బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?


కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?

Breaking-News-China-Released-Corona-Virus-For-Trade-War
కరోనా వైరస్ ను ప్రపంచం మీదికి వదిలిన చైనా..కారణం ఇదే?
కరోనా మహమ్మారి పేరు చెప్పగానే ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఆ రంగం..ఈ రంగం అని తేడా లేకుండా కరోనా అన్ని రంగాలపై పంజా విసిరింది. ముఖ్యంగా కరోనా దెబ్బకు ఆ వైరస్ సోకిన దేశాల ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్నాయి. కరోనా దెబ్బకు చాలా దేశాల్లో ఆర్థిక మాంద్యం వచ్చే పరిస్థితులున్నాయని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ముఖ్యంగా కరోనా దెబ్బకు స్టాక్ మార్కెట్లు మునుపెన్నడూ లేని విధంగా కుప్పకూలుతూ రికార్డు స్థాయిలో నష్టాలు మూటగట్టుకుంటున్నాయి. కరోనా దెబ్బకు లాక్ డౌన్ ప్రకటించుకోవడం వల్ల గత నెల రోజుల కాలంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే కరోనా పుట్టిల్లయిన చైనా స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలి ఉంటుందని అంతా అనుకున్నారు.

కానీ ఆశ్చర్యకరంగా చైనా స్టాక్ మార్కెట్ గడచిన నెల కాలంలో + 0.3 శాతం వృద్ధి సాధించింది. మిగతా దేశాలన్నీ...-0.27 నుంచి -0.12 వరకు నష్టాల్లో మునిగితేలుతున్నాయి. కానీ కరోనా దెబ్బకు కుప్పకూలిపోవాల్సిన చైనా స్టాక్ మార్కెట్ వృద్ధి సాధించడం వెనుక చైనా ప్రభుత్వ మాస్టర్ ప్లాన్ ఉందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు అమెరికా-చైనా ట్రేడ్ వార్ నేపథ్యంలో అమెరికాను దెబ్బకొట్టేందుకు కరోనా బూచిని చైనా వాడుకుందనే అభిప్రాయాలను అమెరికన్ యూరోపియన్ ట్రేడ్ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఓ రకంగా చెప్పాలంటే కరోనా భూతాన్ని ప్రపంచం మీదికి వదిలి...ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టి తమ దేశ ఆర్థిక వ్యవస్థను లాభాల బాటలో పెట్టాలనే కుట్ర చైనా చేసిందని వదంతులు వ్యాపిస్తున్నాయి.


కరోనా పిశాచిని చూపించి కుప్పకూలిపోతోన్న తమ ఆర్థిక వ్యవస్థను చైనా గాడిలో పెట్టడం తో పాటు అమెరికాతో జరుగుతున్న ట్రేడ్ వార్ లో పైచేయి సాధించిందని అమెరికా యూరోపియన్ ట్రేడ్ అనలిస్ట్ లు అభిప్రాయపడుతున్నారు. తమ వాదనకు బలం చేకూరేలా వారు గణాంకాలను చూపుతున్నారు. కరోనా వైరస్ పుట్టకముందు చైనా ఆర్థిక మాంద్యం దిశగా అడుగులు వేస్తోంది. అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో చైనా దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ సమయంలో అత్యధిక స్టేక్ వ్యాల్యూ కలిగిన టెక్నాలజీకెమికల్స్ ప్రొడక్షన్ ప్లాంట్లు వాటి షేర్లలో సింహభాగం అమెరికా యూరోపియన్ పెట్టుబడిదారుల చేతుల్లో ఉన్నాయి. అంటే వాటిలో వచ్చే లాభాల్లో మెజారిటీ విదేశీ పెట్టుబడి దారులకు దక్కుతుంది. దీంతో చైనీస్ యువాన్ రోజు రోజుకూ బలహీన పడుతోంది.

