎన్నికలంటూ పేరు కూడా పెట్టారు. ప్రత్యేకించి ప్రధాని మోడీ-హోమ్ మంత్రి అమిత్ షాలకు ఆ ఆసక్తి చాలా ఉందని స్పష్టం అయ్యింది. అయితే దీంతో అవిగో.. ఇవిగో.. ఎన్నికలంటూ హడావుడి మొదలైంది. ఏపీలో కూడా ప్రతిపక్ష పార్టీ వాళ్లు మూడేళ్లలో ఎన్నికలు వచ్చేస్తాయంటూ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే కొన్నాళ్లుగా అందుకు సంబంధించి హడావుడి లేదు. మోడీ-అమిత్ షా ద్వయం కూడా అందుకు సంబంధించి మంత్రాంగం సాగిస్తున్న దాఖలాలు లేవు. ఆ సంగతలా ఉంటే.. మహారాష్ట్ర - హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తీరును గమనించాకా.. ఇప్పట్లో మోడీ ప్రభుత్వం ఎన్నికలంటూ హడావుడి చేసే అవకాశాలు తగ్గిపోయాయి.

Google Adsense Alternatives 2019-టాప్ 10 ఉత్తమ AD NETWORK సైట్లు

Google Adsense Alternatives 2019-టాప్ 10 ఉత్తమ AD NETWORK సైట్లు

గూగుల్ యాడ్ సెన్స్ అకౌంట్ లేని వారికోసం, గూగుల్ తో సమానమైన ఇతర నెంబర్ వన్ AD Network  సైట్ల లిస్ట్ మీకోసం. వివరాలకు క్రింది లింక్ ద్వారా All Techbook బ్లాగు చూడండి.

Top 10 Best Google Adsense Alternatives 2019

*ప్రేమను జయించిన న్యాయం* | * Justice conquered by love *

justice-conquered-by-love

* Justice conquered by love *
🔸 భారతదేశాన్ని పాలించిన మొగల్ పాదుషాల లో జహంగీర్ తన న్యాయ పాలన వల్ల గొప్ప ఖ్యాతి గడించాడు.
🔸 న్యాయం విషయంలో తన ప్రియాతి ప్రియమైన భార్య రాణి నూర్జహాన్ ను కూడా క్షమించలేదు.
🔸 ఆ గాధ మరుపు రానిది ప్రఖ్యాతి గాంచింది.

1. ఒకసారి రాణి నూర్జహాన్ పచార్లు చేస్తూ ఉంది సాధారణంగా చుట్టుప్రక్కల ఏ మగవాడూ సంచరించకుండా ఏర్పాటు ఉంటుంది.
2. అదే సమయంలో ఒక చాకలివాడు అనుకోకుండా అటు వైపు రావడం జరిగింది.
3. అతని దృష్టి పచార్లు చేస్తున్న రాణి పై పడింది. రాణి కూడా అతన్ని చూసింది.
4. పరపురుషుని దృష్టిలో తాను పడ్డందుకు ఆమెకు ఎంతో సిగ్గు, కోపం కలిగాయి.
5. వెనకా ముందు ఆలోచించకుండా బాణం తీసుకుని అతని పైకి వదిలింది.
6. చాకలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
7. చాకలి వారసులు రాణి నూర్జహాన్ పై హత్యారోపణ చేశారు. కేసు కోర్టుకు వెళ్లింది, పరిశోధన జరిగింది. న్యాయ విచారణ ప్రారంభమైంది.
8. నూర్జహాన్ నిజాన్ని దాచలేదు. నేరాన్ని ఒప్పుకుంది. అతన్ని బాణంతో కూల్చింది తానే అని చెప్పింది.
*9. రాజు, న్యాయాధిపతి అయిన జహంగీర్, నూర్జహాన్ కు ఉరిశిక్ష  విధించాడు.*
10. రాణి నూర్జహాన్ను  మామూలు ఖైదీ లాగా బంధించి చెరసాలకు తీసుకుని వెళ్లారు.
11. హత్య నేరాలు చేసిన వారికి లభించే భోజన పానీయాలే ఆమెకు ఏర్పాటు చేయబడ్డాయి.
12. జహంగీర్ ఇచ్చిన ఈ తీర్పు రాజధానిలో కలవరం సృష్టించింది.
13. ప్రజలు రాణి నూర్జహాన్ ను  శిక్ష నుండి తప్పించడానికి ఉపాయాలు ఆలోచించసాగారు.
14. పాదుషాకు సిఫార్సులు చేశారు.
15. కానీ పాదుషా తన తీర్పును మార్చటానికి సిద్ధం కాలేదు.
16. చాకలి వారసులు తాము కోరినంత రక్త పరిహారం తీసుకుని "ప్రాణానికి ప్రాణం" అనే వాదనను విడనాడవలెను అని ప్రజలు నచ్చజెప్ప ప్రయత్నించారు.
17. పాదుషా తీర్పుకు చాకలి కుటుంబీకులు కూడా చాలా ప్రభావితులయ్యారు.
18. రక్త పరిహారం గురించి వారికి నచ్చ చెప్పటం జరిగింది.
19. చివరకు వారు రాణి నూర్జహాన్ ను క్షమించడానికి సంసిద్ధులయ్యారు.
20. వారు క్షమాపణ పత్రం రాసి పాదుషాకు సమర్పించారు.
21. అప్పటికిగాని రాజు తన తీర్పును మార్చుకోలేదు. మహారాణి ప్రాణాలు దక్కాయి.

నూర్జహాన్ అంటే జహంగీర్ కు ఎంత ప్రేమో క్షమాభిక్ష తరువాత ఆయన ఆమెతో అన్న మాటలు వ్యక్తం చేస్తాయి.

*"రాణి! నీవు మరణించి ఉంటే నేను మాత్రం జీవించి ఉండేవాణా?"*

Related Posts Plugin for WordPress, Blogger...