బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

China-Coronavirus-Cases-In-India-Reach
దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

దేశవ్యాప్తంగా హై అలెర్ట్: భారత్ లో 107కరోనా కేసులు..

ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ భారత్ లోనూ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకు కరోనా వైరస్ వేగంగా పెరుగుతూ పోతోంది.

ఇప్పటివరకు దేశంలో 107 కేసులు నమోదైనట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 12 కొత్త కేసులు పెరిగాయి. కేరళలో ఇప్పటివరకు 22 యూపీలో 11 హర్యాణాలో 14 కేసులు ధ్రువీకరించారు. వీరంతా విదేశీయులేనని కేంద్రం తెలిపింది.



కొచ్చిన ఎయిర్ పోర్టులో ఓ బ్రిటన్ పౌరుడికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. అతడితోపాటు వచ్చిన 19మందిని వైద్యపరీక్షల కోసం తరలించారు. కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. కోవిడ్ బాధితుల్లో 17మంది విదేశీయులు కాగా.. ఇద్దరు మృతి చెందారు. 10 మంది కోలుకున్నారు.

భారత్ లో రెండో దశ మొదలైనట్టు ప్రకటించిన కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన సూచనలు ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటికి సెలవులు ఇచ్చేశాయి. శానిటైజర్లు మాస్కులను అందుబాటులో ఉంచాయి.

16 comments:

  1. కేంద్ర ప్రభుత్వం కరోనా జాతీయ విపత్తు అంటుంది. ఆంధ్రా దొరతనం ముందు మా ఎన్నికలు ముఖ్యం అంటోంది. పేరాసెటమాల్ చాలని సైంటిస్ట్ చెప్పినా ఎందుకు ఈకేంద్రమూ ఈ ప్రపంచమూ గడబిడ చేస్తున్నారూ అని. నాచబానా కుట్రలను ప్రపంచం నమ్మేస్తున్నదా? ఏంగోలో ఏమిటో మా ఎన్నికలూ పెదవులూ కన్నా జనం ముఖ్యమా అని కోర్టే చెప్పాలి మరి.

    ReplyDelete
    Replies
    1. ఇప్పటికే జాతీయ విపత్తు ప్రకటించిన ఫ్రెంచ్ ప్రభుత్వం భోజన హోటళ్లు మూసింది కానీ నిన్న ఆదివారం మొదటి విడత మున్సిపోల్స్ నిర్వహించింది, రెండో దఫా ఎన్నికలు వచ్చే ఆదివారం. ట్రంప్ ఎమర్జన్సీ విధించిన తరువాత కూడా అమెరికాలో రేపటి ప్రైమరీ యథాతథం.

      కరోనా నేపథ్యంలో సిరియా ఎన్నికలు ఏడాది వాయిదా వేశారన్న వార్త వచ్చింది. అక్కడ "ఎన్నికలు" ఉన్నాయని తెలియడమే ఆశ్చర్యం!.

      కోర్టులు నిర్ణయాలు సరైనవా కావా అన్న ప్రశ్నను తేల్చలేవు. సదరు నిర్ణయాలు తీసుకునే హక్కు ఆయా సంస్థకు ఉందా అన్నదే కోర్టు ముందు ప్రశ్న.

      Delete
    2. స్వాగతం జై గారూ, అమెరికా వంటి దేశాల క్రమశిక్షణ, ఎన్నికలు వాతావరణం వంటివి మనకు చాలా భిన్నంగా ఉంటా యనుకుంటాను. కోర్టులు ఏమితేలుస్తాయ ఒక యెత్తు అయితె మనవాళ్ళు ఎలా అన్వయం చేసుకుంటారూ అన్నది మరొక యెత్తు.

      ఎన్నికల సంఘం రాష్ట్రప్రభుత్వం వారి అదుపులో ఉండాలా సలహా మేరకే నడవాలా వంటివి స్వస్తిశ్రీ కోర్టు వారు మన ముఖ్యమంత్రి గారికే అనుకూలంగా చెప్పకపోతే పరిస్థితి రాజ్యాంగ సవరణలకు కోరేదాకా వస్తుందేమో. చూద్దాం.

      Delete
    3. https://indiankanoon.org/doc/1736371/

      గురువు గారూ, కుదిరితే నిమ్మగడ్డ వారు నిన్న ఉటంకించిన కిషన్ సింగ్ తోమర్ కేసు తీర్పు చదవండి

      ఎన్నికల సంఘానికి పార్టీలకు మధ్య రగడ ఎప్పుడూ ఉండేదే. 2000 ఫ్లోరీడా చాడ్ వివాదం తెలిసిందే. పోయిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏబీ వెంకటేశ్వర రావును నిఘా విభాగం నుండి తొలగిస్తే ఎంత రాద్ధాంతం జరిగిందో కూడా ఫ్రెష్ మెమరీయే కదా.

