బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

మన సియం జగన్మోహాన్ రెడ్డిగారి నిర్ణయాలు రాష్ట్రానికి ప్రయోజనకరమా? ప్రమాదకరమా? | Are our CM Jagan Mohan Reddy decisions beneficial to the state? Dangerous?

గత సియం చంద్రబాబుగారు అధికారంలో  ఉన్నప్పుడు ఎవరూ ఆయనను ప్రశాంతంగా పరిపాలనను సాగనివ్వలేదు. ప్రత్యేక హోదా అంటూ చలసాని శ్రీనివాస్, గరుడ శివాజీ, ప్రతిపక్ష హోదాలో ఉన్న అప్పటి వైయస్సార్ సిపి నాయకులు మీడియా పరంగా ప్రతిరోజూ తెగ గగ్గోలు పెట్టారు. ఇప్పుడు ఈ చలసాని శ్రీనివాస్, గరుడ శివాజీలు ఏమైపోయారు? అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ఆంధ్రాకు ప్రత్యేక హోదా తెస్తామని బీరాలు తీసిన వైయస్సార్ సిపి నాయకులు ఎందుకు గమ్మున ఉండిపోయారు? మొత్తానికి వీళ్ళందరూ ప్రత్యేక హోదా ఊసే లేకుండా ఆంధ్రా ప్రజలను వెధవలను చేశారు. నవరత్నాలు ప్రకటించి మా ఓట్లన్నీ లాక్కుని అందలం ఎక్కిన జగన్మోహన్ రెడ్డి ఒక్క రత్నాన్ని ఇప్పటివరకూ ఎందుకు తీసుకురాలేదు?

గ్ర్రామ వాలంటీర్లు జగన్ ఏజంట్ల ? లేక ప్రజల సర్వీస్ ప్రొవైడర్ల? అర్ధం కావడం లేదు?
మద్యం లేకుండానే చేస్తానన్న ప్రభుత్వం చదువుకున్న విద్యార్థుల చేతే మద్యం అమ్మించడమేమిటి?
గబ్బు నోరేసుకుని పచ్చి అబద్ధాలు, తిట్ల పురాణాలు వల్లె వేసే జబర్దస్త్ రోజా గారు ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదు?
ఒక్కోరోజు తిండి గింజలు లేకపోతే 5రూపాయలు వెతుక్కుని అంనాకేంటీన్ లో ఆకలి తీర్చుకుందామంటే అది కూడా లేకుండా పీకేశారు. పేదవారి ఆకలి బాధను తీర్చేవారెవరు?
ఒకవేళ పథకాలలో కొత్త విధానాలు, మార్పులు చేయాలనుకుంటే అప్పటివరకూ పాత పధకాలను అమలు చేస్తూ ప్లానింగ్ అయ్యాక అప్ డేట్ చేస్తే సరిపోతుంది కదా? ఊరికి ముందే మూసేయడమెందుకు?
ఈసారి చలసాని శ్రీనివాస్ ప్రత్యేక హోదా కబుర్లు చెపితే ఆంధ్రా ప్రజలు మెడగెట్టి గెంటడం ఖాయం.
ఆంధ్రాలో పోలీస్ జులుం పెరిగిపోయింది. చిన్న,చిన్న కేసులకే వేలకు వేలు పెనాల్టీలు.. ఇదేమి రాజన్న రాజ్యం? నవరత్నాల కోసం నిధుల సేకరణ ఈ విధంగా జరుగుతుందన్న ప్రజల అనుమానం నిజమేనేమోనని అనిపిస్తోంది.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...