బ్లాగర్లకు...బ్లాగ్ వీక్షకులకు....స్వాగతం.......సుస్వాగతం
............... "బ్లాగ్ వేదిక"లోని అన్ని బ్లాగుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

అమిత్ షా సంచలన వ్యాఖ్యలు.. తప్పంతా భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూదేనట!

Central-home-minister-Amit-Shah-Targets-Opposition-On-Jammu-and-Kashmir
జమ్ము కశ్మీర్ ఇప్పటికీ సమస్యగానే మిగిలిపోవడం - అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు సాగడం - చివరకు కశ్మీర్ లోని కొంత భూభాగాన్ని పాక్ ఆక్రమించడం... వీటన్నింటికీ కారణమేమిటో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగానే కాకుండా కేంద్ర హోం మంత్రిగా కొనసాగుతున్న అమిత్ షా చెప్పేశారు. వీటన్నింటికీ మాజీ ప్రధాని - భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూనేనని ఆయన తేల్చి పారశారు. నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు - నాడు హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ న సంప్రదించకుండానే ఏకపక్షంగా వ్యవహరించిన తీరు కారణంగానే కశ్మీర్ సమస్య నేటికీ సమస్యగానే మిగిలిపోయిందని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు నెహ్రూ చేసిన తప్పుల కారణంగానే నేటికీ కశ్మీర్ రావణ కాష్టంగా మండిపోయిందని కూడా షా వ్యాఖ్యానించారు.

బీజేపీ సైద్ధాంతిక కర్త ఆరెస్సెస్ భేటీకి హాజరైన సందర్భంగా అమిత్ షా ఆదివారం ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధానినే తప్పుబట్టడం అంటే మాటలు కాదు కదా. అందుకేనేమో అమిత్ షా కూడా కాస్తంత క్లారిటీగానే అంశాల వారిగానే నెహ్రూ తప్పులను ఎత్తి చూపించారు. షా చెప్పిన నెహ్రూ తప్పులు ఏమిటన్న విషయానికి వస్తే... కశ్మీర్ అంశంపై నెహ్రూ ఐక్యరాజ్యసమితిని ఆశ్రయించడమే పెద్ద తప్పని అమిత్ షా ఆరోపించారు. అంతేకాకుండా కశ్మీర్ విషయం పట్ల నెహ్రూ ఎంచుకున్న చార్టర్ కూడా పొరపాటేనని కూడా అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ విషయంలో నెహ్రూ చార్టర్ 35ను ఎంచుకున్నారని ఇది ముమ్మాటికీ తప్పేనని చెప్పేసిన షా... చార్టర్ 35కు బదులుగా చార్టర్ 51ని ఎంచుకుని ఉంటే బాగుండేదని కూడా చెప్పారు.ఇక కశ్మీర్ లోని కొంత భాగాన్ని నాడు పాకిస్థాన్ తన్నుకుపోవడానికి కూడా నెహ్రూనే కారణమని కూడా అమిత్ షా మరో సంచలన వ్యాఖ్య చేశారు. పాక్ తో కాల్పుల విరమణకు నెహ్రూ ఒప్పుకున్నారని అదే అదనుగా దుర్బుద్ధితో ముందుకు సాగిన పాక్... కశ్మీర్ లోని కొంత భాగాన్ని తన్నుకుపోయిందని అమిత్ షా వ్యాఖ్యానించారు. పాక్ తో కాల్పుల విరమణ విషయాన్ని నాడు ఉప ప్రధానిగానే కాకుండా హోంవ మంత్రి గా ఉన్న సర్దార్ పటేల్ ను సంప్రదించకుండానే నెహ్రూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడాన్ని కూడా షా తప్పుబట్టారు. ఆ సందర్భంగా  పటేల్ ను నెహ్రూ సంప్రదించి ఉంటే... ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ అన్న పదమే వినిపించి ఉండేది కాదని కూడా అమిత్ షా ఆరోపించారు. మొత్తంగా పాక్ - భారత్ ల మధ్య ఎడతెగని వివాదాలు - కశ్మీర్ అగ్నిగుండంగా మారడానికి వేరెవరో కారణం కాదని - దానికి తొలి ప్రధాని నెహ్రూనే కారణమని అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారిపోయాయి.

1 comment:

  1. హైదరాబాద్ జునాఘద్ లలో పటేల్ సాధించినది ... కాశ్మీర్ లో నెహ్రూ సాధించలేకపోయాడు... నెహ్రూ ఖచ్చితంగా తప్పు చేసాడు

    ReplyDelete

Related Posts Plugin for WordPress, Blogger...