      Delete
    4. ఇంటికి వెళ్ళాక చదువుతానండి. కొంపదీసి భూకంపం వచ్చి ఆలగోలబాలగోల ఐనా సరే ముందు ఎన్నికలే ముఖ్యం అన్నారా ఏమిటి?

      Delete
    5. తొందరేమీ లేదు, నిమ్మళంగా చూడండి సార్. BRS/URS చదివినట్టు నింపాదిగా చదవడం మంచిది, కుదిరితే DRC/BCP కళ్లద్దాలు పెట్టుకొని చూస్తే ఇంకా conceptual flow clarity వస్తుంది. అదృష్టం బాగుండి నిడివి (~ 10-12p) చిన్నదే.

      మరీ అంత తన నిర్ణయానికి ప్రతికూలంగా ఉంటే ఎన్నికల సంఘం అధికారి ఎందుకు ఉటంకిస్తాడు లెండి.

      Delete
    6. నాకంత సమయం ఉండదండీ. అప్పుడే పదవుతోంది. ఇంకా చాలా పనులున్నాయి. రాజకీయాలు నా ప్రయారిటీ స్టడీ అంశం కాదు. ఐనా మీరు సారాంశం చెప్పారు కదా. చాలు.

      Delete
    7. Updates (3/17/2020):

      1. ఈ రోజు జరగాల్సిన ఒహాయో ప్రైమరీ వాయిదా వేసిన గవర్నర్. అతడు రిపబ్లికన్ కావడం, పైగా ఎన్నికలు వాయిదా చేయవద్దని కోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘించడం మూలాన రాజకీయ దుమారం అవకాశాలు.
      2. వచ్చే వారం గోవా స్థానిక ఎన్నికలు యథావిధి
      3. సర్వ దళ సమావేశ ఏకగ్రీవ సూచన మేరకు వచ్చే నెల జరగాల్సిన పశ్చిమ బాంగ్లా స్థానిక ఎన్నికలు వాయిదా

      Delete
    8. Further update (3/17):

      ఒహాయో సందిగ్ధం (సంక్షోభం) పక్కన పెడితే, మిగిలిన మూడు రాష్ట్రాలలో ప్రైమరీ యథాతథం. ప్రైమరీ ముందట నిర్ణయించిన మార్చ్ 17 తేదీ వాయిదా లేదన్న ఇలినోయ్, ఫ్లోరిడా & అరిజోనా రాష్ట్రాలు.

      Delete
  2. పురపాలక ఎన్నికలు వాయిదా వేయించడం అనేది ఎవరి కుతంత్రమో అందరికీ తెలుసు. అయితే కరోనా సాకు కోతికి కొబ్బరికాయ లాగా దొరికింది.

    పచ్చ భూతాలు పంచ భూతాలను కూడా పట్టి పీడించగలవు అని తెలుస్తుంది.

    పరిపాలన సాగనీకుండా యజ్ఞానికి రాక్షసులు లాగా ఆటంకం కలిగిస్తున్నాయి పచ్చ ఉన్మాదులు.

    ReplyDelete
    Replies
    1. పచ్చ భూతాలు పంచ భూతాలను కూడా పట్టి పీడించగలవో లేవో కాని పిచ్చిభూతాలు పంచభూతాలూ తమ వశంలో ఉన్నయన్నట్లు మాట్లాడుతున్నాయే!

      Delete
    2. హహ. పాలించే పార్టీ ఏదైనా కానివ్వండి తామేదో గో.. ప్ప యజ్ఞం చేస్తున్నట్లు ప్రతిపక్షం రాక్షసుల్లా అడ్డుపడుతున్నట్లు ఫీలవుతారు!
      ఏ దేశంలో ఏ సందర్భం లో ఎన్నికలు వాయిదా వేశారో మాట్లాడుకుంటున్నాం కానీ "ఆయా దేశాల్లో మునుపటిరోజు వరకు ఉన్న ఓటు మర్నాడు అదృశ్యమైపోవడం, ఉన్నచోట కాక ఎక్కడో మారుమూల పోలింగ్ బూత్ లో ఓటు కేటాయించబడటం, నామినేషన్లు వేయకుండా బలవంతంగా అడ్డుకునే దరిద్రం లాంటివి జరగట్లేదు కదా, మరి మనకే ఎందుకు ఈ దుస్థితి" అని మాత్రం అనుకోవట్లేదు.
      ఆయా దేశాల్లో ఎన్నికల వాతావరణానికి భారత్ లో ఎన్నికల కు చాలా తేడా ఉంది. చిన్న ఎన్నికైనా వందలకొద్దీ గుమిగూడి బాహుబలి లాంటి సీన్ సృష్టించకపోతే మనకి ఎన్నికలు జరుగుతున్నట్లు అనిపించదు. అలాంటప్పుడు కరోనా పండగ చేసుకోక ఊరుకుంటుందా.

