మండలి రద్దు ఖాయం..కేంద్రం గ్రీన్ సిగ్నల్ : బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఏపీ శాసనమండలిపై కీలక నిర్ణయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీ వికేంద్రీకరణ బిల్లు కి అడ్డుపడుతుందన్న కోపంతో ఏకంగా సీఎం జగన్ మండలిని పీకేయడానికి నిర్ణయం తీసుకోని - అత్యవసరంగా అసెంబ్లీని సమావేశ పరిచి ..మండలి రద్దు పై అసెంబ్లీ లో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మాట్లాడుతూ ...ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు - అధికారంలో ఉన్న ఒక పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని మండలిలో ఉన్న కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యతిరేకిస్తుంటే ఊరికే కూర్చోవాల్సిన అవసరం లేదు అంటూ మండలి రద్దుని తెరపైకి తీసుకొచ్చారు.
కానీ అసెంబ్లీ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పటికీ కూడా కొందరు రాజకీయ ప్రముఖులు - టీడీపీ నేతలు మండలి రద్దు పై కేంద్రం ఇప్పుడప్పుడే ఒక నిర్ణయం తీసుకోదు అని - కేంద్రం దీనిపై కొంత సమయం తీసుకుంటుంది అని - పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందటం అంత సులభం కాదు అంటూ మాట్లాడుతున్నారు. కానీ అందులో ఏమాత్రం కూడా నిజం లేదు అని తాజాగా జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అర్థమౌతుంది. మండలి రద్దు పై కేంద్రం అతి త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుంది అని బీజేపీ నేతల మాటల బట్టే చెప్పవచ్చు.
ఈ మండలి రద్దు వ్యవహారం పై మాట్లాడిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు.. మండలి రద్దు అంశాన్ని కేంద్రం రాజకీయ కోణంలో చూడటం లేదని - ఈ అంశం పై రాజ్యాంగం ప్రకారమే ప్రక్రియను ముందుకు తీసుకెళతామని - ఆలస్యం చేయడం - తొందరగా పూర్తి చేయడం లాంటివేవీ ఉండవని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని - వ్యవస్థకు లోబడే నిర్ణయాలు ఉంటాయని చెప్పారు. 169(1) ప్రకారం అసెంబ్లీ.. తీర్మానాన్ని చేస్తే దాన్ని కేంద్రం ముందుకు తీసుకెళ్లాలి తప్ప తాము చేసేదేమీ ఉండదని తెలిపారు.
ఇకపోతే ఈ మండలి రద్దు వ్యవహారం పై కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పడానికి మరో కారణం కూడా ఉంది అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అదేమిటంటే ... 2014లో అధికారం చేపట్టే నాటికి బీజేపీకి రాజ్యసభలో పెద్దగా సంఖ్యా బలం లేదు. లోక్ సభలో బంపర్ మెజారిటీ వున్న బీజేపీకి - ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రతీ కీలక బిల్లు సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి యూపీఏ పక్షాల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఒకానొక సందర్బంలో సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ప్రజాస్వామ్యబద్దంగా లోక్ సభలో మెజారిటీలో ఏర్పాటైన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను రాజ్యసభలో బలం వుందన్న ఉద్దేశంతో అడ్డుకుంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా ఇదే అంశం పై మండలి రద్దు తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు.
ఇన్ని రద్దుల ఘోష దేనికి?
ReplyDeleteఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే రద్దు చేసి, దాని భూమిని చుట్టుపక్కల రాష్ట్రాలకు పంచేస్తే సరి.
బోలెడు యుధ్ధాలు ముగుస్తాయి.
కొందరి కళ్ళు చల్లబడతాయి.
మోదీ గారి కన్నా జగన్ తెలివైనవాడు. మోదీ గారికి రాజ్యసభను రద్దుచేయాలని ఎందుకు తోచలేదో!
ReplyDeleteFYVKI రాజ్యసభను రద్దు చేసే విధానం బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ గారు సంవిధానంలో రాయలేదు.
Deleteశాసన మండలి ఏర్పాటు & రద్దు ఎలా చేయాలో ఆర్టికల్ 169 స్పష్టంగా చెప్పింది. గతంలో ఇదే అధికరణ ప్రకారం రామారావు మండలి రద్దు చేసాడు. మీ ప్రియతమ నాయకుడు చంద్రబాబు అప్పట్లో సదరు రద్దుకు అనుకూలంగా మాట్లాడాడు. మీ ప్రకారం మామా అల్లుళ్ళకు తెలివి ఉన్నట్టా లేదా?
This comment has been removed by the author.
DeleteThis comment has been removed by the author.
ReplyDeleteమొదటి సంగతి. చంద్రబాబు నా ప్రియతమ నాయకుడన్నది మీఊహాగానం మాత్రమే.
ReplyDeleteరెండవ సంగతి. రాజ్యాంగంలో ప్రస్తుతం లేకపోయినా రాజ్యాంగం సవరణకు అతీతం కాదు. ఐతే రాజ్యసభ కలిసి రాకుండా అలా సవరించటం కుదరదు. కాని మండలిని రద్దుచేయాలంటే మండలి అభిప్రాయం అవసరంలేదు.
మూడవ సంగతి. అప్పట్లో రామారావు మండలి రద్దు నిర్ణయం నాటి విపక్ష వారసులైన నేటి అధికారపక్షానికి హఠాత్తుగా ఉచితం అనిపించిందేమీ? మరి నేటి నేత తండ్రి చేసిన మండలి పునరుద్దరణ చారిత్రిక తప్పిదం అని ఒప్పుకోక తప్పించుకోలేరు. ఏమి చేసినా మానేతల చేతలు సరైనవే ఆనేస్తానంటే కుదరదు.
చంద్రబాబు మీ ప్రియతమ నాయకుడో కాదో పక్కన పెడితే, అప్పట్లో మండలి రద్దుకు సమర్తించిన అతగాడికి తెలివి ఉన్నట్టా లేనట్టా?
Deleteజగన్ గారు రామారావు మండలి రద్దు ఉచితం కనుక తానూ చేస్తానని ఎప్పుడూ అనలేదు. చంద్రబాబు & అతగాడి భజన బృందం మండలి విషయంలో పాటిస్తున్న ద్వంద పరిమాణాలను ఎత్తి చూపడంలో తప్పేమిటి?
ఈనాడు రామోజీ రావును సభాహక్కుల ఉల్లంఘన నేరం కింద మండలి శిక్షించదలిసినప్పుడు రామారావు అసమదీయ రక్షణ కోసం మండలి రద్దుకు ఒడికట్టాడు. పచ్చమీడియా పైత్యాలు అప్పుడూ ఇప్పుడూ వెర్రిమొగ్గలు వేయడం షరా మామూలే.
మీకు మండలి రద్దు నచ్చకపోవొచ్చును కానీ దానికి అవతలి వారి (ముఖ్యంగా ఎటువంటి సంబంధం లేని మోడీ గారి) తెలివితేటల ప్రస్తావన అవసరమా? కొందరు పచ్చ భక్తులు తెలంగాణకు ఎన్ని రాజధానులు ఉండాలో అని ఎకసెక్కాలు చేస్తున్నారు, ఇది పైత్యానికి పరాకాష్ట.
చివరిగా సంవిధాన సవరణ ద్వారా రాజ్యసభ రద్దు చెల్లదు. మండలికి మల్లె రాజ్యసభ శాసనసభ నిర్మితం కాదు, పైపెచ్చు basic structure of constitution లో భాగం. Please refer to Keshavananda Bharati & other relevant case law for further reference.