బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

లాక్ డౌన్ పై సస్పెన్స్..20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ

PM-Narendra-Modi-annouced-Rs-20-lakh-crore-for-self-development

లాక్ డౌన్ పై సస్పెన్స్..20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీ

కరోనా మహమ్మారిపై కొనసాగిస్తున్న పోరులో కీలక దశగా భావిస్తున్న లాక్ డౌన్ ను కొనసాగించాలా? లేదంటే... ఈ నెల 17తోనే ఎత్తేయాలా? అన్న విషయంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనదైన మార్క్ సస్పెన్స్ ను కొనసాగించాలనే నిర్ణయించుకున్నారు. లాక్ డౌన్ కారణంగా నానాటికీ కుదేలవుతున్న ఆర్థిక రంగానికి ఊపిరిలూదేలా లాక్ డౌన్ ను ఈ నెల 17తో ముగిస్తారని దాదాపుగా అన్ని వర్గాలు భావిస్తే... అందుకు విరుద్ధంగా వ్యవహరించిన మోదీ.. అసలు లాక్ డౌన్ ను పొడిగించాలా? వద్దా? అన్న విషయంపై ఈ నె 18 లోగా నిర్ణయం తీసుకుంటామని చావు కబురు చల్లగా చెప్పేశారు. అయితే కుదేలైన ఆర్ధిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించేలా ఏకంగా రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి మోదీ కీలక ప్రసంగం చేశారు.
సుదీర్ఘంగా సాగిన ఈ ప్రసంగంలో కరోనా వైరస్ భారత్ తో పాటుగా ప్రపంచ దేశాలను ఏ మేర ఇబ్బంది పెట్టంది? ఇంకా భవిష్యత్తులో ఈ వైరస్ కారణంగా ఎన్నెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయంపైనే మోదీ చాలా సేపు ప్రసంగించారు. నాలుగు నెలల నుంచి కరోనా మహమ్మారితో యావత్తు ప్రపంచం అలుపెరగని పోరాటం చేస్తోందని మోదీ పేర్కొన్నారు. ఇప్పటికే 42 లక్షల మంది ఈ వైరస్ బారిన పడ్డారని పేర్కొన్న మోదీ... 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. అసలు కరోనా వైరస్ ప్రపంచాన్ని ఇంతలా దెబ్బ తీస్తుందని ఏచ ఒక్కరూ ఊహించలేకపోయారని కూడా మోదీ వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాను పోరు సాగిస్తూనే ముందుకు సాగాల్సిన అవసరం ఉందని కూడా మోదీ పేర్కొన్నారు. ఇతరుల ప్రాణాలను కాపాడుకుంటూనే మనల్ని మనం కాపాడుకుంటూ ముందుకు సాగాలని మోదీ పిలుపునిచ్చారు.

కరోనా పోరులో ఇతర దేశాలకు బారత్ ఆదర్శంగా నిలిచిందని మోదీ పేర్కొన్నారు. స్వావలంభనతో సాగుతున్న భారత్... కరోనా పోరులో అన్ని దేశాలతకు మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు. పీపీఈ కిట్లు ఎన్-95 మాస్కుల తయారీలో పెరిగిన వృద్ధే ఇందుకు నిదర్శనంగా మోదీ చెప్పుకొచ్చారు. స్వావలంభన ఆధారంగా సాగుతున్న భారత్.. కరోనా నేపథ్యంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలోనూ మిగిలిన అన్ని దేశాల కంటే ముందుందని చెప్పారు. కరోనాకు ముందు.. కరోనాకు తర్వాత అని చూసుకోవాల్సిన పరిస్థితుల్లో 21 శతాబ్దం భారత్ దేనని కూడా మోదీ ఘనంగా ప్రకటించారు. మొత్తంగా కరోనా కారణంగా ఏర్పడ్డ అస్థిర పరిస్థితులను ఎదుర్కొంటూనే అందివచ్చిన అవకాశాలను చేజిక్కించుకుంటూ భారత్ ముందుకు సాగనుందని మోదీ చెప్పారు.

ఇక లాక్ డౌన్ కొనసాగింపుపై మాట్లాడిన మోదీ... సోమవారం నాడు అన్ని రాష్ట్రాల సీఎంలో నిర్వహించిన సమావేశంలో సీఎంలు చెప్పిన మాట మేరకే తుది నిర్ణయం తీసుకుంటామని మోదీ చెప్పారు. అయితే లాక్ డౌన్ కొసాగించాలా? వద్దా? అన్న అంశాన్ని ఈ నెల 18లోగా తెలియజేస్తామని మోదీ చెప్పుకొచ్చారు. ఇక కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ఆర్థిక రంగానికి ఉద్దీపనలా రూ.20 లక్షల కోట్లతో భారీ ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. ఈ ప్యాకేజీతో దేశంలోని ప్రతి పారిశ్రామికుడికి లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని బుధవారం ఈ ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి వివరాలను వెల్లడిస్తారని మోదీ ప్రకటించారు. ఈ ఆర్థిక ప్యాకేజీ విలువ దేశ జీడీపీలో 10 శాతమని ఈ ప్యాకేజీతో ఆర్థిక రంగం కోలుకునే అవకాశాలున్నాయని కూడా మోదీ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...