      Delete
    3. @శ్యామలీయం:

      GKK (జీ) వేరే వారెవరినో "పచ్చ భూతాలు" అన్నారు. వ్యాఖ్యలో "పురపాలక ఎన్నికలు వాయిదా" అనుంది కనుక అది ఫలానా పార్టీ గురించేనని తెలుస్తుంది. ఆయన "పచ్చ ఉన్మాదులు" అని కూడా రాయడం వల్లన ఉద్దేశించింది ఇంకా స్పష్టంగా తేటతెల్లం అవుతుంది.

      ఆయన అభిప్రాయం మీకు రుచించకపోవోచ్చును, అది మీ ఇష్టం. అయితే వారు ఇక్కడున్న "సభికులను" అమర్యాదగా సంబోదించలేదు.

      మీ వ్యాఖ్యలో ఆ పరస్పరత కనిపించడం లేదు. మీరన్న "పిచ్చిభూతాలు" వైకాపా/సాక్షి పేపరా లేక ముందటి వ్యాఖ్య రాసిన సాటి బ్లాగరా అన్న క్లారిటీ లేదు. పైగా "మాట్లాడుతున్నాయే" అన్నారు కాబట్టి ఇక్కడ (మీకు అంగీకారం లేని) తమ అభిప్రాయం చెప్పిన వారిని అన్నట్టే అగుపిస్తుంది.

      మొదట పేర్కొన్న భావం సరయిన పక్షంలో (my fervent hope) కాస్త స్పష్టత ఇవ్వాలని మనవి. కాదు, మీరన్నది ముఖాముఖిగా ఉన్నవారినే అయితే ఇక చేయగలిగిందేమీ లేదు.

      ఒక హీరో అభిమానులు ఎగస్పార్టీ నాయకుని పోస్టర్ మీద బురద జల్లడం అనాదిగా వస్తున్న ఆచారమే కానీ "మా హీరోనన్నవు కాబట్టి నిన్నే కొడతాను" అనడం ఇటీవలి కాలంలో వచ్చిన కుసంప్రదాయం.

      My sincere apologies for any wrong point in my comment sir.

      Delete
  3. పచ్చభూతాలకు వంత పాడుతున్నవి పిచ్చి భూతాలు. కరోనా భూతాన్ని సంబరం చేసుకునే వాళ్ళను పిచ్చి భూతాలు అనాలి.

    ReplyDelete
  4. Sir మీరు చాలా సరిగ్గా చెప్పారు. అయినా నాకు పచ్చ కుల మీడియా అంటేనే అసహ్యం. జగన్ సాక్షి గొప్పదని కాదు కానీ. It was forced to fight back due to the Goebbels onslaught of yellow Media.

    ఏదో ఉపద్రవం జరిగిపోతుంది జగన్ పాలనలో అన్న పైశాచిక ప్రచారం 24 గంటలు చేస్తుంటే అలాంటి వారిని పచ్చ భూతాలు అనడం సమంజసం.

    శ్యామల రావు గారు విన్నకోట గారు ఇంకా ఎంతోమంది పచ్చ సానుభూతి పరులు అనిపిస్తుంది. It is their opinion and I respect it. నాకు వారిపై ఎంతో గౌరవం ఉంది.

    మేమే అధికారం లో ఉండాలి మాకు మా కులానికి అందరూ subservient గా ఉండాలి లేకపోతే మిమ్మల్ని నాశనం చేస్తాం అనే పచ్చ ధోరణి మీదే నా వ్యతిరేకత.

    జగన్ పాలన బాగా లేక పోతే ప్రజలు తీర్పు ఇస్తారు. ఇంకా ఏడాది కూడా పూర్తికాని ప్రభుత్వం పై ఇంత విష ప్రచారమా.

    Ap political media news బ్లాగు చూడండి. How can we not condemn it's blatant vicious propaganda.


    ReplyDelete
    Replies
    1. GKK (జీ) గారు,
      // “ శ్యామల రావు గారు విన్నకోట గారు ఇంకా ఎంతోమంది పచ్చ సానుభూతి పరులు అనిపిస్తుంది. ” //

      Issue-based గా మాట్లాడుతాను. అంత మాత్రానికే “పచ్చ సానుభూతి పరులు” అనే బిరుదివ్వనక్కర లేదండి.
      ———————-
      // “...... It is their opinion and I respect it. నాకు వారిపై ఎంతో గౌరవం ఉంది.” //
      థాంక్యూ, థాంక్యూ 🙏.
      ————————

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...