ఈ క్రమంలోనే కరోనా వైరస్ చైనాను కాపాడింది. కరోనా వ్యాప్తితో మాస్కులు కూడా చైనాలో దొరకడం లేదంటూ వదంతులు వచ్చాయి. జింగ్ పిన్ కూడా చేతులెత్తేశారని పుకార్లు వచ్చాయి. దీంతో టెక్నాలజీ షేర్ల వ్యాల్యూ... వైకుంఠపాణిలో పాము కరిచినట్లుగా పైనుంచి కిందకు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా అతి తక్కువ ధరకు...బ్రహ్మాండమైన ఆఫర్లు పెట్టి మరీ ఆ షేర్లను అమ్మి సొమ్ము చేసుకోవాలని విదేశీ ఇన్వెస్టర్లు భావించారు. పరుగుపందెంలో పరిగెడుతున్నట్లు అందినకాడికి సొమ్ము చేసుకుందామని క్యూ కట్టి మరీ తమ షేర్లు అమ్ముకున్నారు. చైనా ప్రభుత్వం కోరుకుంది కూడా ఇదే. దాదాపుగా ఆ షేర్లు ఫ్రీగా...కారుచౌకగా వచ్చే సమయం లో చైనా ప్రభుత్వం యూరోపియన్ అమెరికన్ల షేర్లను కొనుగోలు చేసింది.

చైనా విసిరిన ఆర్థిక వలలో తాము చిక్కుకొని మోసపోయామని యూరోపియన్ అమెరికన్ ఇన్వెస్టర్లు భావించేసరికి....సమయం మించిపోయింది. అప్పటికే చైనా ప్రభుత్వం ఆ షేర్లను అతి తెలివిగా...కాదు కాదు...అతి తెలివితో సొంత చేసుకుంది. అలా సొంతం చేసుకున్న చాలా కంపెనీలను చైనా జాతీయం చేసింది. ఈ దెబ్బతో చైనా ఎటువంటి రాజకీయ సంక్షోభం లేకుండానే తమ గడ్డ మీద ఉన్న విదేశీ కంపెనీలలో చాలా కంపెనీలను దాదాపుగా ఉచితంగా సొంతం చేసుకుంది. కరోనా నిజంగానే ప్రాణాంతక వైరస్..అందులో అనుమానం లేదు. ఈ మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెంది వేలాది ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. కానీ ప్రపంచ వ్యాప్తంగా చైనా ప్రచారం చేసినంత ప్రమాదకరమైన వైరస్ మాత్రం కాదనేది యూరోపియన్ అమెరికన్ ఇన్వెస్టర్ల వాదన. చైనా తన టార్గెట్ రీచ్ అయింది. ఎందుకంటే ఇపుడు చైనా కరోనా వైరస్ యాంటీ వ్యాక్సిన్ ను మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. దానిని ప్రపంచ దేశాలన్నీ ఎగడబి మరీ కొంటాయి. ఈ రకంగా చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుంది. కరోనా వెనుక చైనా ఇంత కుట్ర చేసిందా...అంటే యూరోపియన్ అమెరికన్ ట్రేడ్ అనలిస్ట్ లు అవుననే సమాధానం ఇస్తున్నారు. ఈ కాన్స్ పిరసీ థియరీకి మరింత అథెంటిక్ ఎవిడెన్స్ దొరికితే గానీ అంతర్జాతీయంగా చైనా కుట్ర బట్టబయలు కాదు.

2 comments:

  1. The conspiracy theory may be a little farfetched. Exploiting any situation for its own gain- Yes China is a past master in that.

    ReplyDelete
    Replies
    1. No, Animal form is not a fiction.It is a First hand information of real russian communist politics which the author has seen with his eyes.The Big brother of the famous novel is also a truth camouflaged in fiction.

      Please know how Andrew Jackson, the american patriot fought against Illuminati bankers who are trying to capture American economy through a central bank.If you know how they Established The Federal Bank of America, You would not strike out the conspiracy theory of Carona.

      Delete

Related Posts Plugin for WordPress, Blogger...